Horoscope Today: ఈరోజు ఈ రాశివారు కీలక వ్యవహారాల్లో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.. నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

రోజులో జరిగే మంచి, చెడుల గురించి ఆలోచిస్తారు. దీంతో తమ దినఫలాల వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (నవంబర్ 10వ తేదీ ) గురువారం  రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు కీలక వ్యవహారాల్లో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.. నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today
Follow us
Surya Kala

|

Updated on: Nov 10, 2022 | 8:02 AM

Horoscope Today (10-11-2022):  రోజు మొదలైతే చాలు చాలామంది తాము ఏ పనులు మొదలు పెట్టాలన్నా రోజు ఎలా ఉంటుంది.. రోజులో జరిగే మంచి, చెడుల గురించి ఆలోచిస్తారు. దీంతో తమ దినఫలాల వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (నవంబర్ 10వ తేదీ ) గురువారం  రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేష రాశి: ఈ రాశివారు ఈరోజు అధికారులతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. కీలక పనుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.  అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. అధిక ఖర్చులు అదుపు చేసుకోవాల్సి ఉంటుంది.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు ఆర్ధిక వ్యవహారాల్లో ముఖ్య నిర్ణయాలను తీసుకుంటారు. విజయావకాశాలు మెరుగుపరుచుకుంటారు. శత్రువుల మీద విజయాన్ని నమోదు చేస్తారు.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు చేపట్టిన పనుల్లో విజయాన్ని సొంతం చేసుకుంటారు. అధిక శ్రమ పడాల్సి ఉంటుంది. ఆవేశానికి పోకుండా ఉండాల్సి ఉంటుంది. అందరినీ కలుపుకుని వెళ్లడం వలన సమస్యలు నివారించబడతాయి. ప్రయాణాల విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి.

కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశివారు ప్రతిభకు తగిన ప్రశంసలను అందుకుంటారు. శుభ సమయం. ఆత్మీయుల సలహాతో ముందుకు వెళ్లారు. కుటుంబంతో సుఖ సంతోషాలు నెలకొంటాయి.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు బంధువుతులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని ముఖ్యమైన విషయాల్లో మీరు అనుకున్న సమయానికి పూర్తీ చేస్తారు. పని తీరుతో ప్రశంసలను అందుకుంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు  చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పెద్దల సహకారంతో వాటిని పూర్తి చేస్తారు. అనుకున్న ఫలితాలు రావడానికి అధికంగా శ్రమపడాల్సి ఉంటుంది.  కీలక నిర్ణయాలను తీసుకుని ముందుకు వెళ్లడంలో తడబడతారు.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు మానసికంగా దృఢంగా ముందుకు వెళ్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు.  బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారికి మానసిక బలం తగ్గకుండా చూసుకోవాల్సి ఉంటుంది. మధ్యమ ఫలితాలు లభిస్తాయి. బంధు, మిత్రులతో కలిసి కీలక నిర్ణయాలను తీసుకుని  శుభ ఫలితాలను పొందుతారు.  ఇబ్బందులు తగ్గుతాయి.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు కుటుంబ సభ్యుల సహకారంతో విజయాలను అందుకుంటారు. శుభకాలం. చేపట్టిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. కుటుంబ వాతావరణం  అనుకూలంగా ఉంటుంది.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనుల విషయంతో తగిన సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో కలిసి ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. బాధ్యతలను నెరవేర్చేదిశగా అడుగులు వేస్తారు.

కుంభ రాశి: ఈ రోజు ఈ రాశివారు ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చేపట్టిన పనులల్లో అధిక శ్రమ పడాల్సి ఉంటుంది. సమయానికి అనుకూలంగా ముందుకు సాగాల్సి ఉంటుంది. కొందరి ప్రవర్తన బాధను కలిగిస్తుంది.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు అభివృద్ధికి సంబంధించిన వార్తను వింటారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధు, మిత్రులతో విందు వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)