AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: స్త్రీలు తమ భర్తల వద్ద ఈ విషయాలను తప్పక దాచి పెడతారట.. అవేంటో ఇక్కడ తెలుసుకోండి..!

ఉత్తమ పండితులు, మేధావి, అపర చాణక్యుడిగా పేరుగాంచిన ఆచార్య చాణక్యుడి గురించి మనం కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు.

Chanakya Niti: స్త్రీలు తమ భర్తల వద్ద ఈ విషయాలను తప్పక దాచి పెడతారట.. అవేంటో ఇక్కడ తెలుసుకోండి..!
Chanakya Niti
Shiva Prajapati
|

Updated on: Nov 06, 2022 | 6:13 AM

Share

ఉత్తమ పండితులు, మేధావి, అపర చాణక్యుడిగా పేరుగాంచిన ఆచార్య చాణక్యుడి గురించి మనం కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. తన మేధోశక్తి, సామర్థ్యంతో ఒక సామ్రాజ్యిన్ని నాశనం చేసి.. మరో సామ్రాజ్యాధినేతను సృష్టించిన ఘనాపాటి. రాజకీయ వ్యూహాలు పన్నటంతో దిట్ట అయిన చాణక్యుడు.. మౌర్య సామ్రాజ్య స్థాపనకు భీజం వేశాడు. చాణక్యుడు తన జీవితకాలంలో ఒక గొప్ప పుస్తకాన్ని రచించారు. అదే నీతిశాస్త్రం. ఇందులో వ్యక్తి జీవితానికి సంబంధించి సమగ్ర విశేషాలు ఉన్నాయి. నీతి సూత్రాలు, జీవిత మార్గాలు అనేక కీలక అంశాలను అందులో పేర్కొన్నారు. జీవితానికి సంబంధించి ఏది చెడు, ఏది మంచి వివరాలను కూలంకశంగా వివరించారు. చాణక్యుడు తన నీతిశాస్త్రం గ్రంధంలో భార్యాభర్తల మధ్య సంబంధాల గురించి కూడా పేర్కొన్నారు. అవి చాలా ముఖ్యమైనవిగా పేర్కొంటారు చాణక్యుడు. వైవాహిక జీవితం సంతోషంగా ఉన్నప్పటికీ.. కొందరు మహిళలు తమ భర్తల వద్ద కొన్ని విషయాలను దాచిపెడతారని అన్నారు చాణక్య. మరి స్త్రీలు దాచే ఆ రహస్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. ఒక మహిళ ఎవరినైనా ఇష్టపడితే.. ఆ విషయాన్ని ఆమె తన స్నేహితులతో పంచుకుంటుంది. కానీ, పొరపాటున కూడా ఈ విషయాన్ని తన భర్తకు తెలియకుండా జాగ్రత్త పడుతుంది.

2. ఇంటి పెద్ద అయిన భర్త తీసుకునే నిర్ణయాలన్నింటికీ భార్య అంగీకరిస్తుంది. అయితే, ఆ నిర్ణయాలలో కొన్ని భార్యకు నచ్చకపోవచ్చు. అయినప్పటికీ.. తన మనసులోని అభిప్రాయాన్ని భర్తకు చెప్పకుండా అలాగే దాచేస్తుంది.

ఇవి కూడా చదవండి

3. చాలా మంది భార్యలు తమ భర్తలతో తరచుగా శృంగారాన్ని కోరుకుంటారు. అయితే, ఈ కోరికలను భార్యలు తమలో తామే దాచేసుకుంటారు. శృంగార కోరికలను తమ మనసులోనే ఉంచేసుకుంటారు.

4. భారతదేశంలో స్త్రీని ఇంటి మహాలక్ష్మిగా పరిగణిస్తారు. ఒక మహిళ భార్యగా అన్ని పనులు చేస్తుంది. తద్వారా ఇంటికి, ఇంటి సభ్యులకు అన్ని విధాలుగా ప్రయోజనం ఉంటుంది. ఈ పనులలో ఒకటి ఇంట్లో డబ్బు ఆదా చేయడం. ఇది భార్యలు దాచిన మంచి నిజం. ఒక్కోసారి ఈ పొదుపు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చాలామంది మహిళలు తమ పొదుపు విషయాన్ని భర్తలకు తెలియకుండా జాగ్రత్త పడుతారు.

మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..