AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: యశోద షూటింగ్ సమయంలోనే సమంతకు మయోసైటిస్ వ్యాధి ఉందని తెలుసా ?.. హీరో ఉన్ని ముకుందన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

జనతా గ్యారేజ్, భాగమతి, ఖిలాడీ తర్వాత ఆయన నటించిన తెలుగు చిత్రమిది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అవుతోంది. ప్రస్తుతంత మూవీ ప్రమోషన్స్ షూరు చేసింది

Samantha: యశోద షూటింగ్ సమయంలోనే సమంతకు మయోసైటిస్ వ్యాధి ఉందని తెలుసా ?.. హీరో ఉన్ని ముకుందన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Unni Mukundan
Rajitha Chanti
|

Updated on: Nov 05, 2022 | 8:01 AM

Share

క్రేజీ హీరోయిన్ సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా ‘యశోద’. ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. డైరెక్టర్స్ హరి, హరీష్ దర్శకత్వం వహించారు. ఇందులో మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ కథానాయకుడిగా నటించారు. జనతా గ్యారేజ్, భాగమతి, ఖిలాడీ తర్వాత ఆయన నటించిన తెలుగు చిత్రమిది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అవుతోంది. ప్రస్తుతంత మూవీ ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రయూనిట్. అయితే కొద్దికాలంగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సామ్.. యశోద ప్రమోషన్లకు కాస్త దూరంగా ఉంటుంది. మరోవైపు ఈ చిత్రయూనిట్ ప్రచారకార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈ సందర్భంగా హీరో ఉన్ని ముకుందన్ మీడియాతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా ఉన్ని ముకుందన్ మాట్లాడుతూ సమంతతో వర్కింగ్ ఎక్స్‏పీరియన్స్ గురించి చెప్పుకొచ్చాడు.. ” సమంత చాలా డెడికేటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ యాక్ట్రెస్. తన పాత్ర కోసం ఆవిడ చాలా ప్రిపేర్ అయ్యారు. ఫైట్స్ బాగా చేశారు. యాక్షన్, ఎమోషనల్ సీన్స్ చేశారు. సెట్‌లో ఇతర ఆర్టిస్టులతో చక్కగా మాట్లాడతారు. ఒక సన్నివేశం చేసేటప్పుడు ఎలా చేస్తే బావుంటుందని ఐడియాస్ డిస్కస్ చేసుకున్నాం. మలయాళంలో వర్కింగ్ స్టైల్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. నటుడిగా రిహార్సల్స్ ఇవ్వడానికి నేను కొంచెం ఆలోచిస్తా. మలయాళ సినిమా సెట్‌లో ఇతర ఆర్టిస్టులకు సర్‌ప్రైజ్ ఇవ్వాలని చూస్తా. ముందు ఏం చేస్తానో చెప్పను. డైరెక్ట్ కెమెరా ముందు చేసి చూపిస్తా. అప్పుడు వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ నేచురల్‌గా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

యశోద షూటింగ్ చేసేటప్పుడు సమంతకు ఆ వ్యాధి ఉందని నాకు తెలియదు. ఆమె చాలా ప్రొఫెషనల్‌గా ఉన్నారు. ఎప్పుడూ తాను అటువంటి వ్యాధితో పోరాటం చేస్తున్నాని చెప్పలేదు. సమంత పోస్ట్ చూసి శాడ్ గా ఫీలయ్యాను. సమంతను దగ్గర నుంచి చూసి వ్యక్తిగా ఆవిడ మైయోసిటిస్‌తో పోరాటం చేస్తారు. ఆరోగ్యంతో మన ముందుకు వస్తారు” అంటూ చెప్పుకొచ్చారు.

ఆ 12 సినిమాలు చిరంజీవిని హీరోగా నిలబెట్టాయి..
ఆ 12 సినిమాలు చిరంజీవిని హీరోగా నిలబెట్టాయి..
Horoscope Today: వారి వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం..
Horoscope Today: వారి వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం..
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..