Naga Kanya: పాములాగా యువతి వింత చేష్టలు.. నేనే నాగకన్యను.. గుడి కట్టాలంటూ డిమాండ్

ఓ యువతి తానొక నాగకన్యనంటూ వింత వింతగా ప్రవర్తిస్తోంది. ఇంట్లో ఎక్కువగా ఒంటరిగా ఉంటూ, చుట్టుపక్కల పాము పుట్టలు, నాగదేవత ఆలయాలకు వెళ్లి పూజలు చేయడం చేస్తోంది.

Naga Kanya: పాములాగా యువతి వింత చేష్టలు.. నేనే నాగకన్యను.. గుడి కట్టాలంటూ డిమాండ్
Naga Kanya
Follow us
Surya Kala

|

Updated on: Dec 12, 2022 | 7:23 PM

నేనే నాగకన్యను. నా శరీరంలోకి నాగకన్య ఆవహించింది. కూలిపోయిన ఆలయాన్ని మళ్లీ కట్టేవరకూ నేను నాగకన్యగానే ఉంటాను అంటూ ఓ యువతి వింత చేష్టలు చేస్తుంది. అచ్చం పాములా ప్రవర్తిస్తూ రోజూ నాగదేవత గుడికి వెళ్లి పూజలు చేస్తోంది. ఈ ఘటన తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని సైదాపూర్‌ మండలం ఎగ్లాస్‌పూర్‌కు చెందిన కృష్ణవేణి అనే యువతి డిగ్రీ వరకూ చదువుకుంది. ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పనిచేసేది. అనారోగ్యంతో తల్లిదండ్రులు చనిపోవడంతో నానమ్మవద్ద ఉంటోంది. ఈ క్రమంలో నాలుగేళ్లుగా ఈ యువతి తానొక నాగకన్యనంటూ వింత వింతగా ప్రవర్తిస్తోంది. ఇంట్లో ఎక్కువగా ఒంటరిగా ఉంటూ, చుట్టుపక్కల పాము పుట్టలు, నాగదేవత ఆలయాలకు వెళ్లి పూజలు చేయడం చేస్తోంది. అంతేకాదు, తన శరీరంలో మార్పులు వస్తున్నాయని, తన శరీరంపై గీతలు ఏర్పడుతున్నాయని చెబుతోంది. నాగినిలా డాన్స్‌ చేస్తుంది. గ్రామశివారులో ఉన్న నాగదేవత విగ్రహాలకు గుడి నిర్మించాలని, అప్పుడు తన శరీరంలోనుంచి నాగకన్య వెళ్లిపోతుందని చెబుతోంది. ఈ క్రమంలో చట్టుపక్కల వారు యువతి వింత చేష్టలకు భయాందోళన చెందుతున్నారు.

అయితే కృష్ణవేణి మాత్రం తాను చాలా ఏళ్ల క్రితమే నాగకన్యగా మారానని, తనకు కలలో పాములు కనిపిస్తాయని, గుడిని నిర్మించాలని కోరుతోంది. స్థానికులు కొందరు యువతి మానసిక పరిస్థితి సరిగా లేనందువల్లే అలా ప్రవర్తిస్తుందంటున్నారులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..