Telangana: అవసరమైతే కిడ్నీ ఇస్తా.. డ్రగ్స్‌ కేసులో ఆరోపణలపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణ రాజకీయాల్లో సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. ఇటీవల డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పాత్ర ఉందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ఆరోపించారు. మంత్రి కేటీఆర్‌కు కూడా డ్రగ్స్‌ కేసుతో సంబంధం ఉన్నట్లు పరోక్షంగా..

Telangana: అవసరమైతే కిడ్నీ ఇస్తా.. డ్రగ్స్‌ కేసులో ఆరోపణలపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
Minister Ktr
Follow us
Amarnadh Daneti

|

Updated on: Dec 20, 2022 | 5:38 PM

తెలంగాణ రాజకీయాల్లో సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. ఇటీవల డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పాత్ర ఉందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ఆరోపించారు. మంత్రి కేటీఆర్‌కు కూడా డ్రగ్స్‌ కేసుతో సంబంధం ఉన్నట్లు పరోక్షంగా  విమర్శలు చేశారు. ఈ క్రమంలో బండి సంజయ్ కామెంట్స్‌పై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు స్పందించారు. డ్రగ్స్‌ టెస్టు కోసం తన రక్త నమూనాలు, కిడ్నీ ఇస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే తనాఉ ఇక్కడే ఉంటానని, పరీక్షల కోసం వైద్యులను తీసుకుని రావాలన్నారు. తానపై చేసిన ఆరోపణలు అవాస్తవమైతే బండి సంజయ్‌ కరీంనగర్‌ చౌరస్తాలో చెప్పుతో కొట్టుకుంటారా అంటూ సవాల్ విసిరారు. రాజకీయంగా ఎదుర్కొలేక వేటకుక్కలను వేట కుక్కలను వదులుతున్నారని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. తనపై ఎన్ని ఆరోపణలు చేసినా.. అవ్వన్నీ అవాస్తవమేనని, క్లీన్‌ చిట్‌తో బయటకు వస్తానన్నారు. తాను పరీక్షల కోసం శాంపిల్స్‌ ఇస్తానని, అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇమ్మని కోరతానని కీలక వ్యాఖ్యలు చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా వేములవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహారాష్ట్రలో కొన్ని గ్రామాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలని కోరుతున్నారని  అన్నారు.  తనపై పోటీ చేయాలనుకున్నవారు ఓ రెండు మంచి పనులు ఎక్కువ చేయాలని సూచించారు. పొద్దున లేస్తే.. కొందరు నాయకులు సీఎం కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రతిపక్షాలు తమపై మాటల యుద్ధం చేస్తే.. ప్రజలే తమను కాపాడాలన్నారు. ప్రజల ఆశీస్సులు ఉంటే.. కేసీఆర్‌ను  ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు. గత ప్రభుత్వాలు తెలంగాణను పట్టించుకోలేదని మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..