AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diet Tips: రాత్రి భోజనం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త.. బాగుందని ఆశపడి ఎక్కవ తిన్నారో ఇక అంతే..

సాధారణంగా చాలామంది రాత్రి సమయాల్లో ఇంటి దగ్గర ఉండటంతో  ఇష్టమైన పదార్థాలతో కొంత పుష్టిగా భోజనం చేస్తారు. కాని రాత్రి పూట ఆహారం పరిమితంగా తీసుకోవాలంటున్నారు డైటీషియన్స్. ఎక్కువుగా లిమిట్ లేకుండా రాత్రి భోజనం చేస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయని..

Diet Tips: రాత్రి భోజనం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త.. బాగుందని ఆశపడి ఎక్కవ తిన్నారో ఇక అంతే..
Heavy Food
Amarnadh Daneti
|

Updated on: Dec 22, 2022 | 2:20 PM

Share

సాధారణంగా చాలామంది రాత్రి సమయాల్లో ఇంటి దగ్గర ఉండటంతో  ఇష్టమైన పదార్థాలతో కొంత పుష్టిగా భోజనం చేస్తారు. కాని రాత్రి పూట ఆహారం పరిమితంగా తీసుకోవాలంటున్నారు డైటీషియన్స్. ఎక్కువుగా లిమిట్ లేకుండా రాత్రి భోజనం చేస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. మన్ డైట్ లో డిన్నర్ ను పక్కాగా ప్లాన్ చేసుకుంటే బరువు కూడా తగ్గవచ్చంటున్నారు.  శారీరక వ్యాయామాలు చేసినా చాలా మంది బరువు తగ్గడం లేదని బాధపడుతుంటారు. ఒకవేళ మీరు వ్యాయమం, జిమ్ వంటివి చేస్తున్నా.. బరువు తగ్గడం లేదంటే మన డైట్ సరిగ్గా తీసుకోవడం లేదని అర్థం. డిన్నర్​ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే.. బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. బరువు మాత్రమే కాకుండా వివిధ ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదముందంటున్నారు.  భోజనం ఆకలి ఆధారంగా తీసుకుంటారు. కాని కొంతమంది ఎంత ఎక్కువ భోజనం చేసినా.. ఆకలిగా అనిపిస్తుంది. అలాంటి వారు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించడం మంచిది. సాధారణంగా  రాత్రి పూట భోజనంలో క్రింది జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

వీలైనంత త్వరగా రాత్రి భోజనం

రాత్రి 8 గంటలకు ముందే డిన్నర్ చేయాలని చాలామంది డైటీషియన్లు సిఫార్సు చేస్తున్నారు. అంటే.. నిద్రపోవడానికి కనీసం 3 గంటల ముందు డిన్నర్ ముగించాలి. డిన్నర్ ఎప్పుడూ లైట్​గానే ఉండాలి. తొందరగా తినాలి కాబట్టి.. ముందుగానే ఫుడ్ రెడీగా ఉండేలా చూసుకోవాలి. ఆఫీస్​లో ఉన్నా.. ఇంట్లో ఉన్నా.. బయటకు వెళ్లినా తొందరగా డిన్నర్ ముగించేలా ప్లాన్ చేసుకోవాలి.

తినాల్సిన ఆహారం

రాత్రి భోజనంలో ఏమి తీసుకోవాలనే సందేహం చాలామందికి కలుగుతుంది. మొదటిది ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. వీలైతే వాటిని పూర్తిగా వదిలేయాలి. పిండి పదార్థాలను రాత్రి భోజనంలో తినకూడదు. పప్పులు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి వాటిని తినవచ్చు. జున్ను, చేపలు, చికెన్ వంటి ప్రోటీన్లను తినవచ్చు. సలాడ్ కూడా తినొచ్చు. తద్వారా శరీరానికి ఫైబర్ అందుతుంది. ఇది పొట్టను శుభ్రంగా ఉంచడంలో సహాయంచేస్తుంది.

ఇవి కూడా చదవండి

తక్కువ మొత్తంలో తీసుకోవాలి

అల్పాహారం, భోజనం కంటే రాత్రి భోజనం చాలా తక్కువుగా తీసుకోవాలి అంటున్నారు డైటీషన్లు. రాత్రి భోజనం లిమిట్​గా ఉండేలా చూసుకోమంటున్నారు. ఎందుకంటే రోజు చివరిలో మన జీవక్రియ చాలా మందగిస్తుంది కాబట్టి. ఈ సమయంలో అధిక కొవ్వు, ప్రోసెస్​ చేసిన ఆహారం తింటే.. అది జీర్ణమవ్వడానికి చాలా టైమ్ పడుతుంది. అంతేకాకుండా ఊబకాయం, షుగర్ వంటి వ్యాదుల బారిన పడే అవకాశం ఉంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..