AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Antony: విడాకుల దిశగా మరో కోలీవుడ్ హీరో.. మూడో వ్యక్తి దంపతుల మధ్యకు వస్తే ఇలాగే ఉంటుందట..

డాక్టర్ సలీమ్, బిచ్చగాడు వంటి సినిమాలతో తెలుగువారికి దగ్గరైన విజయ్ ఆంటోనీ ఇటీవల సోషల్ మీడియా వేదికగా చేసిన ఓ పోస్ట్ తో మళ్ళీ కోలీవుడ్ లో మరో జంట విడాకులు అంటూ.. విడాకుల అంశాన్ని తెరమీదకు తెచ్చింది.

Vijay Antony: విడాకుల దిశగా మరో కోలీవుడ్ హీరో..  మూడో వ్యక్తి దంపతుల మధ్యకు వస్తే ఇలాగే ఉంటుందట..
Vijay Antony Family
Surya Kala
|

Updated on: Oct 13, 2022 | 12:31 PM

Share

జీవితాంతం కష్ట సుఖాల్లో ఒకరికొకరు తోడునీడగా ఉంటూ నిండునూరేళ్ళు కలిసి జీవిస్తామని ప్రమాణం చేసి.. పెళ్లి చేసుకుంటారు.  అయితే రోజు రోజుకీ విడాకులు తీసుకునే జంటల సంఖ్య ఎక్కువ అవుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు కూడా కొన్ని ఏళ్ల తర్వాత పెళ్లి తూచ్ అంటూ ‘మా విడాకులు’ అంటూ ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకోవడం కామన్‌ గా మారిపోయింది. సమంత, చైతన్య జంట విడాకులు మరచిపోకముందే.. వెంటనే మరో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాను ఐశ్వర్య విడిపోతున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు మరో కోలీవుడ్ హీరో తమ వైవాహిక జీవితానికి విడాకులతో గుడ్ బై చెప్పనున్నాడని పుకార్లు షికారు చేస్తున్నాయి. అది కూడా ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకుని 15 ఏళ్లకు పైగా కాపురం చేసిన జంట విడాకులు తీసుకోనున్నారని వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి.

తాజాగా మరో కోలీవుడ్‌ హీరో విజయ్‌ ఆంటోనీ తన భార్య ఫాతిమాకు డైవర్స్ ఇవ్వనున్నాడని ఓ టాక్ వినిపిస్తోంది. గత కొంతకాలంగా భార్య ఫాతిమాతో విజయ్ కు విభేదాలున్నాయని .. అందుకనే ఈ జంట విడాకులు తీసుకోనున్నారని అంటున్నారు. డాక్టర్ సలీమ్, బిచ్చగాడు వంటి సినిమాలతో తెలుగువారికి దగ్గరైన విజయ్ ఆంటోనీ ఇటీవల సోషల్ మీడియా వేదికగా చేసిన ఓ పోస్ట్ తో మళ్ళీ కోలీవుడ్ లో మరో జంట విడాకులు అంటూ.. విడాకుల అంశాన్ని తెరమీదకు తెచ్చింది.

ఇవి కూడా చదవండి

మీ కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉంటే మీరే పరిష్కరించుకోండి.. మరో వ్యక్తిని భార్యాభర్తల మధ్యకు రానివ్వకండి.. అంటూ విజయ్‌ తాజాగా చేసిన ఓ ట్వీట్‌ విడాకుల వార్తకు మరింత ఆజ్యం పోసింది. అలా వచ్చిన మూడో వ్యక్తి మీ జీవితంలోకి వస్తే.. మీ జీవితాన్ని నాశనం చేసి.. ఆనందపడతారని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు.

విజయ్‌ చేసిన పోస్ట్ట్ పై ఇప్పుడు కోలీవుడ్ లో పెను సంచలనం సృష్టించింది. భారీగా చర్చ నడుస్తోంది. విజయ్ పెళ్లి కూడా అప్పట్లో ఓ సంచలనమే.. అని చెప్పచ్చు. ఓ సినిమా ప్రమోషన్స్ సమయంలో తనను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన ఫాతిమా తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ ప్రేమించి 2006 లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు లారా అనే కూతురు ఉంది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us