AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: చాణక్య చెప్పిన ఈ విషయాలను పాటించండి.. జీవితంలో విజయం మీ పాదాక్రాంతమవుతుంది..

సరైన సమయం, సరైన మార్గం.. మనిషి తాను ఏ పని చేపట్టినా ముందుగా సమయం ఎంత, స్నేహితులు ఎవరు, ఖర్చులు ఏమిటి? నేను ఎంత మేరకు కష్టపడగలను శక్తి సామర్ధ్యం గురించి మళ్లీ మళ్లీ ఆలోచించాలని చాణక్య చూచించాడు. 

Chanakya Niti: చాణక్య చెప్పిన ఈ విషయాలను పాటించండి.. జీవితంలో విజయం మీ పాదాక్రాంతమవుతుంది..
Chanakya Niti
Surya Kala
|

Updated on: Nov 12, 2022 | 12:11 PM

Share

ఆచార్య చాణక్యుడి విధానాలు నేటి తరం కూడా ఆచరించదగినవి. చాణక్యుడు మానవ జీవితం గురించి చెప్పిన విషయాలపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉంది. ప్రజలు ఇప్పటికీ తమ జీవితానికి చాణక్యుడి బోధనలను అన్వయించుకోవడానికి ఇదే కారణం. ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు మాత్రమే కాదు  మంచి గురువు కూడా. చాణక్య నీతి ప్రకారం ప్రతి మనిషి జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటాడు. ఎల్లవేళలా సుఖసంతోషాలు, శ్రేయస్సు, ఐశ్వర్యం, కీర్తి తో చిరకాలం జీవించాలని ఆయన కోరిక. ఆచార్య చాణక్యుడి మనిషి జీవితంలో సక్సెస్ అందుకోవాలంటే.. కాలానుగుణంగా తన ప్రవర్తన మార్చుకోవాలని సూచించాడు. అవి ఏమిటో తెలుసుకుందాం..

సరైన సమయం, సరైన మార్గం.. మనిషి తాను ఏ పని చేపట్టినా ముందుగా సమయం ఎంత, స్నేహితులు ఎవరు, ఖర్చులు ఏమిటి? నేను ఎంత మేరకు కష్టపడగలను శక్తి సామర్ధ్యం గురించి మళ్లీ మళ్లీ ఆలోచించాలని చాణక్య చూచించాడు.

ఆచార్య చాణక్య ప్రకారం, సరైన సమయం, సరైన స్నేహితుడు, సరైన స్థలం, డబ్బు సంపాదించడానికి సరైన మార్గాలు. అదే సమయంలో డబ్బు ఖర్చు చేయడానికి సరైన మార్గం ..  మీ శక్తి వనరు వంటివి పరిగణలోకి తీసుకోవాలని సూచించాడు. ఇవి భవిష్యత్తులో ఉపయోగపడతాయి. దీని అర్థం మీరు సరైన సమయం కోసం వేచి ఉండాలి. తదనుగుణంగా జీవితంలో నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగాలని సూచించాడు.

ఇవి కూడా చదవండి

ప్రవర్తన: చాణక్య విధానం ప్రకారం, ఒక మనిషి ప్రవర్తనలో అమాయకత్వం లేదా సూటి దనం ఉండకూడదు. అడవిలో నిటారుగా ఉండే చెట్లను ముందుగా నరికి వేస్తారు.. వంకరగా ఉన్న చెట్లు దీర్ఘకాలం నిలబడి ఉంటాయని గుర్తుంచుకోండి. అందుకే మనుషులు తమ ప్రవర్తనను కాలానుగుణంగా మార్చుకోవాలని సూచించాడు.

సరైన నిర్ణయం:

మనిషి తన జీవితంలో స్థిరమైన వాటిని విడిచిపెట్టి.. అశాశ్వతమైన వాటి కోసం వెంటపడతాడు. ఈ ప్రపంచంలోని మనిషి తనకు స్థిరమైన జీవితాన్ని ఇచ్చే వాటిపై దృష్టి పెట్టి.. అస్థిరమైన విషయాలకు దూరంగా ఉండడం మేలు.

ఆచార్య చాణక్యుడు ప్రకారం.. ఖచ్చితమైన అంటే సరైనదానిని విడిచిపెట్టి.. అనిశ్చితమైన విషయాల కోసం పాకులాడితే.. ఈ వ్యక్తి పతనంపై వైపు పయనిస్తాడు. అందుకే ఏ నిర్ణయం తీసుకున్నా సరే తప్పు, ఒప్పులను చూసుకోవాలని సూచించాడు. చాణక్య విధానం ప్రకారం, ఒక వ్యక్తి తన పరిమితుల్లో పని చేయాలి. గంభీరంగా భావించే సముద్రంలో ఉప్పెన వస్తే.. తన హద్దులను మరచిపోతుంది. అయితే ఉత్తమ వ్యక్తి తనకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే తన పరిమితిని ఎల్లప్పుడూ ఉల్లంఘించడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)