Ram Charan: వెకేషన్ నుంచి తిరిగొచ్చిన రామ్ చరణ్ దంపతులు.. నెట్టింట వైరలవుతున్న ఫోటోస్..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Nov 04, 2022 | 7:50 AM

గత కొన్ని రోజులుగా ఆఫ్రికాలో వెకేషన్ వెళ్ళిన రామ్ చరణ్ దంపతులు తాజాగా హైదరాబాద్ కు వచ్చేశారు. టాంజానియాలో వీళ్లు ఉన్న స్టిల్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు చరణ్ టీమ్. ఈ ఫోటోలకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.

Ram Charan: వెకేషన్ నుంచి తిరిగొచ్చిన రామ్ చరణ్ దంపతులు.. నెట్టింట వైరలవుతున్న ఫోటోస్..
Ram Charan

డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం అక్టోబర్ చివరి వారంలో జపాన్‏లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి జపనీస్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా జక్కన్నతోపాటు తారక్, చరణ్ జపాన్‏లో సందడి చేశారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు పూర్తైన అనంతరం..చరణ్ దంపతులు.. ఆఫ్రికాకు వెకేషన్ వెళ్లారు. వీరికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇక గత కొన్ని రోజులుగా ఆఫ్రికాలో వెకేషన్ వెళ్ళిన రామ్ చరణ్ దంపతులు తాజాగా హైదరాబాద్ కు వచ్చేశారు. టాంజానియాలో వీళ్లు ఉన్న స్టిల్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు చరణ్ టీమ్. ఈ ఫోటోలకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.

ప్రస్తుతం చరణ్.. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుడంగా.. ఇటీవల శంకర్ ఇండియన్ 2 చిత్రీకరణలో బిజీ అయ్యారు. ఓకే సమయంలో రెండు ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు డైరెక్టర్ శంకర్. ఆర్సీ 15 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. అంతేకాకుండా ఇందులో అంజలి కీలకపాత్రలో నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

పొలిటికల్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో చరణ్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇక లేటేస్ట్ టాక్ ప్రకారం ఆర్సీ 15 తర్వాత చరణ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ చేయనున్నారని తెలుస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu