AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Aravind: మెగాఫ్యామిలీ విభేదాలపై మరోసారి అల్లు అరవింద్ క్లారిటీ.. అటువంటి వార్తల్లో నిజం లేదంటూ..

అల్లు అర్జున్ కుమార్తె.. అల్లు క్వీన్​ ఆర్హ తో అయితే ఓ చిన్న పిల్లాడిలా మారి సందడి చేస్తారు. తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు. అల్లు అరవింద్​ 

Allu Aravind: మెగాఫ్యామిలీ విభేదాలపై మరోసారి అల్లు అరవింద్ క్లారిటీ..  అటువంటి వార్తల్లో నిజం లేదంటూ..
Chiru Allu Aravind
Surya Kala
|

Updated on: Oct 06, 2022 | 1:56 PM

Share

మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీకి మధ్య గ్యాప్ వచ్చిందని.. ఇరు కుటుంబాల మధ్య సత్ సంబంధాలు లేవంటూ తరచుగా పుకార్లు సోషల్ మీడియాలో  షికారు చేస్తూనే ఉంటాయి. తమ మధ్య ఎటువంటి విబేధాలు లేవని.. అటు మెగా హీరో చిరంజీవి, లేదా ఇటు అల్లు అరవింద్ ఫ్యామిలీ మెంబర్స్ బహిరంగంగా ఎన్ని సార్లు క్లారిటీ ఇచ్చినా ఏదొక సందర్భంలో ఇదిగో రుజువు.. రెండు ఫ్యామిలీకి డ్యాష్ డ్యాష్ కంటూ వార్తలను వండి వార్చేస్తుంటారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, లు స్టార్ హీరోలు గా ఎదిగితే.. అటు అల్లు ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ స్టార్ హీరోగా ఫేమస్ అయ్యారు. దీంతో ఇరు హీరోల అభిమానులకు పడడం లేదని ఆరోపణలు తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి. ఇదే విషయంపై ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు.

తెలుగు సినిమా రంగంలో చెప్పుకోదగ్గ నిర్మాతల్లో ఒకరు అల్లు అరవింద్.. అనేక సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం అల్లు అరవింద్ తన మనవాళ్లు, మనవరాళ్లతో ఎంజాయ్ చేస్తున్నారు. అల్లు అర్జున్ కుమార్తె.. అల్లు క్వీన్​ ఆర్హ తో అయితే ఓ చిన్న పిల్లాడిలా మారి సందడి చేస్తారు. తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు. అల్లు అరవింద్​  మెగాస్టార్​ చింరజీవి ఫ్యామిలీతో ఉన్న డిస్టర్బెన్స్‌​పై క్లారిటీ ఇచ్చారు. మొదటి నుంచి ఉన్న బంధుత్వమే ఇప్పటికీ తమ మధ్య ఉందన్నారు. తమ రెండు కుటుంబాల మధ్య విబేధాలు వచ్చాయన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు అంటూ వార్తలను కొట్టి పడేశారు  అల్లు అరవింద్.

అంతేకాదు తన మనవారు అర్హ చాలా తెలివైందని.. చిన్న వయసులోనే చాలా తెలివైన అమ్మాయిలు చాలా అరుదుగా ఉంటారంటూ మనవరాలిపై ప్రశంసల వర్షం కురిపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..