AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: ఆ బాలీవుడ్ హీరోకు అల్లు అర్జున్ అంటే ఇష్టమట.. అతనే ఫేవరేట్ అంటూ పోస్ట్.. ఇంతకీ అతడెవరంటే..

తన ఫాలోవర్లతో ఆస్క్ మి ఎనీథింగ్ సెషన్ నిర్వహించిన టైగర్ ష్రాఫ్.. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఇందులో దక్షిణాది ఇండస్ట్రీలో తన ఫేవరేట్ హీరో ఎవరు అని అడగ్గా.. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ అంటూ చెప్పుకొచ్చారు.

Allu Arjun: ఆ బాలీవుడ్ హీరోకు అల్లు అర్జున్ అంటే ఇష్టమట.. అతనే ఫేవరేట్ అంటూ పోస్ట్.. ఇంతకీ అతడెవరంటే..
Allu Arjun
Rajitha Chanti
|

Updated on: Sep 24, 2022 | 7:43 PM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప మూవీతో బన్నీ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. అప్పటివరకు సౌత్ ఇండస్ట్రీలోనే స్టైలీష్ స్టార్‏గా ఉన్న బన్నీ.. బాలీవుడ్‏లో ఫాలోయింగ్ పెరిగిపోయింది. పుష్పరాజ్‏గా ఆయన నటన.. యాటిట్యూడ్ చూసిన నార్త్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. కేవలం సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాకుండా.. సినీ ప్రముఖులు సైతం బన్నీ స్టైల్‏కు ఫ్యాన్స్ అయిపోయారు. తాజాగా బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్ తన ఫేవరేట్ హీరో అర్జున్ అంటూ సోషల్ మీడియా వేదికగా చెప్పేశాడు. తన ఫాలోవర్లతో ఆస్క్ మి ఎనీథింగ్ సెషన్ నిర్వహించిన టైగర్ ష్రాఫ్.. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఇందులో దక్షిణాది ఇండస్ట్రీలో తన ఫేవరేట్ హీరో ఎవరు అని అడగ్గా.. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ అంటూ చెప్పుకొచ్చారు. టైగర్ ష్రాఫ్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.

ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రీకరణలో పాల్గోంటున్నాడు. ఇటీవలే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇందులో రష్మిక మందన్నా, ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలకపాత్రలలో నటిస్తున్నారు. అయితే ఇందులో విజయ్ సేతుపతి కూడా కనిపించనున్నాడని గత కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తుంది. అంతేకాకుండా.. సెకండ్ పార్ట్ లో బన్నీ, రష్మిక సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. ఈ సినిమా కాకుండా డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బన్నీ ఓ మూవీ చేయాల్సి ఉంది. కానీ ఈ ప్రాజెక్ట్ అగిపోయినట్లుగా తెలుస్తోంది. కొన్ని కారణాల వల్ల ఐకాన్ చిత్రం నుంచి బన్నీ తప్పుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి
Tiger Shroff

Tiger Shroff

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.