Ramba: యాక్సిడెంట్ తర్వాత తొలిసారి ఇన్‏స్టా లైవ్‏లోకి వచ్చిన రంభ.. కూతురు ఆరోగ్యంపై క్లారిటీ..

మెగాస్టార్ చిరంజీవి.. బాలకృష్ణ, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ముఖ్యంగా చిరు నటించిన బావగారు బాగున్నారా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది.

Ramba: యాక్సిడెంట్ తర్వాత తొలిసారి ఇన్‏స్టా లైవ్‏లోకి వచ్చిన రంభ.. కూతురు ఆరోగ్యంపై క్లారిటీ..
Ramba
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 03, 2022 | 7:28 AM

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రంభ మంగళవారం రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తన పిల్లలను స్కూల్ నుంచి తీసుకువస్తున్న ఆమె కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రంభ స్వల్ప గాయాలతో బయటపడగా.. ఆమె కూతురు సాషాకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో తన కూతురికి ఆసుపత్రిలో చికిత్స అందించారు. రంభ కారు యాక్సిడెంట్ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. తన కూతురు త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి అంటూ ఇన్‏స్టాలో పోస్ట్ చేస్తూ ఫాలోవర్లకు కోరింది. ఇక తాజాగా తన కూతురు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చినట్లుగా తెలిపింది. యాక్సిడెంట్ తర్వాత తొలిసారి ఇన్‏స్టాలో వీడియోలో షేర్ చేసింది రంభ.

మొదటిసారి ఇన్ స్టా లైవ్ లోకి వచ్చాను. నా కూతురి ఆరోగ్యం కోసం ప్రార్ధించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అభిమానులు, స్నేహితులు, కుటుంబసభ్యులకు.. మా ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఇప్పుడు నేను, పిల్లలు కోలుకున్నాము. షాషా కూడా కోలుకుని ఆసుపత్రి నుంచి ఇంటికి తిరిగి వచ్చింది. మీరు మా మీద చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి రుణపడి ఉంటాను. థాంక్యూ ఆల్.. లవ్ యూ ఆల్.. అంటూ చెప్పుకొచ్చారు రంభ.

ఇవి కూడా చదవండి

మెగాస్టార్ చిరంజీవి.. బాలకృష్ణ, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ముఖ్యంగా చిరు నటించిన బావగారు బాగున్నారా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన మరోవైపు తమిళ, హిందీ భాషల్లోనూ పలు సినిమాల్లో నటించారు. ప్రస్తుతం రంభ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రముఖ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న రంభ.. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి కెనడాలో సెటిలయ్యారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..