AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lokesh Rajendran: ప్రముఖ సీరియల్‌ నటుడు ఆత్మహత్య! ‘అదే చివరి సారి చూడటం’

ప్రముఖ తమిళ సీరియల్‌ నటుడు లోకేష్ రాజేంద్రన్ (34) ఆత్మహత్య చేసుకున్నారు. మర్మదేశం సీరియల్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పాపులారిటీ పొందిన నటుడు లోకేష్..

Lokesh Rajendran: ప్రముఖ సీరియల్‌ నటుడు ఆత్మహత్య! 'అదే చివరి సారి చూడటం'
Lokesh Rajendran
Srilakshmi C
|

Updated on: Oct 06, 2022 | 8:34 PM

Share

ప్రముఖ తమిళ సీరియల్‌ నటుడు లోకేష్ రాజేంద్రన్ (34) ఆత్మహత్య చేసుకున్నారు. మర్మదేశం సీరియల్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పాపులారిటీ పొందిన నటుడు లోకేష్ కుటుంబ సమస్యల కారణంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో చెన్నై మోఫుసిల్ బస్ టెర్మినస్ (CMBT) వద్ద గత సోమవారం (అక్టోబర్‌ 2) అపస్మారక స్థితిలో కనిపించారు. గమనించిన పాదచారులు పోలీసులకు సమాచారం అదించి, 108కు ఫోన్‌ చేశారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కిల్‌పాక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచారు. దీనిపై పోలీసులు పీఆర్‌పీసీ సెక్షన్‌ 174 కింద కేసు నమోదు చేసుకున్నారు. ఇదే విధంగా పలు మార్లు రోడ్లపై తాగి పడిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.

కాగా తమిళనాట లోకేష్ రాజేంద్రన్ 150కి పైగా సీరియల్స్, 15 సినిమాల్లో నటించారు. నెల క్రితం నా కొడుకు, కోడలు మధ్య గొడవలు తలెత్తాయి. నాలుగు రోజుల క్రితం లోకేష్ భార్య విడాకుల నోటీసు పంపించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి నిస్పృహకు లోనయ్యాడు. చివరిసారిగా లోకేష్ శుక్రవారం చూశాను. ఎడిటర్‌గా పనిచేయడానికి కొంత డబ్బు కావాలని నా దగ్గరికి వచ్చాడు. డబ్బు ఇచ్చి పంపించానని, ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందని లోకేష్ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. లోకేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. లోకేష్ రాజేంద్రన్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. తమిళ సీనియర్‌ నటి పౌలిన్ జెస్సికా (దీప), సెప్టెంబర్ 18న చెన్నైలోని విరుగంబాక్కం మల్లికా అవెన్యూలోని తన అద్దె ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో నటుడు మృతి చెందడంతో సర్వత్యా విషాదం అలుముకొంది.

796650,796606,796673,796716

Follow Us
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!
మొదటి రోజు అట్టర్ ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే
మొదటి రోజు అట్టర్ ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే
కూతురి ఫీజు కోసం మారథాన్ గెలిచింది.. చెప్పులు లేకుండానే..
కూతురి ఫీజు కోసం మారథాన్ గెలిచింది.. చెప్పులు లేకుండానే..
IT రంగంలో మళ్లీ భారీ నియామకాలు..1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు
IT రంగంలో మళ్లీ భారీ నియామకాలు..1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు
ఏళ్ళ తరబడి ఆస్తమాతో బాధ పడేవాళ్ళు 3 సార్లు ఇలా చేస్తే చాలు
ఏళ్ళ తరబడి ఆస్తమాతో బాధ పడేవాళ్ళు 3 సార్లు ఇలా చేస్తే చాలు
రోజూ అవే పూరీలు ఏం తింటారు ఓ సారి ఇలా ట్రై చేయండి! హెల్దీ, టేస్టీ
రోజూ అవే పూరీలు ఏం తింటారు ఓ సారి ఇలా ట్రై చేయండి! హెల్దీ, టేస్టీ