Vijay Antony: సినిమా కథకు తీసిపోని బిచ్చగాడు హీరో నిజ జీవితం.. బాల్యం అంతా కష్టాల మయం..

విజయ్ జీవితం సినిమా కథకు ఏ మాత్రం తీసిపోదు. విజయ్ కు ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు తండ్రి మరణించాడు. అప్పుడు విజయ్ చెల్లి వయసు కేవలం నాలుగేళ్లు మాత్రమే.

Vijay Antony: సినిమా కథకు తీసిపోని బిచ్చగాడు హీరో నిజ జీవితం.. బాల్యం అంతా కష్టాల మయం..
Vijay Antony Life Story
Follow us
Surya Kala

|

Updated on: Sep 29, 2022 | 4:59 PM

Vijay Antony: ప్రస్తుత కాలంలో ప్రేమించి పెళ్లి చేసుకునేవారు అధికంగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఎక్కువగా ప్రేమ పెళ్లిళ్లు సర్వసాధారణం. సిల్వర్ స్క్రీన్ మీద కనిపించే నటీనటులే కాదు.. 24 క్రాప్ట్స్ లో పనిచేసేవారు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అంతేకాదు తనని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన వారిని ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు కూడా ఉన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ లతల పరిచయం ప్రేమ పెళ్లి అదే విధంగా జరిగిందన్న సంగతి తెలిసిందే. అంతేకాదు సామాన్యుడిగా చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి.. డిఫరెంట్ సినిమాలతో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న హీరో విజయ్ ఆంటోనీ లవ్ స్టోరీ కూడా సినిమాను తలపిస్తుంది.

బిచ్చగాడు, డాక్టర్ సలీం వంటి విభిన్నమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ. వరస సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ పెళ్లి కూడా అప్పట్లో ఓ సంచలనమే.. అని చెప్పచ్చు. విజయ్ ను ఫాతిమా అనే ఒక జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేసింది. అప్పుడు వీరిద్దరికి కలిగిన పరిచయం ప్రేమగా మారింది. 2006 లో విజయ్, ఫాతిమాలు పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు లారా అనే కూతురు ఉంది.

నిజానికి విజయ్ జీవితం సినిమా కథకు ఏ మాత్రం తీసిపోదు.. కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్‌లో జన్మించారు. అసలు పేరు ఆంటోని సిరిల్ రాజా.. విజయ్ కు ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు తండ్రి మరణించాడు. అప్పుడు విజయ్ చెల్లి వయసు కేవలం నాలుగేళ్లు మాత్రమే. విజయ తల్లి ఉద్యోగం చేస్తూ ఇద్దరు పిల్లలని పెంచారు. అయితే పిల్లల చదువు కోసం ఒకే ఊరులో ఉంటూ.. తాను ఉద్యోగానికి వేరే ఊరు వెళ్లేవారు విజయ్ తల్లి. బాల్యాన్ని కష్టాల్లోనే గడపాల్సి వచ్చింది. అతను తిరుచ్చిలోని సెయింట్ జేవియర్ కళాశాల నుండి సైన్స్‌లో గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందాడు. చెన్నైలోని ప్రసిద్ధ లయోలా కళాశాలలో విజువల్ కమ్యూనికేషన్స్ కోర్సులో చేరాడు. చదువుతో పాటు ఖర్చుల కోసం ఓ స్టూడియోలో పార్ట్‌టైమ్ జాబ్ కూడా చేసేవాడు. విజయ్ తల్లి ఉద్యోగ రీత్యా శిక్షణ తరగతులకు వెళ్లాల్సి వచ్చిన సమయంలో విజయ్ ను హాస్టల్ లో ఉంచి తనతో పాటు కూతురిని తీసుకెళ్లేవారు. ఒకానొక సమయంలో హాస్టల్ కు రెండు రోజులు సెలవులు రావడంతో వార్డెన్ సలహా మేరకు శ్రీలంక శరణార్ధుల శిబిరంలో తలదాచుకున్నారు విజయ్. అంతేకాదు తాను అరటి పండ్లు తిని జీవనాన్ని కొనసాగించిన విషయాన్ని విజయ్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు.

ఇవి కూడా చదవండి

లయోలా కళాశాల నుండి డిగ్రీ పొందిన తరువాత, అతను ఆడియోఫిల్స్ అనే స్టూడియోని స్థాపించాడు. తన స్టూడియోలో సౌండ్ ఇంజనీరింగ్ చేసేవాడు. అనేక డాక్యుమెంటరీలు, TV కోసం అనేక జింగిల్స్ కంపోజ్ చేశాడు. తమిళ చిత్రం డిష్యుమ్‌కు సంగీతం అందించడానికి ఆస్కార్ రవిచంద్రన్ అతన్ని సంప్రదించారు.. విజయ్ ఆంటోనీ 2005లో సంగీత దర్శకుడిగా వెండి తెరపై అరంగేట్రం చేసాడు

విజయ్ మల్టీ టాలెంటెడ్ పర్సన్.. మంచి సంగీత స్వరకర్త, నేపథ్య గాయకుడు, నటుడు, చలనచిత్ర సంపాదకుడు, గీత రచయిత, ఆడియో ఇంజనీర్,  చలనచిత్ర నిర్మాత. ఉత్తమ సంగీత విభాగంలో నాక ముక్క యాడ్ చిత్రం కోసం 2009 కేన్స్ గోల్డెన్ లయన్‌ను గెలుచుకున్న మొదటి భారతీయుడుగా చరిత్ర సృష్టించాడు. ఈ పాట అతని కీర్తిని రెట్టింపు చేసింది. 2011 క్రికెట్ ప్రపంచ కప్‌లో ప్లే చేయబడింది.

విజయ్ నాన్ 2012 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. డాక్టర్ సలీమ్ సినిమాతో విజయ్ కు మంచి గుర్తింపు వచ్చింది. బిచ్చగాడు సినిమాతో అనేక మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.

మరిన్నిఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..