AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nuvve Nuvve: గురూజీ బర్త్ డే స్పెషల్.. ఆరోజున రీరిలీజ్ కానున్న ‘నువ్వే నువ్వే’..

లవర్ బాయ్ తరుణ్.. శ్రియా జంటగా నటించిన ఈ సినిమా ఆల్ టైమ్ సూపర్ హిట్. 2002లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత స్రవంతి రవికిశోర్ నిర్మించారు.

Nuvve Nuvve: గురూజీ బర్త్ డే స్పెషల్.. ఆరోజున రీరిలీజ్ కానున్న 'నువ్వే నువ్వే'..
Nuvve Nuvve
Rajitha Chanti
|

Updated on: Nov 02, 2022 | 11:46 AM

Share

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‏కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమాలు.. డైలాగ్స్‏ యువతను ఆకట్టుకుంటాయి. అయితే ఆయన మొదటి సారి మెగాఫోన్ పట్టి వెండితెరపై మ్యాజిక్ చేసిన చిత్రం నువ్వే నువ్వే. లవర్ బాయ్ తరుణ్.. శ్రియా జంటగా నటించిన ఈ సినిమా ఆల్ టైమ్ సూపర్ హిట్. 2002లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత స్రవంతి రవికిశోర్ నిర్మించారు. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఇప్పటికీ ఈ సినిమా కుర్రకారునే కాదు.. ఫ్యామిలీ ప్రేక్షకులకు కూడా ఫేవరేట్. లవ్.. ఫ్యామిలీ యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు కోటి సంగీతం అందించారు. ఈ చిత్రానికి అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఇటీవలే ఈ మూవీ రిలీజ్ అయ్యి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మూవీ యూనిట్ గ్రాండ్ సెలబ్రెషన్స్ కూడా చేసింది. ఇక ఇప్పుడు మరోసారి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. గురూజీ త్రివిక్రమ్ బర్త్ డే కానుకగా ఈ సినిమాను నవంబర్ 4 నుంచి 7 వరుక తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్లలో రీరిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ కు సంబంధించి బుక్ మై షోలో టికెట్స్ కూడా ప్రీ బుకింగ్‏కు అందుబాటులోకి తీసుకువచ్చాయి.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ ”వనమాలి హౌస్‌లో ‘నువ్వే కావాలి’ షూటింగ్ జరుగుతుంది. రవికిశోర్ గారు, నేను పక్కన ఖాళీ స్థలంలో నడుస్తూ మాటల మధ్యలో కథ చెప్పా. ఆయన చెక్ బుక్ తీసి ఒక అమౌంట్ వేసి ఇచ్చారు. ‘నువ్వే కావాలి’కి రైటర్‌గా ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారో… దాదాపుగా అంత అమౌంట్ అడ్వాన్స్‌గా ఇచ్చారు. నేను దాంతో బైక్ కొనుక్కున్నాను. నేను ఏం చేయగలనో తెలియదు. కానీ, నేను చెప్పిన కథ విని రవికిశోర్ గారు ఎంతో నమ్మారు. ఆయనకు నేను ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పినా సరిపోదు. నాలో ఉన్న రచయితను గానీ… దర్శకుడిని గానీ… నాకంటే ఎక్కువగా గుర్తించిన, ఇష్టపడ్డ వ్యక్తి రవికిశోర్ గారు. ఆయన్ను నేను చాలా ప్రేమిస్తాను. గౌరవిస్తాను అన్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ