Viral Photo: ఆ బాలీవుడ్ నటి పెళ్ళికి హాజరై సందడి చేసిన కుర్రోడు.. నేడు ఆమెతోనే లవ్‌లో ఉన్నాడు

1998లో అర్బాజ్,  మలైకాలు హిందూ,  క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం రెండు సార్లు వివాహం చేసుకున్నారు. అయితే ఈ పెళ్లిలో అర్జున్ కపూర్ కూడా సందడి చేశాడు. ఇప్పడు ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Viral Photo: ఆ బాలీవుడ్ నటి పెళ్ళికి హాజరై సందడి చేసిన కుర్రోడు.. నేడు ఆమెతోనే లవ్‌లో ఉన్నాడు
Viral Photo In Social Media
Follow us
Surya Kala

|

Updated on: Sep 24, 2022 | 5:59 PM

Viral Photo: దివిలో నిర్ణయం.. భువిలో పరిణయం అని హిందువుల నమ్మకం..  మనుషుల మధ్య పరిచయాలు, స్నేహం, ప్రేమ, శత్రుత్వం, పెళ్లి ఇవన్నీ విధి రాతను అనుసరించి సాగేవని.. వీటిని ఎవరూ మార్చలేరని తరచుగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సంఘటనలు విధిరాతను అనుసరిస్తూ సాగుతాయని అన్నమాట నిజమేమో అనిపించక మానదు ఎవరికైనా.. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ప్రస్తుతం బీ టౌన్ తో పాటు.. సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన జంట మలైకా అరోరా, అర్జున్ కపూర్‌. ఈ జంట ప్రేమాయణం.. వీరిద్దరికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిని చూపిస్తూనే ఉన్నారు. మలైకా అరోరా, అర్జున్ కపూర్‌ల పెళ్లి ఎప్పుడ‌ని అభిమానులు ఆలోచిస్తూనే ఉన్నారు. అయితే ఈ జంట ఇంకా పెళ్లి విషయాన్ని ప్రకటించలేదు. వీరిద్దరూ త్వరలో పెళ్లి పీటలు ఎక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మలైకా..  అర్జున్ కంటే 12 సంవత్సరాలు పెద్దది. ఈ వయస్సు అంతరం కారణంగా ప్రతిరోజూ వార్తల్లో నిలుస్తుంది. అయితే మలైకా పెళ్లిలో అర్జున్ ఎలా కనిపించాడో తెలుసా?

పెళ్లిలో అర్జున్: 

బాలీవుడ్ కండల వీరుడి తమ్ముడు అర్బాజ్.. ఐటెం సాంగ్ భామ మలైకాల ప్రేమకథ ఒకప్పుడు చాలా చర్చనీయాంశమైంది. తొలి చూపులోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అర్బాజ్, మలైకా దాదాపు ఐదేళ్ల పాటు డేటింగ్ చేశారు. చాలా కాలం డేటింగ్ తర్వాత, వారు వివాహం చేసుకున్నారు. 1998లో అర్బాజ్,  మలైకాలు హిందూ,  క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం రెండు సార్లు వివాహం చేసుకున్నారు. అయితే ఈ పెళ్లిలో అర్జున్ కపూర్ కూడా సందడి చేశాడు. ఇప్పడు ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫోటో మలైకా అరోరా, అర్బాజ్ ఖాన్ పెళ్లిలో అర్జున్ దిగిన ఫోటో. పెళ్లిలో కూల్ డ్రింక్ తాగుతూ కనిపించాడు. మలైకా మొదటి పెళ్లి జరిగిన సమయంలో అర్జున్ కపూర్ చాలా చిన్నగా ఉన్నాడు. ఈ ఫోటోని చూసిన చాలా మంది ఇదే కదా చిత్రంలో విచిత్రం అంటున్నారు. చిన్నప్పుడు మలైకా పెళ్లికి వెళ్లి ఎంజాయ్ చేసిన ఆ కుర్రాడు.. ఇప్పడు ఆమెని ప్రేమించడం సహజీవనం చేయడం నిజంగా విధి రాతను ఎవరూ అంచనా వేయలేరని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

2017లో విడాకులు తీసుకున్నారు

పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత 2002లో 25 ఏళ్ల మలైకా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. దాదాపు దశాబ్దంన్నర పాటు వీరిద్దరి వైవాహిక జీవితం బాగానే సాగింది. తర్వాత కాలక్రమంలో ఇద్దరి మధ్య వివాదాలతో దూరం పెరిగి విషయం విడాకుల దాకా చేరింది. ఫలితంగా అర్బాజ్, మలైకాలు 2017లో విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత, మలైకా.. బాలీవుడ్ యంగ్ హీరో.. తనకంటే దాదాపు 12 ఏళ్ళు చిన్నవాడైన అర్జున్  కపూర్ తో డేటింగ్ లో ఉంది. ప్రస్తుతం వీరిద్దరి సంబంధం గురించి చర్చ జరుగుతూనే ఉంది.

తమ జీవితాలతో ముందుకు సాగుతున్న అర్బాజ్, మలైకా

మలైకా అరోరా, అర్బాజ్ ఖాన్ విడాకులు తీసుకుని ఇప్పటికి ఐదేళ్లు దాటాయి. అయితే వీరిద్దరూ మళ్లీ పెళ్లి చేసుకోలేదు. అయితే ఇద్దరూ తమ తమ  రిలేషన్‌షిప్‌లో చాలా సంతోషంగా ఉన్నారు. అర్బాజ్ ఖాన్ ప్రస్తుతం 22 ఏళ్ల మోడల్ జార్జియా ఆండ్రియానితో డేటింగ్ చేస్తున్నాడు. మరోవైపు మలైకా కూడా అర్జున్‌తో తన ప్రేమ జీవితాన్ని ఆస్వాదిస్తోంది.

మరిన్నిఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..