Best Foods: ‘ఆహాహా భోజనంబు.. అరుదైన వంటకంబు’ ప్రపంచ వంటకాల్లో భారత్ ఏ స్థానంలో ఉందంటే?

షల్ మీడియా, ఇంటర్నెట్ ప్రతిఒక్కరికీ  అందుబాటులోకి వచ్చిన తర్వాత.. తమకు నచ్చిన మెచ్చిన ఆహారాన్ని పద్దతులను పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక దేశపు ఆహార పదర్ధాలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2022 లో ప్రపంచ వ్యాప్తంగా నచ్చిన మెచ్చిన సాంప్రదాయ వంటలు ఏమిటో తెలుసా.. మన భారత దేశం ఎన్నో స్తానాన్ని దక్కించుకుందో తెలుసుకుందాం..

Best Foods: 'ఆహాహా భోజనంబు.. అరుదైన వంటకంబు' ప్రపంచ వంటకాల్లో భారత్ ఏ స్థానంలో ఉందంటే?
World's Best Cuisine Awards
Follow us
Surya Kala

| Edited By: Ravi Kiran

Updated on: Dec 26, 2022 | 6:51 PM

ప్రపంచంలో అనేక దేశాలు.. విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాలు.. ఆహారపు అలవాట్లు.. అయితే ఇప్పుడు ప్రపంచం మొత్తం అరచేతుల్లో దర్శనం ఇస్తుంది. ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం , విద్య ఇలా రకరకాల కారణాలతో దేశ సరిహద్దులు దాటి ప్రజలు మరొక ప్రాంతానికి పయణం అవుతున్నారు. అక్కడ సాంస్కృతిక సాంప్రదాయాలను తమదిగా చేసుకుని జీవిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియా, ఇంటర్నెట్ ప్రతిఒక్కరికీ  అందుబాటులోకి వచ్చిన తర్వాత.. తమకు నచ్చిన మెచ్చిన ఆహారాన్ని పద్దతులను పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక దేశపు ఆహార పదర్ధాలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2022 లో ప్రపంచ వ్యాప్తంగా నచ్చిన మెచ్చిన సాంప్రదాయ వంటలు ఏమిటో తెలుసా.. మన భారత దేశం ఎన్నో స్తానాన్ని దక్కించుకుందో తెలుసుకుందాం..

టేస్ట్‌ అట్లాస్ వరల్డ్స్ బెస్ట్ క్యూసిన్ అవార్డ్స్ 2022లో భారతీయ వంటకాలు 5వ ర్యాంక్‌ను పొందాయి. రేటింగ్‌ 5 కి గాను 4.54 రేటింగ్ ను అందుకుని ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఇష్టపడే సాంప్రదాయ వంటల్లో ఐదో ప్లేస్ ను దక్కించుకుంది. బల్గేరియాకు చెందిన ఫుడ్ వెబ్‌సైట్ లో భారతదేశంలో అత్యుత్తమా రేటింగ్ పొందిన ఆహారంగా  “గరం మసాలా, నెయ్యి, మలై, బటర్ గార్లిక్ నాన్, కీమా, 460 నిలిచాయి. అయితే వరల్డ్స్ బెస్ట్ క్యూసిన్ అవార్డ్స్ 2022లో ఇటాలియన్ వంటకాలు మొదట ప్లేస్ ను దక్కించుకున్నాయి. ప్రపంచంలోని అత్యుత్తమ వంటకాల జాబితాలో ఇటాలియన్ డిషెస్ అగ్రస్థానంలో ఉన్నాయి. గ్రీక్ వంటకాలు రెండవ స్థానంలో ఉండగా.. స్పానిష్ వంటకాలు, జపనీస్ వంటకాలు వరుసగా థర్డ్, ఫోర్త్ ప్లేస్ లో నిలిచాయి.

ఇవి కూడా చదవండి

అయితే, ప్రపంచంలోని అత్యుత్తమ ‘సాంప్రదాయ’ వంటకాలలో.. భారతదేశానికి చెందిన షాహీ పనీర్ మాత్రమే టాప్ 50 ర్యాంకింగ్‌లో చోటు దక్కించుకుంది. షాహీ పనీర్  28వ స్థానంలో నిలిచింది. దేశ రాజధాని ఢిల్లీలోని ‘కేక్ డా హోటల్‌’కు చెందిన “షాహీ పనీర్.. టేస్ట్ అట్లాస్ ప్రపంచంలోని అత్యుత్తమ వంటకాల్లో 5కి గాను 4.66 రేటింగ్ ను అందుకుంది. ఇది మొఘల్ వంటకం. షాహి పనీర్ ను పనీర్, ఉల్లిపాయలు, బాదం పేస్ట్ , స్పైసీ, టొమాటో-క్రీమ్ సాస్‌తో తయారు చేయబడే జున్ను కూర. ఈ వంటకాన్ని సాధారణంగా నాన్స్, రోటీ లేదా పూరీ వంటి భారతీయ రొట్టెలతో కలిపి తింటారు. ఇదే విషయాన్ని ఫుడ్ వెబ్‌సైట్ పేర్కొంది.

మరోవైపు, న్యూఢిల్లీలోని గులాటీకి చెందిన బటర్ చికెన్ 4.56 రేటింగ్‌తో 53వ స్థానంలో నిలిచింది. దస్తార్ఖ్వాన్ రచించిన లక్నో కుర్మా ప్రపంచంలోని అత్యుత్తమ 100 ‘సాంప్రదాయ’ వంటకాల్లో 55వ ర్యాంక్‌లో నిలిచింది. గోవాలోని వెనైట్‌కు చెందిన విందాలూ 71 స్థానాన్ని కైవసం చేసుకోగా.. ఇదే ర్యాంక్‌తో  ITC కోహెనూర్ కి చెందిన హైదరాబాదీ  బిర్యానీ కూడా నిల్చింది.

టేస్ట్‌అట్లాస్ జాబితా 2022 ప్రకారం ప్రపంచంలోని టాప్ 5 “ఉత్తమ సాంప్రదాయ వంటకాలు” వరుసగా- కరే (జపాన్), పికాన్హా (బ్రెజిల్), అమీజోస్ ఎ బుల్హావో పాటో (పోర్చుగల్), టాంగ్‌బావో (చైనా)..  గుయోటీ (చైనా)లు నిలిచాయి.

టేస్ట్‌అట్లాస్ ర్యాంకింగ్ ప్రకారం..  భారతీయ వంటకాలను ప్రయత్నించడానికి ఉత్తమ సాంప్రదాయ రెస్టారెంట్‌ల లిస్ట్ లో శ్రీ థాకర్ భోజనాలయ్ (ముంబై), కరవల్లి (బెంగళూరు), బుఖారా (న్యూఢిల్లీ), దమ్ పుఖ్త్ (ఢిల్లీ), కొమోరిన్ (గురుగ్రామ్), గిరిమంజాస్ (మంగళూరు), కినారా ధాబా గ్రామం (వాక్సాయ్), అన్నలక్ష్మి (చెన్నై), మావల్లి టిఫిన్ రూమ్స్ (బెంగళూరు), మొదలైనవి ఉన్నాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే