Ganesh Puja: జీవితంలో ఆటంకాలను తొలగించే వినాయకుడిని పూజించడానికి ఐదు నియమాలు.. పూజ విశేషాలు
ఏదైనా శుభ కార్యలు మొదలు పెట్టే సమయంలోనైనా, పనులు ప్రారంభించేటపుడు కృతువుల్లో, పూజల్లో ప్రథమ పూజ గణపతికి చేస్తుంటారు. ఇలా చేయడం వలన ఎటువంటి అడ్డంకులు లేకుండా సక్సెస్ అవుతాయని నమ్మకం. అయితే గణపతి ఆరాధన ఎప్పుడైనా చేయవచ్చు..
సిద్ధి-ఋద్ధి ఇచ్చే వినాయకుడు లేదా ‘గణపతి’. ఏ పనికైనా, పూజకైనా ముందుగా గణపతి పూజ చేయడం హిందూ సంప్రదాయంలో ఆనవాయితీ. గణేశుడిని పూజించడం వలన జీవితానికి సంబంధించిన అన్ని దుఃఖాలు, బాధలు తొలగిపోతాయని సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్మకం. గణేశుడిని ఆటంకాలను తొలగించేవాడిగా భావించి ఏదైనా శుభ కార్యలు మొదలు పెట్టే సమయంలోనైనా, పనులు ప్రారంభించేటపుడు కృతువుల్లో, పూజల్లో ప్రథమ పూజ గణపతికి చేస్తుంటారు. ఇలా చేయడం వలన ఎటువంటి అడ్డంకులు లేకుండా సక్సెస్ అవుతాయని నమ్మకం. అయితే గణపతి ఆరాధన ఎప్పుడైనా చేయవచ్చు.. కానీ బుధవారం గణపతి ఆరాధన ప్రత్యేక ఫలితాలను పొందుతుంది. ఎందుకంటే బుధవారం గణపతి ఆరాధనకు అంకితమైనదిగా పరిగణించబడుతుంది. శివ పార్వతుల ముద్దుల తనయుడు వినాయకుని పూజకు సంబంధించిన విశేషాలను ఈరోజు తెలుసుకుందాం..
- గణపతి పూజ నియమాలు: ఏ దేవుడి పూజ అయినా నైవేద్యం సమర్పించేంత వరకు ఆ పూజ సంపూర్ణం అయినట్లు పరిగణించబడదు. అటువంటి పరిస్థితిలో.. గణపతిని పూజించేటప్పుడు.. గణపతికి ఇష్టమైన మోదకాన్ని ఖచ్చితంగా సమర్పించండి. ఇది సాధ్యం కాకపోతే అటుకులు బెల్లం నైవేద్యంగా సమర్పించండి.
- గణపతి పూజ సమయంలో.. గణపతి ఆశీర్వాదాలు పొందడానికి కుంకుమ, ఎర్రటి పువ్వులు, దర్భగడ్డిని సమర్పించండి. ఇవి గణపతికి చాలా ప్రీతికరమైనవని. వీటిని ఉపయోగించడం ద్వారా మీ కోరికలన్నీ నెరవేరుతాయని .. అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయని విశ్వాసం.
- బుధవారం రోజున ఏ కారణం చేతనైనా గణపతి ఆలయానికి వెళ్లలేకపోయినా లేదా ఇంట్లో గణపతి బొమ్మ లేకపోయినట్లు అయితే.. ఇంట్లో తమలపాకుపై పసుపు వినాయకుడుని తయారు చేసి.. పూజాదికార్యక్రమాలను నిర్వహించవచ్చు.
- ఎవరి జీవితంలోనైనా చేపట్టిన పనుల్లో అడ్డంకులు ఎదురైతే, ప్రతి బుధవారం, ‘ఓం గం గణపతయే నమః ‘ లేదా ‘ ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో బుద్ధిః ప్రచోదయాత్’ అనే మంత్రాన్ని జపించి , గణేశుడి ముందు దీపం వెలిగించండి.
- సనాతన సంప్రదాయంలో ముడి బియ్యం లేదా అక్షతకు చాలా మతపరమైన ప్రాముఖ్యత ఉంది. గణపతి పూజలో అక్షతలను ఉపయోగించడం ద్వారా గణపతి ప్రసన్నుడవుతాడని అనుగ్రహాన్ని కురిపిస్తాడని విశ్వాసం.
గణపతి పూజ ప్రాముఖ్యత:
హిందూమతంలో.. గణపతి అన్ని ఆటంకాలను తొలగించి సుఖ సంతోషాలను ఇచ్చేవాడని నమ్మకం. వినాయకుడిని పూజించడం ద్వారా జీవితంలోని అన్ని బాధలు తొలగిపోతాయని బలం, తెలివితేటలు లభిస్తాయని విశ్వాసం. ఏదైనా పనికి ముందు సర్వశక్తిమంతుడైన గణేశుడిని పూజించడం వల్ల ఆ పనికి ఎలాంటి ఆటంకాలు ఉండవని.. పూర్తి అవుతుందని నమ్మకం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)