AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

High Cholesterol Remedy: ఉల్లి టీ గురించి ఎప్పుడైనా విన్నారా? అది ఆరోగ్యాన్ని ఏం చేస్తుందో తెలిస్తే ఉలిక్కిపడతారు..

ఆయిల్ ఫుడ్ ను ఎక్కువగా తినడం, కనీస శరీర వ్యాయామం చేయకపోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. అయితే ఈ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఎన్నో పద్దతులు ఉన్నాయి. అందులో ఉల్లిపాయ టీ ఒకటి.

High Cholesterol Remedy: ఉల్లి టీ గురించి ఎప్పుడైనా విన్నారా? అది ఆరోగ్యాన్ని ఏం చేస్తుందో తెలిస్తే ఉలిక్కిపడతారు..
Onion Tea
Madhu
|

Updated on: Feb 04, 2023 | 4:20 PM

Share

ఉల్లిపాయ లేని వంటిల్లును ఊహించగలమా? కూర ఏది అయినా.. ఫ్రై అయినా.. సూప్ అయినా ఉల్లి  ఉండాల్సిందే. అది ఉంటేనే టేస్ట్. అయితే ఇది కేవలం వంట కోసమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉందని చాలా మందికి తెలియదు. అందుకే మన పెద్దలు అంటారు ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని.. నిజమే అన్ని ఔషధ గుణాలుంటాయి మరి దానిలో. ముఖ్యంగా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించే గుణాలు దీనిలో పుష్కలంగా ఉంటాయి. ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. నిజానికి మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడానికి మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం, చెడు ఆహారపు అలవాట్లే కారణం. మనలో చాలా మంది ఇష్టమైన ఆహారాన్ని తింటున్నప్పుడు అది మన ఆరోగ్యానికి మంచి చేస్తుందా? చెడు చేస్తుందా? అన్న సంగతిని పట్టించుకోరు. ఆయిల్ ఫుడ్ ను ఎక్కువగా తినడం, కనీస శరీర వ్యాయామం చేయకపోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. అయితే ఈ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఎన్నో పద్దతులు ఉన్నాయి. అందులో ఉల్లిపాయ టీ ఒకటి. ఏంటి ఉల్లిపాయ టీ నా? అలాంటి టీ కూడా ఒకటి ఉందా? అని ఆశ్చర్యపోతున్నారా? ఉందండీ.. దానితో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఔషధ గని.. ఉల్లి..

ఉల్లిపాయతో ఎన్నో రోగాలు నయమవుతాయి. అందులో ప్రధానంగా అధిక కొలెస్ట్రాల్ పై ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఉల్లిపాయతో తయారుచేసిన టీని తాగితే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇట్టే కరిగిపోతాయంటున్నారు నిపుణులు. పిప్పరమెంట్ టీ, చామంతి టీ, మందారం వంటి టీలను తాగే వారు చాలా మందే ఉన్నారు కానీ ఉల్లిపాయ టీని తాగేవారు చాలా తక్కువే. కానీ ఉల్లిపాయ టీని తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఉల్లిపాయ టీలలో ఫ్లేవనాయిడ్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రోటీన్ లేదా చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది.

చెడు కొలెస్ట్రాల్ కు చెక్..

ఉల్లిపాయ ఎక్కువగా తీసుకోవడం ద్వారా సాధారణంగా మన శరీరంలో చెడు లిపిడ్లు పేరుకుపోకుండా చేస్తుంది. ఇక ఉల్లిపాయ టీ మన శరీరంలో ఎక్కువైన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఉల్లిపాయ టీని తాగడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. ఇది రక్త నాళాలను శుభ్రపరుస్తుంది. అలాగే ఇది మంచి కొలెస్ట్రాల్ ను పెంచడానికి సహాయపడుతుంది కూడా. మంచి కొలెస్ట్రాల్ పెరిగితే చెడు కొలెస్ట్రాల్ ఆటోమెటిక్ గా తగ్గిపోతుంది.

ఇవి కూడా చదవండి

రక్తనాళాలు క్లీన్ గా..

ఉల్లిపాయలలో కొన్ని ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్ ఉంటాయి. ఈ రెండూ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇవి రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడతాయి. రక్త నాళాల గోడలను ఆక్సీకరణ నష్టం నుంచి రక్షించడానికి సహాయపడతాయి. ఈ విధంగా అధిక కొలెస్ట్రాల్, తక్కువైన రక్త ప్రసరణ సమస్యను తగ్గించడానికి ఉల్లిపాయ టీ ప్రయోజనకరంగా ఉంటుంది.

గుండె ఆరోగ్యం పదిలం..

ఉల్లిపాయ టీలో యాంటీఆక్సిడెంట్లు, ఇతర సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర ఇన్ ఫ్ల మేషన్ ను తగ్గిస్తాయి. అలాగే ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. ఫలితంగా గుండె జబ్బుల ప్రమాదాన్ని మరింత తగ్గిస్తుంది. అలాగే అధిక రక్తపోటును తగ్గించడానికి, రక్తం గడ్డకట్టకుండా నిరోధించడానికి సహాయపడతాయి.

ఉల్లి టీ తయారీ ఇలా..

ఉల్లిపాయ టీని చాలా సులువుగా తయారుచేయొచ్చు. ముందుగా ఒక ఉల్లిపాయను కట్ చేసి 2 కప్పుల నీటిలో వేసి మరిగించండి. ఈ నీరు సగం అయ్యే వరకు మరిగిస్తూ ఉండండి. అవసరం అయితే రెండు మూడు మిరియాలు, ఒక ఏలక్కాయ, ఒక అర టీ స్పూన్ సోంపు గింజలు కూడా వేసుకోవచ్చు. ఈ తర్వాత ఈ నీటిని వడకట్టి అందులో కొద్దిగా తేనె, నిమ్మరసం వేసి కలుపుకోవాలి. కావాలనుకుంటే కొద్దిగా ఉప్పును కూడా వేసుకోవచ్చు. కాస్త చల్లార నిచ్చి గోరు వెచ్చగా వచ్చకా తాగితే మంచి ఫలి తాలు ఉంటాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..