AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

K Pop Singer: సియోల్‌ తొక్కిసలాటలో సాయం చేయబోయి ప్రాణాలు పోగొట్టుకున్న నటుడు, కే పాప్ సింగర్ లీ జిహాన్..

లి జిహాన్ అందరికీ ప్రియమైన స్నేహితుడు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే వాడు. ఇక చూడలేమంటే నమ్మలేకపోతున్నాం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 24 ఏళ్ల లీ జిహాన్ కొరియన్ సింగింగ్ కాంపిటీషన్ ప్రొడ్యూస్ 101లో పాల్గొన్నాడు.

K Pop Singer: సియోల్‌ తొక్కిసలాటలో సాయం చేయబోయి ప్రాణాలు పోగొట్టుకున్న నటుడు, కే పాప్ సింగర్ లీ జిహాన్..
South Korean Actor, Singer
Surya Kala
|

Updated on: Nov 01, 2022 | 3:20 PM

Share

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో హాలోవీన్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో నటుడు, కే పాప్ సింగర్ లీ జిహాన్ (24) మరణించాడు. ప్రముఖ ఏజెన్సీ 935 ఎంటర్‌టైన్‌మెంట్ లీ జిహాన్ మరణ వార్తను ధృవీకరించింది. “935 ఎంటర్‌టైన్‌మెంట్ , 9 ఎటో ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్యామిలీ ఒక అమూల్యమైన సభ్యుడు, నటుడు లీ జిహాన్ ని కోల్పోయింది. లీ మమ్మల్ని విడిచిపెట్టి తిరిగిరాని లోకాలకు చేరుకున్నాడు. లీ ఆకస్మిక మృతితో తీవ్ర విషాదం నెలకొంది. లీ  కుటుంబ సభ్యులకు లీ పనిచేస్తున్న ఏజెన్సీ సహా పలువురు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

తమ ప్రియమైన స్నేహితుడిని గుర్తుచేకుంటున్నారు. “లి జిహాన్ అందరికీ ప్రియమైన స్నేహితుడు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే వాడు. ఇక చూడలేమంటే నమ్మలేకపోతున్నాం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 24 ఏళ్ల లీ జిహాన్ కొరియన్ సింగింగ్ కాంపిటీషన్ ప్రొడ్యూస్ 101లో పాల్గొన్నాడు. టుడే వాజ్ అనదర్ నేమ్ హ్యూన్ దేతో టెలివిజన్ రంగంలో అడుగు పెట్టాడు. ఈరోజు లీ జిహాన్ అంత్యక్రియలు నిర్వహించారు. పలువురు నటులు, సింగర్స్ , అభిమానులు అంత్యక్రియలకు హాజరయ్యారు. కన్నీరు మధ్య వీడ్కోలు చెప్పారు.

తొక్కిసలాటలో మరణించిన వారి సంఖ్య 153 సియోల్‌లోని హాలోవీన్ సందర్భంగా ఇరుకైన వీధిలోకి ప్రవేశించేందుకు జనం ప్రయత్నించడం వల్ల జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి సంఖ్య 153కి చేరుకుంది. మరో 133 మంది క్షతగాత్రులు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. గాయపడిన 39 మంది పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని హోం మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ కొరియాలో ఒక వారం జాతీయ సంతాప దినాలుగా పాటించాలని అధ్యక్షుడు యూన్ సుక్ ప్రకటించారు.  ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ కార్యాలయాల సహా బహిరంగ ప్రదేశాల్లో జాతీయ జెండాను సగం మాస్ట్‌గా ఉంచాలని ఆదేశించారు. ఆ దేశ రాష్ట్రపతి మాట్లాడుతూ, బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయం అందించడం తమ  ప్రభుత్వ  ప్రాధాన్యత అని అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రసంగం అనంతరం రాష్ట్రపతి ఘటనాస్థలిని సందర్శించారు.

ఇవి కూడా చదవండి

స్థానిక మీడియా ప్రకారం, యోల్ అక్కడికక్కడే నియమించబడిన అధికారులకు అవసరమైన సూచనలు కూడా ఇచ్చాడు. రాజధానిలోని ఇటావెన్ జిల్లాలో శనివారం జరిగిన తొక్కిసలాట తర్వాత వీధుల్లో పడి ఉన్న ప్రజలకు అత్యవసర సిబ్బంది, స్థానికులు సహాయం చేశారు.

సియోల్ యొక్క యోంగ్సన్ అగ్నిమాపక విభాగం చీఫ్ చోయ్ సియోంగ్-బీమ్ ప్రకారం, చనిపోయిన, గాయపడిన వారిలో ఎక్కువ మంది యువకులు 20-30 సంవత్సరాల వయస్సు గల వారే. మృతుల్లో 20 మంది విదేశీయులు ఉన్నారని, వారు చైనా, రష్యా, ఇరాన్ , ఇతర దేశాల పౌరులని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మృతుల్లో అమెరికా పౌరుడు కూడా ఉన్నాడు. దేశంలోనే అతిపెద్ద బహిరంగ హాలోవీన్ వేడుక కోసం దాదాపు 100,000 మంది ప్రజలు Iteven వద్ద గుమిగూడారు.

తప్పిపోయిన వారి బంధువుల గురించి తెలియజేయడానికి వేలాది మంది ప్రజలు ప్రభుత్వ కార్యాలయాన్ని సంప్రదించారని..  తొక్కిసలాట తర్వాత గాయపడిన వారిలో లేదా మరణించిన వారిలో తప్పిపోయిన వారు ఉన్నారా అని ధృవీకరించాలని అధికారులను కోరారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..