Tirumala: హాటు కేకుల్లా అమ్ముడైన శ్రీవారి దర్శన టికెట్లు.. టీటీడీకి ఎంత ఆదాయం వచ్చిందో తెలుసా..?

టీటీడీ శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లను ఈరోజు ఉదయం 10 గంటలకు  విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచడంతో స్వామివారి ప్రత్యేక దర్శన టికెట్లు హాటు కేకుల్లా అమ్ముడయ్యాయి.

Tirumala: హాటు కేకుల్లా అమ్ముడైన శ్రీవారి దర్శన టికెట్లు.. టీటీడీకి ఎంత ఆదాయం వచ్చిందో తెలుసా..?
Tirumala Tirupati Devasthanam
Follow us
Surya Kala

|

Updated on: Nov 11, 2022 | 1:10 PM

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తెలుగు ప్రజలు మాత్రమే కాదు.. దేశ విదేశాల భక్తులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈ నేపథ్యంలో టీటీడీ శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లను ఈరోజు ఉదయం 10 గంటలకు  విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచడంతో స్వామివారి ప్రత్యేక దర్శన టికెట్లు హాటు కేకుల్లా అమ్ముడయ్యాయి. డిసెంబ‌ర్‌ నెల‌ కోటాకు సంబంధించిన‌ రూ.300 శ్రీవారి ప్రత్యేక దర్శన టోకెన్లను విడుదల చేసిన వెంటనే బుకింగ్ చేసుకున్నారు భక్తులు. కేవలం 80 నిమిషాల్లోనే  5,06,600 టికెట్లు బుక్ చేసేసుకున్నారు భక్తులు.  టికెట్ బుకింగ్ సమయంలో ఎలాంటి అంతరాయం ఏర్పడకపోవడంతో కేవలం విడుదల చేసిన గంట .20 నిమిషాల్లోనే బుక్ చేసుకున్నారు. ముఖ్యంగా బుకింగ్ సమయంలో జియో మార్ట్ క్లౌడ్ టెక్నాలజీ సహకారం అందించడంతో..  భక్తులకు బుకింగ్ అవస్థలు తప్పినట్లు తెలుస్తోంది. డిసెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ రూ.300 దర్శన టికెట్ల విక్రయం ద్వారా టీటీడీకి రూ.15.20 కోట్ల ఆదాయం లభించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

డిసెంబర్రూ కు సంబంధించిన .300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను  టీటీడీ ఇవాళ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచి..  ఈ దర్శన టికెట్ల‌ను బుక్ చేసుకోవాలని టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొన్న సంగతి తెలిసిందే. మరోవైపు తిరుమల తిరుపతిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం శ్రీవారిని 61,304 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.46 కోట్లు లభించింది. మరోవైపు 31 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు.  సర్వదర్శనం చేసుకునే భక్తులకు శ్రీవారి దర్శనం కోసం సుమారు 24 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?