AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: నగరంలో మరో భారీ స్కామ్.. వత్తులు, బొట్టు బిళ్లల తయారీ పేరుతో రూ. 200 కోట్ల టోకరా

బయటకు వెళ్లే పరిస్థితి లేని మహిళలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాన్న ఆలోచనతో.. కేటుగాళ్ల మాటలు గుడ్డిగా నమ్మి మోసపోతున్నారు. దీపాల్లో వేసే వత్తులు, మహిళలు పెట్టుకునే బొట్టు బిళ్లల తయారీ పేరుతో రావుల కొల్లు రమేశ్‌ అనే వ్యక్తి ఏకంగా 200 కోట్లు వసూలు చేసి ఉడాయించాడు.

Hyderabad: నగరంలో మరో భారీ స్కామ్.. వత్తులు, బొట్టు బిళ్లల తయారీ పేరుతో రూ. 200 కోట్ల టోకరా
Hyderabad Cheating
Surya Kala
|

Updated on: Nov 29, 2022 | 3:21 PM

Share

కాదేదీ కవితకనర్హం అన్నాడు నాడు శ్రీ శ్రీ.. నేడు మోసానికి కాదేది అనర్హం అంటున్నారు కొందరు కేటుగాళ్లు. సామాన్యుల బలహీనతలను ఆసరాగా తీసుకొని, నమ్మించి ఉన్నదంతా దోచుకొని ఉడాయిస్తున్నారు. అలాంటి భారీ మోసం హైదరాబాద్ నగరంలో బయటపడింది. ఆ కేటుగాడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అమాయక మహిళలను నమ్మించి దాదాపు రూ.  200 కోట్లతో పత్తా లేకుండా పారిపోయాడు. వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్‌ నగరంలో మరో భారీ స్కామ్ బయటపడింది. ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించే అవకాశం. గృహిణులు కూడా ఆదాయం ఆర్జించే సువర్ణావకాశం అంటూ.. రకరకాల ప్రకటనలు ఇస్తూ అమాయకులను బుట్టలో వేసుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. బయటకు వెళ్లే పరిస్థితి లేని మహిళలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాన్న ఆలోచనతో.. కేటుగాళ్ల మాటలు గుడ్డిగా నమ్మి మోసపోతున్నారు. దీపాల్లో వేసే వత్తులు, మహిళలు పెట్టుకునే బొట్టు బిళ్లల తయారీ పేరుతో రావుల కొల్లు రమేశ్‌ అనే వ్యక్తి ఏకంగా 200 కోట్లు వసూలు చేసి ఉడాయించాడు.

నగరంలోని ఏఎస్‌రావునగర్‌లో ఆర్‌ఆర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో ఓ సంస్థను కొల్లు రమేశ్‌ స్థాపించాడు. దీపాల్లో వేసే వత్తులు, బొట్టు బిళ్లల తయారీకి వినియోగించే యంత్రాలను విక్రయించాడు. దీపం వత్తులు తయారు చేసే యంత్రం ఒక లక్షా 70 వేలు కాగా.. బొట్టు బిళ్లల యంత్రం లక్షా 40 వేల చొప్పున వినియోగదారులకు విక్రయించాడు. తాను ఇచ్చే ముడిసరుకుతో వత్తులు, బొట్టు బిళ్లలు తయారు చేస్తే కిలోల చొప్పున డబ్బు చెల్లిస్తానని చెబుతూ.. బాధితులను బుట్టలో వేసుకున్నాడు. ఈ మోసగాడి మాటలు నమ్మిన బాధితులు వాళ్ల బంధువులతో సైతం మిషిన్లు కొనిపించారు. కొన్నిరోజులకు సరుకు కొనడం లేదేంటి అని నిలదీస్తే.. అందరికి బాండ్లు రాసిచ్చాడు. పెద్దమొత్తంలో డబ్బులు వచ్చాక పత్తా లేకుండాపోయాడు. రమేశ్ బోర్డు తిప్పేసిన విషయాన్ని తెలుసుకున్న బాధితులు.. పోలీసులను ఆశ్రయించారు. కుషాయిగూడా పోలీస్‌స్టేషన్‌లో బాధితులంతా ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఛీటింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ మోసంలో సుమారు 1100 మంది బాధితులున్నట్టు సమాచారం.

ఇవి కూడా చదవండి

TV9 , Reporter

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..