Onion Chutney Recipe: క్షణాల్లో టేస్టీ టేస్టీ ఉల్లిపాయ పచ్చడి చేసుకోవడం ఎలా? బ్యాచిలర్స్ మిస్ కావద్దు..

ఉల్లిపాయ‌ల‌ను వంట‌ల‌లో ఉప‌యోగించ‌డ‌మే కాకుండా వీటితో ఎంతో రుచిగా ఉండే ఉల్లి ఆవకాయ వంటి పచ్చళ్ళను కూడా తయారు చేస్తారు. అయితే ఈరోజు మనం ఉల్లిపాయను కాల్చి రుచికరంగా తయారు చేసే పచ్చడి గురించి తెలుసుకుందాం.. దీని తయారీ కూడా చాలా ఈజీ..

Onion Chutney Recipe: క్షణాల్లో టేస్టీ టేస్టీ ఉల్లిపాయ పచ్చడి చేసుకోవడం ఎలా? బ్యాచిలర్స్ మిస్ కావద్దు..
Roasted Onion Chutney
Follow us

|

Updated on: Dec 22, 2022 | 4:44 PM

కావాల్సిన పదార్ధాలు 

ఉల్లిపాలు -3 తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొన్ని కొత్తిమీర పచ్చి మిర్చి -10 నూనె జీలకర్ర- ఒక టీ స్పూన్ మెంతులు- కొంచెం ఉప్పు- రుచికి సరిపడా వెల్లుల్లి రెమ్మలు చింత పండు- కొంచెం

ఇవి కూడా చదవండి

తాళింపుకి కావల్సిన దినుసులు 

కరివేపాకు వెల్లుల్లి ఎండుమిర్చి జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇంగువ -కొంచెం

తయారీ విధానం: పొట్టు తీసిన ఉల్లిపాలను స్విమ్ లో పెట్టిన మంటపై కాల్చుకోవాలి. తర్వాత ఒక బాణలి తీసుకుని అందులో కొంచెం నూనె వేసుకుని వేడి ఎక్కిన తర్వాత కట్ చేసుకున్న పచ్చి మిర్చి వేసుకుని వేయించుకోవాలి. తర్వాత జీలకర్ర, మెంతులు, కొంచెం చింత పండు వేసుకుని వేయించాలి. తర్వాత పక్కన పెట్టుకుని కాల్చిన ఉల్లిపాయ పై పోర తీసి.. ముక్కలు గా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ తీసుకుని అందుకో వేయించిన పచ్చి మిర్చి, మెంతులు, జీలకర్ర , చింత పండు, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, వెల్లుల్లి వేసుకుని కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ ఉల్లిపాయ చెట్నీ లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద బాణలి పెట్టి.. కొంచెం నూనె వేసుకుని వేడి ఎక్కిన తర్వాత పోపు దినుసులు.. కరివేపాకు ,వెల్లుల్లి ,ఎండుమిర్చి ,జీలకర్ర,మినపప్పు ,శనగపప్పు ,ఇంగువ వేసుకుని వేయించి ఈ పోపుని ఉల్లిపాయ పచ్చడిలో వేసుకుని కలుపుకోవాలి. అంతే టేస్టీగా ఈజీగా ఉల్లిపాయ పచ్చడి రెడీ.. ఇది ఉల్లిపాయ ప‌చ్చ‌డిని, నెయ్యిని వేసుకుని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అంతేకాదు ఇడ్లి, దోసె వంటి టిఫిన్స్ లోకి కూడా బాగుంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ