AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

milk side effects: తల్లులారా జాగ్రత్త! పిల్లలకు పాలలో ఇవి కలిపి పెట్టారో ఇక అంతే..

పాలతో పాటు కలిపి ఇచ్చే వాటి విషయంలో కూడా తల్లులు జాగ్రత్త వహించాలని నిపుణులు చెబుతున్నారు. పాలతో పాటు కొన్ని రకాల పదార్థాలు కలిపి తీసుకోవడం అనర్థాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.

milk side effects: తల్లులారా జాగ్రత్త! పిల్లలకు పాలలో ఇవి కలిపి పెట్టారో ఇక అంతే..
Milk Combination Avoid
Madhu
|

Updated on: Feb 04, 2023 | 6:00 PM

Share

పాలు మంచి పౌష్టికాహారం. ప్రతి రోజూ తీసుకోవాలని నిపుణులు సైతం సూచిస్తుంటారు. ముఖ్యంగా పిల్లలలకు తప్పనిసరిగా పాలు తాగించాలి. దీనిలో పుష్కలంగా లభించే కాల్షియం ఎములకు పుష్టి నిస్తాయి. అయితే ఆ పాలు కూడా మీ పిల్లలకు అనారోగ్యాన్ని కలుగుజేస్తాయని మీకు తెలుసా? పాలు ఆరోగ్యం అంటూనే.. అనారోగ్యం అంటున్నారేమిటి అని ఆశ్చర్యపోతున్నారా? పాలు ఆరోగ్యమే కానీ.. వాటిలో కలిపి తీసుకొని పదార్థాల విషయంలోనే జాగ్రత్త అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఓ సారి చూద్దాం..

ఎంత శ్రద్ధ చూపిస్తున్నా..

తల్లులు పిల్లల ప్లేట్‌పై ఉంచే ఆహారం విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటారు. ఆరోగ్యకరమైన, షోషకాలతో కూడిన, రుచికరమైన, బలవర్థక ఆహారం ఇస్తుంటారు. ఏ మాత్రం తేడా చేసినా పిల్లలకు అజీర్తి, గ్యాస్, కోలిక్, వికారం, వాంతులు వంటివి  ఇబ్బంది పెడతాయి. అలాగే పాలతో పాటు కలిపి ఇచ్చే వాటి విషయంలో కూడా తల్లులు జాగ్రత్త వహించాలని నిపుణులు చెబుతున్నారు. పాలతో పాటు కొన్ని రకాల పదార్థాలు కలిపి తీసుకోవడం అనర్థాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఆహార పదార్థాలు ఏమిటో చూద్దాం.

ఇవి కూడా చదవండి
  • పాలతో సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవద్దు. సిట్రస్ ఫ్రూట్స్ అంటే ద్రాక్ష, నిమ్మకాయలు, ఆరెంజ్ వంటి పండ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ పాలతో పాటు తీసుకోకూడదు. ఇలాచేస్తే కడుపు నొప్పి రావొచ్చు.
  • పాలు, పెరుగు తీసుకున్న రెండు గంటల తరువాత నువ్వులు, ఉప్పు పదార్ధాల్ని తీసుకుంటే మంచిది. అలాగని కలిపి ఒకేసారి తీసుకోకూడదు. అదే సమయంలో పనస, కాకరకాయల్ని కూడా పాలతో కలిపి తీసుకోకూడదు. దీనివల్ల దురద, సోరియాసిస్ వంటి సమస్య ఎదురవుతుంది.
  • మినపప్పు పదార్ధాలు కూడా పాలతో తీసుకోకూడదు. మినుములో ఉండే పోషక పదార్ధాలు పాలతో కలిస్తే..వాంతులు, కడుపు బరువెక్కడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
  • ఆయుర్వేదం ప్రకారం, అరటిపండ్లు, పాలు శరీరంలో టాక్సిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అరటిపండ్లు, పాలు కలిపి తీసుకున్నప్పుడు నిద్రపై ప్రభావితం చూపుతుంది.
  • ద్రాక్ష వంటి ఆమ్ల పండ్లతో సంబంధంలోకి వచ్చినప్పుడు పాలలోని ప్రోటీన్ ఘనీభవిస్తుంది. ఇది జీర్ణకోశ నొప్పి, అతిసారం కలిగిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..