AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush Poster: ఆదిపురుష్ కి పెరుగుతున్న కష్టాలు.. పోస్టర్ కాపీ అంటూ యానిమేషన్ స్టూడియో ఆరోపణలు..

టీజర్ ఫస్ట్ లుక్ పోస్టర్..  కొన్ని సన్నివేశాలు కాపీ చేయబడ్డాయని  యానిమేషన్ స్టూడియో ఇప్పుడు ప్రకటించింది. అయితే తమకు ఫిల్మ్ మేకర్స్‌తో 'ఫైట్' చేయాలనే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేసింది. 

Adipurush Poster: ఆదిపురుష్ కి పెరుగుతున్న కష్టాలు.. పోస్టర్ కాపీ అంటూ యానిమేషన్ స్టూడియో ఆరోపణలు..
Adipurush Poster Design Cop
Surya Kala
|

Updated on: Oct 06, 2022 | 1:28 PM

Share

బహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు యంగ్ హీరో ప్రభాస్.. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. ప్రభాస్ అభిమానుల ఉత్సాహాన్ని చూసి అక్టోబర్ 2న ప్రభాస్ ‘ఆదిపురుష’ టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. అయితే ఓం రౌత్ దర్శకత్వం వహించిన పౌరాణిక సినిమా ‘ఆదిపురుష్’ టీజర్ మాత్రం జనాల అంచనాలను అందుకోలేకపోయింది. ‘ఆదిపురుష’ సినిమా సన్నివేశాల్లో ఎఫెక్టివ్ ఏమీ లేదని నెటిజన్లు భావించారు. టీజర్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ నుండి కాపీ చేయబడిందని కూడా కొందరు ఘాటుగానే కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక యానిమేషన్ స్టూడియో పోస్టర్ కాపీ అని పేర్కొంది.

‘ఆదిపురుష’కి పెరుగుతున్న కష్టాలు

‘ఆదిపురుష’ టీజర్ లోని పాత్రల లుక్ అండ్ ఫీల్ ప్రస్తుతం నెటిజన్ల ట్రోల్ ను ఎదుర్కొంటుంది. ముఖ్యంగా రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ ‘భారతీయుడిగా కనిపించడం లేదు’ అని కొందరు భావించారు. టీజర్ ఫస్ట్ లుక్ పోస్టర్..  కొన్ని సన్నివేశాలు కాపీ చేయబడ్డాయని  యానిమేషన్ స్టూడియో ఇప్పుడు ప్రకటించింది. అయితే తమకు ఫిల్మ్ మేకర్స్‌తో ‘ఫైట్’ చేయాలనే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేసింది.

ఆదిపురుష’ పోస్టర్

ఇవి కూడా చదవండి

కాపీ చేసిన పోస్టర్‌ గురించి చాలా ఫన్నీగా  యానిమేషన్ స్టూడియో వాళ్ళు చెప్పారు. “మా పనిని ఇలా కాపీ చేయడం చాలా నిరాశపరిచింది. కానీ చాలా సంవత్సరాలుగా, ఇలా చాలా సార్లు జరుగుతూనే ఉంది. ఇది మాకు సర్వసాధారణంగా మారిందని చెప్పారు. మేము  రకరకాల పోస్టర్ డిజైన్స్ సృష్టించడం.. వంటి పనిపై మీ దృష్టిని కేంద్రీకరిస్తాము కాబట్టి మేము దీనిపై పోరాటం చేయాలనుకోమని పేర్కొంది. గొప్ప కంటెంట్ .. ఆ మార్గాన్ని సృష్టించడం కొనసాగుతుందన్నారు.

తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌కు సంబంధించి కూడా సినిమాపై పలు విమర్శలు వచ్చాయి. ప్రధాన పాత్రలైన రాముడు, రావణబ్రహ్మ, సీత, హనుమంతుడు ఇలా టీజర్ లో కనిపించిన పాత్రల లుక్ పై తీవ్ర విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రభాస్ , సైఫ్ అలీఖాన్ , కృతి సనన్, హనుమంతుడు ఇలా సినిమాలో అంతా డిఫరెంట్‌గా ఉండటంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

‘ఆదిపురుష’లో రాముడి పాత్రలో ప్రభాస్

‘ఆదిపురుష’ అనేది పౌరాణిక నేపధ్య సినిమా. ఇందులో ప్రభాస్ శ్రీరాముని పాత్రను పోషిస్తున్నాడు. సైఫ్ అలీఖాన్ లంకాధిపతి రావణబ్రహ్మ గా నటిస్తున్నాడు. ఆయన చివరిగా ‘విక్రమ్ వేద’ చిత్రంలో కనిపించారు. ఈ చిత్రంతో సైఫ్ అలీ ఖాన్  తెలుగులో  అరంగేట్రం చేయనున్నాడు. కృతి సనన్ , సన్నీ సింగ్ ‘ఆదిపురుష్’లో ప్రభాస్ , సైఫ్ అలీ ఖాన్‌లతో కలిసి కనిపించనున్నారు. దీని తెలుగు వెర్షన్ హక్కులను యూవీ క్రియేషన్స్ 100 కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ‘ఆదిపురుష్’ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ‘ఆదిపురుష’ జనవరి 12, 2023న థియేటర్లలో విడుదల కానుంది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..