Yadagirigutta: యాదగిరి గుట్టకు పోటెత్తిన భక్తులు.. భారీ సంఖ్యలో సత్యనారాయణ స్వామి వ్రత పూజలు

తెలుగు రాష్ట్రాల్లో రమా సత్యనారాయణ స్వామి వ్రతానికి అన్నవరం ప్రసిద్ధిగాంచిందన్న సంగతి తెలిసిందే. అన్నవరం క్షేత్రం తర్వాత ఆ స్థాయిలో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించే క్షేత్రం యాదగిరి గుట్ట.

Yadagirigutta: యాదగిరి గుట్టకు పోటెత్తిన భక్తులు.. భారీ సంఖ్యలో సత్యనారాయణ స్వామి వ్రత పూజలు
Devotees Rush In Yadagirigu
Follow us
Surya Kala

|

Updated on: Nov 13, 2022 | 5:18 PM

తెలంగాణాలో ప్రముఖ పుణ్య క్షేత్రం యాదగిరి గుట్టలో భక్తుల రద్దీ నెలకొంది. కార్తీక మాసం.. ఆదివారం సెలవు రోజు కావడంతో శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. స్వామి వారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో పాటు కార్తీక మాసం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేశారు. దీంతో స్వామి వారి ఉచిత దర్శనానికి దాదాపు మూడు గంటలు,ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుంది…అలాగే బ్రేక్ దర్శనానికి సైతం భక్తులు అధిక సంఖ్యలో వెళ్లారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి…లడ్డు ప్రసాదం కౌంటర్లు, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కల్యాణ కట్ట ప్రాంతాల్లో భక్తుల సందడి నెలకొంది. కార్తీక మాసం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించుకుని దీపారాధన చేసుకుంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో రమా సత్యనారాయణ స్వామి వ్రతానికి అన్నవరం ప్రసిద్ధిగాంచిందన్న సంగతి తెలిసిందే. అన్నవరం క్షేత్రం తర్వాత ఆ స్థాయిలో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించే క్షేత్రం యాదగిరి గుట్ట. ఇక్కడ ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలతో తమ కుటుంబ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుతూ భక్తులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ జరిగే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజలను కుటుంబ సభ్యులతో పాటు బంధు,మిత్రులు పాల్గొంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి