AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హై బీపీతో బాధపడుతున్నారా? ఇది ఒక్కటి తినండి చాలు దెబ్బకు నార్మల్ అయిపోతుంది!

Apricot Health benefits:కొన్ని ఆహార నియమాలు, చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వల్ల ఈ హై బీపీని అదుపులో ఉంచుకోవచ్చు. వాటిల్లో కొన్ని రకాల పండ్లు హై బీపీని అదుపు చేసేందుకు బాగా ఉపకరిస్తాయి. వాటిల్లో ఆప్రికాట్ పండు ప్రధానమైనది.

హై బీపీతో బాధపడుతున్నారా? ఇది ఒక్కటి తినండి చాలు దెబ్బకు నార్మల్ అయిపోతుంది!
Apricots
Madhu
|

Updated on: May 04, 2023 | 3:00 PM

Share

జీవన శైలి వ్యాధుల్లో ప్రధానమైనది రక్తపోటు(బీపీ). ఇటీవల కాలంలో ముప్పే ఏళ్ల యువకులకు కూడా రక్తపోటు సమస్యగా మారుతోంది. ముఖ్యంగా అధిక రక్తపోటు(హై బీపీ) చాలా మందిలో కనిపిస్తోంది. దీనికి ప్రధానంగా జీవనశైలి కారణం అవుతుండగా.. అనవసర ఒత్తిళ్లు, ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించడం, సరైన సమయానికి నిద్రపోవడం వంటి వాటి వల్ల వస్తోంది. అయితే కొన్ని ఆహార నియమాలు, చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వల్ల ఈ హై బీపీని అదుపులో ఉంచుకోవచ్చు. వాటిల్లో కొన్ని రకాల పండ్లు హై బీపీని అదుపు చేసేందుకు బాగా ఉపకరిస్తాయి. వాటిల్లో ఆప్రికాట్ పండు ప్రధానమైనది. ఇది బీపీని అదుపు చేయడంతో పాటు గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. మీరు ఒకవేళ హై బీపీతో బాధపడుతుంటే ఈ ఆప్రికాట్ పండును మీ రోజు వారీ డైట్ వెంటనే చేర్చుసుకోండి. ఇంకా ఆప్రికాట్ తీసుకోవడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో చూద్దాం..

పుష్కలంగా పొటాషియం..

ఈ ఆప్రికాట్ పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్త నాళాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది. మీ రక్త నాళాలను ఓపెన్ చేసి, రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి. దీని వల్ల గుండెపై ఒత్తిడి ఉండదు. బీపీ అదుపులో ఉంటుంది. అంతేకాక ఈ పండులో ఐరన్ శరీరంలో హిమోగ్లోబిన్‌ను పెంచడంలో సహాయపడుతుంది. దీని కారణంగా శరీరంలో రక్తం ఉత్పత్తి అవుతుంది. దీంతో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది.

యాంటీ ఆక్సిడెంట్లు..

ఆప్రికాట్లు ఫ్లేవనాయిడ్లకు మంచి మూలం అంతేకాక ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడే అనేక రకాల యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇది ఇన్ ఫ్లేషన్ ను తగ్గిస్తుంది. అలాగే ఈ పండు శరీరంలోని సోడియం స్థాయిని కూడా నియంత్రిస్తుంది, ఇది మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

ఆప్రికాట్ ఎలా తినాలి..

మీరు హై బీపీ ఉన్న రోగులైతే, మీరు తాజా ఆప్రికాట్ పండును పూర్తిగా తినాలి. ఎందుకంటే ఇందులో అత్యధిక యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి, ఇవి ఆరోగ్య పరంగా మేలు చేస్తాయి. కానీ మీకు అది అందకపోతే, ఎండిన ఆప్రికాట్‌లను నీటిలో నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో నీటితో పాటు తినాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..