Prabhas: మిల్కీబ్యూటీకి చెస్ అట నేర్పిస్తున్న ప్రభాస్.. వైరలవుతున్న త్రోబ్యాక్ వీడియో..

తాజాగా ప్రభాస్‏కు చెందిన ఓ త్రోబ్యాక్ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. అందులో మిల్కీబ్యూటీ తమన్నాకు చెస్ ఆట నేర్పిస్తున్నారు ప్రభాస్.

Prabhas: మిల్కీబ్యూటీకి చెస్ అట నేర్పిస్తున్న ప్రభాస్.. వైరలవుతున్న త్రోబ్యాక్ వీడియో..
Prabhas, Tamannah
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 03, 2022 | 8:07 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‍కు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం సినిమాల పరంగానే కాకుండా.. దర్శకనిర్మాతలు.. నటీనటులతో.. సెట్‏లో ప్రతి ఒక్కరితో డార్లింగ్ ప్రవర్తనకు ముద్దులవుతుంటారు. ముఖ్యంగా సెట్‏లో మెంబర్స్ ఆకలి తీర్చడంలో ముందుంటారు డార్లింగ్. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇక మరోవైపు డార్లింగ్ చిత్రాల కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తమ అభిమాన హీరో సినిమా నుంచి చిన్న అప్డేట్ వచ్చినా తెగ ఖుషి అవుతుంటారు. ఇక ఇటీవల విడుదలైన ఆదిపురుష్ టీజర్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ప్రభాస్‏కు చెందిన ఓ త్రోబ్యాక్ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. అందులో మిల్కీబ్యూటీ తమన్నాకు చెస్ ఆట నేర్పిస్తున్నారు ప్రభాస్. అయితే వరుస చిత్రాలతో బిజీగా ఉన్న డార్లింగ్.. తమన్నాను ఎప్పుడు కలిశాడు.. ఎక్కడా చెస్ నేర్పించాడు అనే కదా మీ సందేహం. ఆ వీడియో రెబల్ సినిమా షూటింగ్ సమయంలోనిది.

ప్రభాస్.. తమన్నా జంటగా నటించిన రెబల్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ గ్యాప్ లో డార్లింగ్, తమన్నా చెస్ ఆడుతున్నారు. వైట్ అండ్ వైట్‏లో ముఖం మీదుగా బ్లడ్ పడినట్లుగా ఫుల్ పవర్ ఫుల్ లుక్‏లో కనిపిస్తున్నారు ప్రభాస్. దీంతో రెబల్ క్లైమాక్స్ షూటింగ్ సమయంలో వీరిద్దరు చదరంగం ఆడినట్లుగా తెలుస్తోంది. ఇక డార్లింగ్, మిల్కీబ్యూటీ ఇరువురు కలిసి గేమ్ ఆడుతుండడంతో.. మాకు నేర్పించండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం డార్లింగ్ చేతిలో సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె చిత్రాలున్నాయి. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది ఆదిపురుష్. అలాగే.. సలార్.. ప్రాజెక్ట్ కె చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. మరోవైపు డైరెక్టర్ మారుతి దర్శకత్వంలోనూ ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు ప్రభాస్. ఈ సినిమా చిత్రీకరణ సైలెంట్‏గా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?