God Father: మరోసారి ఓటీటీలో సందడి చేయనున్న అన్నయ్య.. గాడ్ ఫాదర్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..

ప్రస్తుతం మెగాస్టార్ భోళా శంకర్, వాల్తేరు వీరయ్య చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు శరవేగంగా షూటింగ్ జరపుకుంటున్నాయి.

God Father: మరోసారి ఓటీటీలో సందడి చేయనున్న అన్నయ్య.. గాడ్ ఫాదర్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..
Godfather Movie
Follow us

|

Updated on: Nov 02, 2022 | 11:48 AM

డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన సినిమా గాడ్ ఫాదర్. దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్‏గా నిలిచింది. మలయాళీ చిత్రం లూసీఫర్ రీమేక్‏గా తెరకెక్కిన ఈ మూవీకి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇందులో సత్యదేవ్, నయనతార, సల్మాన్ ఖాన్ కీలకపాత్రలలో నటించారు. అంతేకాకుండా చాలా కాలం తర్వాత చిరు పొలిటికల్ బ్యాగ్రౌండ్ చిత్రంతో ఆడియన్స్‏ను మెప్పించారు. ఇక గాడ్ ఫాదర్ సినిమా ఇప్పుడు థియేటర్ రన్ ముగించకుని ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది.

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ కూడా లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. మెగాస్టార్ కెరీర్‏లోనే డీసెంట్ హిట్‏గా నిలిచిన ఈ మూవీ నవంబర్ 19 నుంచి అందుబాటులోకి రానున్నట్లుగా తెలుస్తోంది. దీంతో సినీ ప్రియులు ఖుషి అవుతున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి

ఇక ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మెగాస్టార్ భోళా శంకర్, వాల్తేరు వీరయ్య చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు శరవేగంగా షూటింగ్ జరపుకుంటున్నాయి. ఇక ఇటీవల విడుదలైన వాల్తేరు వీరయ్య టైటిల్ వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా..మాస్ మాహారాజా రవితేజ అతిథి పాత్రలో కనిపించనున్నారు.