AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Motivational Thoughts: మనిషి పయనానికి ఆటంకం అసూయ.. ఈరోజు అసూయ వలన కలిగే అనర్ధాల గురించి తెలుసుకుందాం..

అసూయ జీవితంలోని అన్ని దుఃఖాలకు అతి పెద్ద కారణమని మహనీయులు పేర్కొన్నారు. అసూయ వ్యక్తి జీవితంలోకి ప్రవేశిస్తే.. మొదట ఆ వ్యక్తి తనకు తాను హాని చేసుకుంటాడు. ఈరోజు అసూయ వలన కలిగే అనర్ధాల గురించి తెలుసుకుందాం.

Motivational Thoughts: మనిషి పయనానికి ఆటంకం అసూయ.. ఈరోజు అసూయ వలన కలిగే అనర్ధాల గురించి తెలుసుకుందాం..
Messages And Quotes On Jealousy
Follow us
Surya Kala

|

Updated on: Nov 06, 2022 | 11:03 AM

అసూయ ఏ కాలంలోనైనా మనిషి జీవితంపై అత్యంత ప్రభావాన్ని చూపిస్తుంది. జీవితంలో అభివృద్ధి బాటలో పయనించడానికి ఆటంకంగా మారుతుంది. అవును ఎవరైనా తమ కంటే ఆనందంగా, విజయ పథంలో పయనిస్తున్న.. అభివృద్ధి చెందుతున్నా కొంతమంది తమకు తెలియకుండానే అవతలి వ్యక్తిమీద అసూయ పడడం ప్రారంభిస్తారు. అయితే ఈ అసూయ మనిషిలో ప్రతికూల లక్షణంగా పరిగణించబడుతుంది.     అంతేకాదు.. ఆ  వ్యక్తి  ప్రతికూల ఆలోచన, అతని బలహీనత, అభద్రత భావానికి సంకేతం. కొన్నిసార్లు మీరు ఈ అసూయను ఇతరులలో చూడవచ్చు, కొన్నిసార్లు ఏదో ఒక రూపంలో ఏదో ఒక సమయంలో మీలో కూడా ఈ లక్షణం కనిపించవచ్చు. ఒక వ్యక్తిని చూస్తే అతని గురించి తక్కువ భావన, లేదా అత్యధికంగా ఆలోచించడం మొదలు పెడతాడు. అంతేకాదు అసూయ జీవితంలోని అన్ని దుఃఖాలకు అతి పెద్ద కారణమని మహనీయులు పేర్కొన్నారు. అసూయ వ్యక్తి జీవితంలోకి ప్రవేశిస్తే.. మొదట ఆ వ్యక్తి తనకు తాను హాని చేసుకుంటాడు. ఈరోజు అసూయ వలన కలిగే అనర్ధాల గురించి తెలుసుకుందాం.

  1. ఒకరి పట్ల అసూయపడటం ద్వారా, మీరు ఆ వ్యక్తికి హాని చేయలేరు. అయితే మీరు ఖచ్చితంగా మీ నిద్ర,  ఆనందాన్ని సుఖ సంతోషాలను కోల్పోతారు.
  2. ఎవరితోనైనా ఏదైనా విషయంతో మీకంటే ప్రతిభావంతుడైన వ్యక్తితో పోటీ పడే సమయంలో అతనిని మీ కంటే శక్తివంతంగా భావించినప్పుడు మీరు అసూయపడతారు.
  3. జీవితంలో మీపై ఎప్పుడూ అసూయపడే వ్యక్తులను .. ఎప్పుడూ ద్వేషించకండి. పైగా మిమ్మల్ని చూసి  అసూయ పడే వ్యక్తిని గౌరవించండి. ఎందుకంటే అలా మీ గురించి అసూయ పడేవారు తనకంటే.. మిమ్మల్నే అధికులుగా భావిస్తారు.. తన కంటే మీరే గొప్పవారు అని నిరంతరం ఆలోచిస్తాడు.
  4. అసూయపడే వ్యక్తి చాలా మూర్ఖుడు, అతను తన సమస్యలకు పరిష్కారం కనుగొనే బదులు.. అవతలి వ్యక్తిని  ఇబ్బందుల్లోకి నెట్టడానికి ప్రయత్నిస్తాడు.
  5. ఇవి కూడా చదవండి
  6. మీ స్నేహితుడు మీ విజయం పట్ల అసూయ పడితే.. అతను ఖచ్చితంగా మీ స్నేహితుడు కాలేడు. జీవితంలో అతనిని ఎల్లప్పుడూ మీ ప్రత్యర్థిగా పరిగణించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)