Bigg Boss 6 Telugu: నిందలు భరించలేక అన్నంత పనిచేసిన ఇనయ.. రంగంలోకి దిగిన బిగ్‏బాస్..

ఇనయ వాష్ రూమ్ లాక్ చేసుకోవడం గుర్తించిన రేవంత్ వెంటనే ఆమెను బయటకు రావాలని పిలిచాడు. ఇక శ్రీహాన్, శ్రీసత్య, గీతూ బయటకు రా అంటూ మరో కొత్త నాటకాన్ని స్టార్ట్ చేశారు.

Bigg Boss 6 Telugu: నిందలు భరించలేక అన్నంత పనిచేసిన ఇనయ.. రంగంలోకి దిగిన బిగ్‏బాస్..
Bigg Boss
Follow us

|

Updated on: Nov 02, 2022 | 11:47 AM

బిగ్‏బాస్ సీజన్ 6 ఎనిమిదవ వారం ఇంటి నుంచి ఆర్జే సూర్య ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే సూర్య ఎలిమినేషన్ తో ఇనయను టార్గెట్ చేశారు ఇంటి సభ్యులు. ఒక్కసారి కాదు… పదే పదే సూర్య పేరు ప్రస్తావిస్తూ ఆమెను మానసికంగా వేధించారు. ఆమె పర్సనల్ విషయాలను తీసుకువచ్చి మరీ దారుణంగా హేళన చేశారు. ముఖ్యంగా ఫైమా, శ్రీహాన్, గీతూ, ఆదిరెడ్డి ఇనయ వ్యక్తిగత జీవితం గురించి ఇష్టానుసారంగా మాట్లాడారు. దీంతో ఇనయ మానసికంగా ఎక్కువగానే ఇబ్బంది పడింది. ఓవైపు ఇంట్లో ఒంటరి కావడం.. మరోవైపు పర్సనల్ విషయాలు.. సూర్య వెళ్ళిపోవడానికి కారణం నువ్వే అంటూ అంతా కలిసి టార్చర్ చేయడంతో ఇనయ మెంటల్‏గా ఎక్కువగానే డిస్ట్రబ్ అయింది. దీంతో నామినేషన్స్ ప్రాసెస్ కాగానే బాత్ రూంలోకి వెళ్లి బోరు బోరున ఏడుస్తుంది.

చాలా గిల్టీగా ఉంది బిగ్‏బాస్.. నా వల్ల కావడం లేదు అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. ఓవైపు ఇనయ మానసికంగా బాధపడుతుంటే.. బయట కూర్చున్న హౌస్మేట్స్ మరోసారి ఆమె వ్యక్తిగత విషయాల గురించి చర్చించుకున్నారు. అయితే ఇనయ వాష్ రూమ్ లాక్ చేసుకోవడం గుర్తించిన రేవంత్ వెంటనే ఆమెను బయటకు రావాలని పిలిచాడు. ఇక శ్రీహాన్, శ్రీసత్య, గీతూ బయటకు రా అంటూ మరో కొత్త నాటకాన్ని స్టార్ట్ చేశారు. అయితే తనకు గిల్టీగా ఉందని.. బయటకు రాలేనని.. ఒక్కసారి బిగ్‏బాస్ తో మాట్లాడాలని ఇనయ డిమాండ్ చేసింది.

అయితే ఎంత సమయమైనా ఇనయ రాకపోవడంతో డోర్ పగలగొట్టేందుకు ప్రయత్నించాడు రేవంత్. దీంతో రంగంలోకి దిగిన బిగ్‏బాస్ ఆమెను కన్ఫేషన్ రూంలోకి రావాలని ఆదేశించాడు. ఇక అక్కడ తన బాధను చెప్పుకుంది. నా జీవితంలో ఎన్నో గిల్ట్స్ తీసుకున్నాను ఇప్పుడు వీరు వేసే నిందలు భరించలేకపోతున్నాను. నా వల్లనే సూర్య వెళ్లిపోయాడు అనడాన్ని నేను తీసుకులేకపోతున్నాను .. నా వల్ల కావట్లేదు. నాకు ఇక్కడ ఉండాలని లేదు అంటూ బోరున ఏడ్చేసింది.

ఇవి కూడా చదవండి

దీంతో ఆమెను బిగ్‏బాస్ ఓదార్చాడు. బయటకు వెళ్లడం.. ఇంట్లోకి రావడం అనేది గేమ్ లో ఓ భాగం. ఇక్కడకు రావడం మాత్రమే మీచేతిలో ఉంటుంది.. బయటకు వెళ్లడం ప్రేక్షకుల చేతిలో ఉంటుంది. మీరు జీవితంలో చాలా చూశారు. నవ్వుతూ ఉండే ఒక అమ్మాయిగా ఇంట్లోకి వచ్చిన మిమ్మల్ని.. మీకు బాగా దగ్గరైన వాళ్లు ఇలా చూడాలని అనుకుంటున్నారా ? అని అడగ్గా.. లేదు అని తెలిపింది.ఇక మీ కన్నీళ్ళను తూడ్చుకుని బయటకు వెళ్లండి అని బిగ్‏బాస్ చెప్పడంతో ఇనయ నవ్వుతూ బయటకు వచ్చేసింది.