విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన దంపతులు.. అమ్మానాన్న కావాలని కన్నీరు పెట్టుకున్న కూతురు.. జడ్జి కంట తడి
ఇలాంటి సన్నివేశాలను సీరియల్స్ , సినిమాల్లో చేస్తూ ఉంటాం.. కానీ నిజ జీవితంలో కూడా చోటు చేసుకుంది. కోర్టు లో తన తల్లిదండ్రులు విడాకులు తీసుకుంటున్న సమయంలో చిన్నారిని ఎవరు కావాలని అడిగితే ఆ చిన్నారి చెప్పిన సమాధానం జడ్జి కంట కన్నీరు పెట్టించింది. ఈ ఘటన తెలంగాణాలో చోటు చేసుకుంది.
పెళ్లి అంటే మూడు ముళ్ళు, ఏడు అడుగులు.. నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో పిల్లాపాపలతో కలిసి జీవించడం కోసం దంపతులు చేసే ప్రయాణం. ఒకానొక సమయంలో దంపతుల మధ్య చిన్న చిన్న గొడవలు ఏర్పడినా సర్దుకుపోయేవారు. పెద్దల మాటకు.. కుటుంబానికి సమాజానికి విలువ ఇస్తూ.. జీవితాన్ని భార్యాభర్తలు తమ జీవితాంతం ఒకరికొకరు తోడునీడగా అన్నట్లు గడిపేవారు. అయితే కాలక్రమంలో వచ్చిన మార్పుల్లో భాగంగా విదేశీ సంస్కృతి అయిన విడాకులు మనదేశంలో కూడా అడుగు పెట్టాయి. కారణం ఏదైనా సరే.. తమకు విడాకులు కావాలంటూ దంపతులు కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. అయితే భార్యాభర్తలుగా విడిపోతూ.. తమ పిల్లల ఫీలింగ్స్ తో ఆడుకున్నామని కొందరు పట్టించుకోవడం లేదు.. ఇలాంటి సన్నివేశాలను సీరియల్స్ , సినిమాల్లో చేస్తూ ఉంటాం.. కానీ నిజ జీవితంలో కూడా చోటు చేసుకుంది. కోర్టు లో తన తల్లిదండ్రులు విడాకులు తీసుకుంటున్న సమయంలో చిన్నారిని ఎవరు కావాలని అడిగితే ఆ చిన్నారి చెప్పిన సమాధానం జడ్జి కంట కన్నీరు పెట్టించింది. ఈ ఘటన తెలంగాణాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఓ చిన్నారికి న్యాయస్థానంలో విషమ పరిస్థితి ఎదురైంది. అయినప్పటికీ గుక్కతిప్పుకోకుండా సమాధానమిచ్చింది. దీంతో కోర్టులో జడ్జిని ఆలోచనలో పడేసింది. ఒకవైపు అమ్మ.. మరోవైపు నాన్న.. నీకు ఎవరు కావాలంటూ న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు.. వారిద్దరూ కావాలని ఆరేళ్ల చిన్నారి వెంటనే సమాధానం చెప్పింది. చిన్నారి కోరిక విన్న జడ్జి .. వెంటనే ఆ చిన్నారిని దగ్గరకు తీసుకుని అక్కున చేర్చుకున్నారు. వెంటనే.. పాప భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మీరు కలిసి జీవించండి అంటూ తల్లిదండ్రులను కోరారు. షాద్‌నగర్ పట్టణంలోని కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్ సందర్భంగా ఈ దృశ్యం ఆవిష్కృతమైంది.
కల్వకుర్తి పరిధిలోని మాడ్గుల గ్రామానికి చెందిన భార్యాభర్తలు విడాకుల కోసం లోక్‌అదాలత్‌ని ఆశ్రయించారు. తల్లి వద్ద ఉంటున్న ఆరేళ్ల బాలికతో న్యాయమూర్తి సీఎం రాజ్యలక్ష్మి మాట్లాడారు. నీవు ఎవరి వద్ద ఉంటావు అని అడిగారు.. వెంటనే.. ఆ చిన్నారి తనకు తల్లిదండ్రులిద్దరూ కావాలంటూ కంటతడి పెట్టింది. చిన్నారిని చూసి రాజ్యలక్ష్మి చలించిపోయారు. అనంతరం భార్యాభర్తలు విడిపోవడం వల్ల పిల్లలు భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది దంపతులకు అవగాహన కల్పించారు. కలిసి ఉండాలని కోరడంతోపాటు ఆలోచించుకునేందుకు 15 రోజులగడువు ఇచ్చారు జడ్జి రాజ్యలక్ష్మి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..