Deepika-Ranveer: నన్ను చూడగానే తన సంతోషం అనంతం.. విడాకుల రూమర్స్ కు చెక్ పెట్టిన దీపికా

గత నెలలో సోషల్ మీడియాలో రణవీర్, దీపికలు విడిపోతున్నారంటూ పుకార్లు వ్యాపించాయి. తమ డైవర్స్ విషయంలో వస్తున్న పుకార్లపై స్పందించడానికి ఇరువురు పెద్దగా ఆసక్తిని చూపించలేదు. తమ ఇన్‌స్టాగ్రామ్‌లో PDAలో మునిగిపోయారు.

Deepika-Ranveer: నన్ను చూడగానే తన సంతోషం అనంతం.. విడాకుల రూమర్స్ కు చెక్ పెట్టిన దీపికా
Deepika Ranveer
Follow us
Surya Kala

|

Updated on: Oct 13, 2022 | 3:02 PM

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఇటీవల మేఘన్ మార్క్లే పోడ్‌కాస్ట్‌లో కనిపించింది. ఈ పోడ్‌కాస్ట్ వివిధ అంశాలను కవర్ చేసింది. అయితే ఒక ప్రత్యేక విభాగం మాత్రం అందరి దృష్టిని ఆకర్షించగలిగింది. దీపిక పెళ్లి.. విడాకులపై గత కొంత కాలంగా వస్తున్న పుకార్లకు ఇన్ డైరెక్ట్ గా చెక్ పెట్టింది. తన వైవాహిక జీవితం రణవీర్ తో అందంగా సాగుతుందని చెప్పకనే చెప్పేసింది బాలీవుడ్ బ్యూటీ..

పోడ్‌కాస్ట్‌లో మేఘన్‌తో దీపిక మాట్లాడుతూ.. రణ్‌వీర్ కొన్ని సంగీత వేడుకలకు హాజరయ్యాడని.. అప్పుడు తనకు ఒక వారం రోజుల పాటు దూరంగా ఉన్నాడని.. చెప్పింది. అయితే రణవీర్ ఇంటికి తిరిగి రాగానే.. తనని చూసిన వెంటనే ఎంతో సంతోషంగా ఉందని పేర్కొంది.  తన భర్త రణవీర్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో ఒక వారం పాటు పాల్గొని తిరిగి ఇంటికి చేరుకున్నాడు. వారం రోజుల ఎడబాటు తర్వాత నన్ను చూడగానే ఎంతో సంతోషపడ్డాడు అని దీపిక అన్నారు. తన భర్త గురించి విడాకుల గురించి పుకార్ల వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు దీపికా చెప్పిన విషయాలు అభిమానులకు పెద్ద ఊరటనిచ్చాయి.

గత నెలలో సోషల్ మీడియాలో రణవీర్, దీపికలు విడిపోతున్నారంటూ పుకార్లు వ్యాపించాయి. తమ డైవర్స్ విషయంలో వస్తున్న పుకార్లపై స్పందించడానికి ఇరువురు పెద్దగా ఆసక్తిని చూపించలేదు. తమ ఇన్‌స్టాగ్రామ్‌లో PDAలో మునిగిపోయారు. అభిమానులకు ఉపశమనం కలిగించేలా.. గత వారం, రణవీర్ సోషల్ మీడియాలో తన హాట్ పింక్ లుక్ అవతార్ చిత్రాలను పంచుకున్నాడు.

ఇవి కూడా చదవండి

ప్యాంట్ నుండి షర్ట్, షూస్..  షేడ్స్ వరకు, రణవీర్ తల నుండి కాలి వరకు పింక్ దుస్తులు ధరించాడు. ర‌ణ్‌వీర్ ఫోటోల‌కి అనేక రకాలుగా స్పదించారు. భార్య దీపికా కూడా “తినదగినది” అని నర్మగర్భంగా కామెంట్ చేసి వదిలివేసింది. దీపికకు రణవీర్ కిస్ ఎమోజితో సమాధాన మిచ్చాడు. బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్ అయిన రణవీర్, దీపిక ఆరేళ్ల డేటింగ్ తర్వాత నవంబర్ 14, 2018న పెళ్లి చేసుకున్నారు.

ఇటీవల, ఇద్దరు తమ రిలేషన్‌షిప్‌కి బాయ్ చెప్పనున్నారంటూ అనేక నివేదికలు వైరల్ అయ్యాయి. దీపికా, రణవీర్‌లు తమ ఇన్‌స్టాగ్రామ్ లో చేసిన పోస్టులు, కామెంట్స్ తో ఆ పుకార్లకు చెక్ పెట్టడం సురక్షితం అని బీ టౌన్ వారు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు దీపిక షారుఖ్ ఖాన్ తో ‘పఠాన్’ లో నటించింది. ఈ యాక్షన్ డ్రామా మూవీ జనవరి 25, 2023న థియేటర్లలోకి రానుంది. దీపిక అమితాబ్ బచ్చన్‌తో కలిసి ‘ది ఇంటర్న్’లో దక్షిణాది నటుడు ప్రభాస్‌తో కలిసి పాన్-ఇండియా చిత్రం ‘ప్రాజెక్ట్-కె’లో కూడా కనిపించనుంది. హృతిక్ రోషన్‌తో కలిసి ‘ఫైటర్’ లో కూడా కనిపించనుంది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..