AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆటోడ్రైవర్‌ సమయస్పూర్తి.. ఆత్మహత్య చేసుకోబోయిన యువకుడిని కాపాడిన వైనం

సాటి మనిషి ప్రమాదంలో ఉన్నాడని గ్రహించిన ఆటో డ్రైవర్‌ శివ ఆలస్యం చేయకుండా వాహనాన్ని డోర్నకల్‌ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అపస్మారస్థితికి చేరిన వ్యక్తి వద్ద ఉన్న ఫోన్‌ తీసుకుని ఆయన ఆటోలో మాట్లాడిన వ్యక్తి నెంబరుకు కాల్‌ చేశారు.

Telangana: ఆటోడ్రైవర్‌ సమయస్పూర్తి.. ఆత్మహత్య చేసుకోబోయిన యువకుడిని కాపాడిన వైనం
Auto Driver Saves A Young Man
Surya Kala
|

Updated on: Dec 20, 2022 | 6:21 PM

Share

ఓ ఆటోడ్రైవర్‌ సమయస్పూర్తి ఓ వ్యక్తి నిండు ప్రాణాన్ని కాపాడి, ఆ కుటుంబాన్ని పెను విషాదంనుంచి బయటపడేసింది. డోర్నకల్‌ లింగాల అడ్డామీదుగా వెళ్తున్న ఓ ఆటోను ఆపి ఓ యువకుడు ఎక్కాడు. గోవింద్రాల స్టేజి వరకు వెళ్లాలని చెప్పాడు. ఆటో డ్రైవర్ ఆ వ్యక్తిని ఆటో ఎక్కించుకుని ముందుకు పోతున్నాడు. ఈ క్రమంలో ఆటోలో కూర్చున్న యువకుడు తన సోదరికి ఫోన్‌ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, అందుకు తాను ఆల్రెడీ పురుగులు మందు తాగానని, ఆటోలో ఇంటికి వస్తున్నానని చెప్పాడు. అది విన్న ఆటోడ్రైవర్‌ తనకెందుకులే అనుకోలేదు. సాటి మనిషి ప్రమాదంలో ఉన్నాడని గ్రహించిన ఆటో డ్రైవర్‌ శివ ఆలస్యం చేయకుండా వాహనాన్ని డోర్నకల్‌ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అపస్మారస్థితికి చేరిన వ్యక్తి వద్ద ఉన్న ఫోన్‌ తీసుకుని ఆయన ఆటోలో మాట్లాడిన వ్యక్తి నెంబరుకు కాల్‌ చేశారు. ఇంతకు ముందు మీతో మాట్లాడిన వ్యక్తిని ఆసుపత్రిలో చేర్చానని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు.

ఈలోగా బాధితుడికి పీహెచ్‌సీ సిబ్బంది ప్రథమ చికిత్స చేశారు. ఆటోడ్రైవర్‌ ఇచ్చిన సమాచారంతో బంధువులను తీసుకుని ఆసుపత్రికి చేరుకున్న తల్లి సుశీల కొడుకుని చూసి కన్నీరు మున్నీరయ్యారు. స్పృహ తప్పిన ఆమెకు అక్కడే చికిత్స అందించారు. బాధిత వ్యక్తి స్వస్థలం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గోవింద్రాల గ్రామానికి చెందిన పేరు భూక్య లాలు గా బాధితుడి బంధువులు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఏమిటనేది తమకు తెలియదన్నారు. బాధితుడిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చామని 108 ఈఎంటీ శ్రీనివాస్‌, పైలట్‌ సైదులు తెలిపారు. పురుగుల మందు తాగిన వ్యక్తిని సమయస్ఫూర్తితో పీహెచ్‌సీకి తీసుకొచ్చిన ఆటో డ్రైవర్‌ శివను ప్రతి ఒక్కరూ ప్రశంసించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వైజాగ్ వెళ్లేవారికి అదిరిపోయే శుభవార్త.. సికింద్రబాద్‌ నుంచి
వైజాగ్ వెళ్లేవారికి అదిరిపోయే శుభవార్త.. సికింద్రబాద్‌ నుంచి
అటుకులు పెసరపప్పు పాయసం.. ఒక్కసారి రుచి చూస్తే ప్రతి పండగకూ ఇదే..
అటుకులు పెసరపప్పు పాయసం.. ఒక్కసారి రుచి చూస్తే ప్రతి పండగకూ ఇదే..
నిరుద్యోగులకు అలర్ట్‌.. ఆదాయపు పన్ను శాఖలో 119 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు అలర్ట్‌.. ఆదాయపు పన్ను శాఖలో 119 ఉద్యోగాలు!
దసరాకు ధమాకా.. 'కింగ్ 100' నుంచి దిమ్మతిరిగే సర్‌ప్రైజ్‌
దసరాకు ధమాకా.. 'కింగ్ 100' నుంచి దిమ్మతిరిగే సర్‌ప్రైజ్‌
CM విజయ్‌ను తన పెళ్లికి ఆహ్వానించిన అనిరుధ్
CM విజయ్‌ను తన పెళ్లికి ఆహ్వానించిన అనిరుధ్
RRB రైల్వే రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. పూర్తి షెడ్యూల్‌ ఇదే
RRB రైల్వే రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. పూర్తి షెడ్యూల్‌ ఇదే
ఇంటర్‌ విద్యార్థులకు ఊరట.. అందరికీ పబ్లిక్‌ పరీక్షలు రాసే ఛాన్స్‌
ఇంటర్‌ విద్యార్థులకు ఊరట.. అందరికీ పబ్లిక్‌ పరీక్షలు రాసే ఛాన్స్‌
అద్భుతంగా ఉంది.. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి..
అద్భుతంగా ఉంది.. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి..
మనీ ప్లాంట్ మట్టిలో పాలు పోస్తున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహం కోసం
మనీ ప్లాంట్ మట్టిలో పాలు పోస్తున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహం కోసం
125 ఏళ్ల తర్వాత మళ్లీ రిపీట్.. ఈ సారి ఫిబ్రవరిలోనే పీక్ సమ్మర్
125 ఏళ్ల తర్వాత మళ్లీ రిపీట్.. ఈ సారి ఫిబ్రవరిలోనే పీక్ సమ్మర్