AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Artist NagaVardhini: ప్రియుడితో కలిసి మాజీ లవర్‏పై హత్యాయత్నం చేసిన ‘గుప్పెడంత మనసు’ సీరియల్ నటి..

జూనియర్ ఆర్టిస్ట్ నాగవర్దని.. తన తాజా ప్రియుడితో కలిసి మాజీ లవర్ పై హత్యాయత్నం చేసింది. పాత ప్రేమికుడిని ఏకంగా భవనంపై నుంచి తోసేసింది. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది.

Artist NagaVardhini: ప్రియుడితో కలిసి మాజీ లవర్‏పై హత్యాయత్నం చేసిన 'గుప్పెడంత మనసు' సీరియల్ నటి..
Naga Vardhini
Rajitha Chanti
|

Updated on: Nov 02, 2022 | 11:45 AM

Share

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో క్రైమ్‌కి దారితీసిన ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇది. ఓ యువతి.. తన మొదటి ప్రియుడ్ని, రెండో ప్రియుడితో కలిసి భవనంపై నుంచి తోసేసి హత్యాయత్నం చేసింది. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. సినిమాలు, సీరియల్స్‌లో చిన్నాచితకా క్యారెక్టర్లు చేసుకునే నాగవర్థిని, సూర్యనారాయణ ఒకప్పడు ప్రేమికులు. ఇద్దరూ కృష్ణానగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో సహజీవనం కూడా చేస్తున్నారు. ఒకరోజు సూర్యనారాయణ తన స్నేహితుడు శ్రీనివాస్‌ రెడ్డిని నాగవర్థినికి పరిచయం చేశాడు. ఆ తర్వాత ఏమైందో ఏమో.. నాలుగునెలలుగా సూర్యనారాయణకు దూరంగా, శ్రీనివాసరెడ్డికి దగ్గరగా మసలుతోందామె.

ఈ బ్రేకప్‌ తర్వాత శ్రీనివాస్‌, నాగవర్థిని కలిసి అదే ఇంట్లో సహజీవనం చేస్తూ వచ్చారు. సూర్యనారాయణ అదే బిల్డింగ్‌లోని పై ఫ్లోర్‌కి మారాడు. తాజాగా సూర్యనారాయణకు, ఈ జంటకు మధ్య వివాదం తలెత్తింది. ఆ వివాదం కాస్తా ముదిరి.. ఆ జంట ఇద్దరూ కలిసి సూర్యనారాయణనను బిల్డింగ్ పైనుంచి తోసేశారు. స్థానికుల సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు.. సూర్యనారాయణను పంజాగుట్టలోని ఓ హాస్పిటల్‌లో చేర్పించారు. వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.  ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.

ఇవి కూడా చదవండి

ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీలో అసలు వివాదం ఎందుకొచ్చిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు నాగవర్దిని, శ్రీనులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. అయితే గతంలోనే నాగవర్దినికి పెళ్లి అయినట్లుగా గుర్తించారు పోలీసులు.