AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raw Carrot: క్యారెట్ పచ్చిగా తింటే ఏమవుతుందో తెలుసా? మీ ఆరోగ్యానికి అది మంచి చేస్తుందా? చెడు చేస్తుందా? తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి..

క్యారెట్ ను ఉడకబెట్టి, లేదా వండుకొని తినేకన్నా పచ్చిగా తింటేనే దానిలోని పోషకాలు పుష్కలంగా శరీరానికి అందుతాయని వివరిస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు అధిక ప్రయోజనాలు చేకూరుతాయని చెబుతున్నారు.

Raw Carrot: క్యారెట్ పచ్చిగా తింటే ఏమవుతుందో తెలుసా? మీ ఆరోగ్యానికి అది మంచి చేస్తుందా? చెడు చేస్తుందా? తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి..
Carrots Health Benefits
Madhu
| Edited By: |

Updated on: Dec 29, 2022 | 5:16 PM

Share

మనం ఇంట్లో చాలా మంది పచ్చి కూరగాయలు తినేస్తూ ఉంటారు. పిల్లలు కూడా పచ్చిగా ఉండగానే క్యారెట్, బీట్రూట్ వంటివి తింటూ ఉంటారు. అది ఆరోగ్యానికి మంచిదా.. కాదా అన్న విషయంపై చాలా మందికి సందేహాలు ఉండి ఉండొచ్చు. దీనిపై నిపుణులు ఏమి చెబుతున్నారో ఓ చూద్దాం.. సాధారణంగా కూరగాయలను వండుకొని, లేదా ఉడకబెట్టుకొని తింటూ ఉంటాం. అయితే వాటిని పచ్చిగా తింటేనే మరింత ఆరోగ్యాన్నిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా క్యారెట్ ను ఉడకబెట్టి, లేదా వండుకొని తినేకన్నా పచ్చిగా తింటేనే దానిలోని పోషకాలు పుష్కలంగా శరీరానికి అందుతాయని వివరిస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు అధిక ప్రయోజనాలు చేకూరుతాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పచ్చి క్యారెట్ ను తినడం ద్వారా ఆరోగ్యానికి చేకూరే ప్రయోజనాలు ఏంటి? పచ్చి క్యారెట్ తింటే శరీరంలో ఏం జరుగుతుంది అన్న అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.

హార్మోన్ల సమతుల్యత.. మీరు పచ్చి క్యారెట్‌ను తిన్నప్పుడు, దానిలోని ఫైబర్ అదనపు ఈస్ట్రోజెన్‌ ఉత్పత్తి కాకుండా నిరోధిస్తుంది. వాస్తవానికి ఈస్ట్రోజెన్‌ అధికమైతే మొటిమలు, PMS, మూడ్ హెచ్చుతగ్గులు మొదలైన వాటితో సహా వివిధ హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. అలాగే పచ్చి క్యారెట్లు పేగుల్లోని చెడు బ్యాక్టీరియాల సంఖ్యను తగ్గించడంలో సహాయపడతాయి.

ఎండోటాక్సిన్‌ డిటాక్స్.. శరీరంలోని ఎండోటాక్సిన్, బ్యాక్టీరియా, ఈస్ట్రోజెన్ లను పచ్చి క్యారెట్లు బాగా నియంత్రిస్తాయి. రోజూ ఒక పచ్చి క్యారెట్ తీసుకోవడం ద్వారా అధిక మోతాదులో ఎండోటాక్సిన్‌, కార్టిసాల్, ఈస్ట్రోజెన్‌ లు వృద్ధి చెందకుండా చేస్తుంది. ఎండోటాక్సిన్ల డిటాక్స్ కు క్యారెట్లు దివ్యౌధంలా పనిచేస్తాయి.

ఇవి కూడా చదవండి

సమృద్ధిగా విటమిన్ ఏ .. క్యారెట్లలో విటమిన్ A ఎక్కువగా లభ్యమవుతుంది. ఒక సర్వింగ్ ద్వారా మీ రోజువారీ పోషక విలువలో 184% అందిస్తుంది. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ( FDA) లెక్కల ప్రకారం 4 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు రోజుకు కనీసం 700 నుంచి 900 మైక్రోగ్రాముల విటమిన్ A అవసరం. ఒక పచ్చి క్యారెట్‌ తింటే అందుకు తగిన విటమిన్ A ఉంటుందని FDA చెబుతోంది.

అదనపు ఈస్ట్రోజెన్‌ను తొలగిస్తుంది.. క్యారెట్‌లో ప్రత్యేకమైన ఫైబర్‌లు ఉంటాయి. జీర్ణ ప్రక్రియను నియంత్రించడంతోపాటు ఇవి అదనపు ఈస్ట్రోజెన్‌ను తగ్గించడానికి సాయపడుతుంది. అలాగే కాలేయం మరింత సమర్ధవంతంగా పనిచేయడానికి సాయపడుతుంది.

క్లియర్ స్కిన్.. క్యారెట్లు విటమిన్ ఏ, బీటా కెరోటిన్‌తో నిండి ఉంటాయి. అందువల్ల, పచ్చి క్యారెట్‌లను తినడం వల్ల మొటిమలను తగ్గించడంతోపాటు మంటను తగ్గించడం, సెల్ టర్నోవర్ (సహజ ఎక్స్‌ఫోలియేషన్)ను ప్రోత్సహించడం ద్వారా మచ్చలను నివారించడంలో సహాయపడుతుంది.

థైరాయిడ్ బ్యాలెన్స్‌లో.. విటమిన్ ఏ థైరాయిడ్ పనితీరుపై అనుకూల ప్రభావం చూపుతుంది. క్యారెట్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. కాబట్టి హైపోథైరాయిడిజం ఉన్నవారికి క్యారెట్‌లు గొప్ప వరం లాంటిది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..