Anu Emmanuel : నటిగా ఫెయిల్ కాలేదు.. కానీ అందుకే సినిమాలు చేయడం లేదు.. అను ఇమ్మాన్యూయేల్ కామెంట్స్..

యంగ్ హీరో అల్లు శిరీష్‌ సరసన అను ఇమ్మాన్యుయేల్ నటించిన చిత్రం ‘ఊర్వశివో.. రాక్షసివో’. డైరెక్టర్ రాకేష్‌ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీఎ2 పిక్చర్స్‌ అల్లు అరవింద్‌ సమర్పణలో ధీరజ్‌ మొగిలిలేని, విజయ్‌ ఎం నిర్మించారు.

Anu Emmanuel : నటిగా ఫెయిల్ కాలేదు.. కానీ అందుకే సినిమాలు చేయడం లేదు.. అను ఇమ్మాన్యూయేల్ కామెంట్స్..
Anu Emmanuel
Follow us

|

Updated on: Nov 03, 2022 | 6:53 AM

‘‘నిజజీవితంలో అను ఇమ్మాన్యుయేల్‌ చాలా స్ట్రెయిట్‌ ఫార్వడ్‌ అమ్మాయి. కెరీర్‌లో వేసే ప్రతి అడుగు మంచి స్థాయికి తీసుకెళ్లాలనే ఆలోచన ఉంటుంది. సింధూ పాత్ర కూడా అలాగే ఉంటుంది. అది నాకు, సింధూకి ఉన్న పోలిక’’ అని అనూ ఇమ్మాన్యుయేల్‌ అన్నారు. యంగ్ హీరో అల్లు శిరీష్‌ సరసన ఆమె నటించిన చిత్రం ‘ఊర్వశివో.. రాక్షసివో’. డైరెక్టర్ రాకేష్‌ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీఎ2 పిక్చర్స్‌ అల్లు అరవింద్‌ సమర్పణలో ధీరజ్‌ మొగిలిలేని, విజయ్‌ ఎం నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా చిత్ర హీరోయిన్‌ అను ఇమ్మాన్యూయేల్‌ మీడియా సమావేశంలో ఆసక్తికర కామెంట్స్ చేసింది.

అను ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. ” ఇందులో సింధూ అనే సాఫ్ట్‌వేర్‌ అమ్మాయిగా నటించా. కెరీర్‌లో మంచి స్థాయికి ఎదగాలనే తపన ఉన్న అమ్మాయి. ఆమెకి ప్రేమ కావాలి. కానీ ప్రేమే జీవితం అనుకోదు. అలాంటి అమ్మాయికి శ్రీకుమార్‌ అనే సింపుల్‌ కుర్రాడు పరిచయం అవుతాడు. సింపుల్‌ కుర్రాడికి, కెరీర్‌ ఓరియెంటెడ్‌ అమ్మాయికి మధ్య ప్రేమకథ ఎలా నడించింది అన్నది కథ. హీరో, హీరోయిన్‌ క్యారెక్టర్స్‌ డిఫరెంట్‌ మైండ్‌సెట్‌తో కాంట్రాస్ట్‌గా ఉంటాయి. అదే సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. న్యూ ఏజ్‌ జానర్‌ కథ ఇది. యూత్‌ని బాగా ఇంపాక్ట్‌ చేస్తుంది..

ఇవి కూడా చదవండి

కెరీర్‌ బిగినింగ్‌లోనే నేను పవన్‌కల్యాణ్‌, అల్లు అర్జున్‌, నాగచైతన్య వంటి స్టార్‌ల సరసన యాక్ట్‌ చేశా. ఎవరితో యాక్ట్‌ చేసిన కథ, బ్యానర్‌ గురించి ఆలోచిస్తా. నాకు అవకాశాలు రావడం లేదు అన్నది కరెక్ట్‌ కాదు. కాకపోతే వరుసగా సినిమాలు చేయడం లేదు. నేను చేసిన సినిమాలు ఆడలేదేమో కానీ నటిగా నేను ఫెయిల్‌ అనే మాట ఎక్కడా వినిపించలేదు. అనూ కళ్లతో అభినయించగలదు అనే మార్క్‌ సంపాదించుకున్నా. కొన్ని సినిమాల రిజల్ట్‌ చూశాక నన్ను నేను మార్చుకున్నా. రెగ్యులర్‌ సినిమాలకు దూరంగా ఉంటున్నా. వచ్చిన అవకాశంలో ఆ పాత్రకు నేను సూట్‌ అవుతాను అనుకుంటేనే ఓకే చేస్తున్నా. లేదంటే ఇంట్లో కూర్చుంటా. ఏదో వచ్చాం… చేశాం.. వెళ్లాం అనుకునే పద్దతిలో లేను. మంచి కథ ఎంచుకోవడం, పాత్రకు న్యాయం చేయడం వరకే నా చేతిలో ఉంది. అంతకు మించి ఏదీ నా చేతిలో ఉండదు. దర్శకుడు చెప్పింది చేస్తాం.. ఇచ్చిన డైలాగ్‌ చెబుతామంతే. సక్సెస్‌ నా చేతిలో లేదు” అంటూ చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Anu Emmanuel (@anuemmanuel)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.