Baba Ramdev: మరోసారి వివాదంలో బాబా రాందేవ్ .. ఆ హీరోలు డ్రగ్స్ తీసుకుంటారని సంచలన ఆరోపణలు..

ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో నిర్వహించిన ఆర్యవీర్‌, వీరాంగన సదస్సులో రాందేవ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలీవుడ్‌, డ్రగ్స్‌ వాడకంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Baba Ramdev: మరోసారి వివాదంలో బాబా రాందేవ్ .. ఆ హీరోలు డ్రగ్స్ తీసుకుంటారని సంచలన ఆరోపణలు..
Baba Ram Dev On Bollywood
Follow us

|

Updated on: Oct 17, 2022 | 12:26 PM

డ్రగ్స్ మత్తులో సినీ పరిశ్రమలోని కొందరు నటీనటులు చిత్తు అంటూ తరచుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో డ్రగ్స్ వినియోగంపై ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ సంచలన ఆరోపణలు చేశారు. మరోసారి సంచలన వ్యాఖలతో వివాదంలో చిక్కుకున్నారు బాబా రాందేవ్‌. బాలీవుడ్ అగ్ర నటులు డ్రగ్స్ సేవిస్తున్నారని యోగా గురు బాబా రామ్‌దేవ్ ఆరోపించారు. బాలీవుడ్‌ ఇండస్ట్రీపై తాజాగా ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలతో మరోసారి బాలీవుడ్ ఉల్కిపడింది.  ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్‌లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో నిర్వహించిన ఆర్యవీర్‌, వీరాంగన సదస్సులో రాందేవ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలీవుడ్‌, డ్రగ్స్‌ వాడకంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. యావత్‌ బాలీవుడ్‌ ఇండస్ట్రీ డ్రగ్స్‌ గుప్పిట్లో చిక్కుకుందని ఆరోపించారు. సినిమా పరిశ్రమను డ్రగ్స్‌ చుట్టుముట్టిందన్న రాందేవ్.. రాజకీయాల్లో కూడా డ్రగ్స్ అడుగుపెట్టిందన్నారు. ఎన్నికల సమయంలో మద్యం పంపిణీ జరుగుతోంది. డ్రగ్ అడిక్షన్ నుంచి భారత్‌ను విముక్తి చేసేందుకు మనమంతా కట్టుబడి ఉండాలని.. ఇందుకోసం ఉద్యమం చేస్తామన్నారు బాబా రాందేవ్.

ఇవి కూడా చదవండి

అంతేకాదు.. స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ డ్రగ్స్‌ తీసుకుంటాడని ఆరోపించారు. ఆమీర్‌ ఖాన్‌ డ్రగ్స్‌ తీసుకుంటారా? లేదా? అనేది తనకు తెలియదన్నారు. షారుక్‌ ఖాన్‌ కొడుకు డ్రగ్స్‌ తీసుకుంటూ పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చినట్లు తెలిపారు. ఇక హీరోయిన్ల గురించి ప్రస్తావిస్తూ.. వాళ్ల గురించి దేవుడికి మాత్రమే తెలుసన్నారు. రాందేవ్‌ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ”సినిమా ఇండస్ట్రీలోనే కాదు రాజకీయాల్లో కూడా డ్రగ్స్ వినియోగం ఉందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో మద్యం పంపిణీ చేస్తున్నారు.

భారతదేశం ప్రతి మాదకద్రవ్య వ్యసనం నుండి విముక్తి పొందాలని మనం తీర్మానం చేయాలి. ఇందుకోసం తాము ఉద్యమం చేపడతామని బాబా రాందేవ్ వ్యాఖ్యానించారు. కాగా బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అకాల మరణానంతరం బీటౌన్‌ స్టార్స్‌ డ్రగ్స్‌ వాడకంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రాందేవ్‌ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..