Prudhvi: ‘ఆ కారణంగానే సినిమాలకు దూరమయ్యాను.. ఆ పొరపాటు ఇప్పుడు అర్థమైంది’.. నటుడు పృథ్వీ కామెంట్స్..

తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను సినిమాలకు దూరం కావడానికి గల అసలు కారణం వెల్లడించారు. డిప్రెషన్ కారణంగానే తాను సినిమాలకు దూరమయ్యానని చెప్పారు.

Prudhvi: 'ఆ కారణంగానే సినిమాలకు దూరమయ్యాను.. ఆ పొరపాటు ఇప్పుడు అర్థమైంది'.. నటుడు పృథ్వీ కామెంట్స్..
Pruthvi
Follow us

|

Updated on: Sep 24, 2022 | 3:10 PM

తెలుగు చిత్రపరిశ్రమలో ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే విలక్షణ నటులలో పృథ్వీ (Prudhvi) ఒకరు. డైరెక్టర్ కోడి రామకృష్ణ తెరకెక్కించిన పెళ్లి సినిమాలో ప్రతి నాయకుడి పాత్రలో కనిపించారు. 1997లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది. అంతేకాకుండా.. ఈ మూవీతో పృథ్వీకి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. దీంతో తెలుగులో వరుస అవకాశాలను అందుకున్నారు. విలన్‏గానే కాకుండా తన కామెడీ టైమింగ్‏తో ఆడియన్స్ ను అలరించారు. సమరసింహారెడ్డి, నువ్వు నాకు నచ్చావ్, దేవుళ్లు, ప్రేయసి రావే వంటి చిత్రాల్లో నటిస్తూ.. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే ఆయన సినిమాలకు దూరమయ్యారు. చాలా కాలం వెండితెరపై పృథ్వీ కనిపించలేదు. ఇక ఇటీవలే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. కేవలం మూవీస్ మాత్రమే కాకుండా సీరియల్స్ ద్వారా బుల్లితెర పై సందడి చేస్తున్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను సినిమాలకు దూరం కావడానికి గల అసలు కారణం వెల్లడించారు. డిప్రెషన్ కారణంగానే తాను సినిమాలకు దూరమయ్యానని చెప్పారు.

పృథ్వీ మాట్లాడుతూ.. “ఇప్పటికీ అందరూ నన్ను పెళ్లి పృథ్వీ అని పిలుస్తారు. నటుడిగా నేను ఇంకా సంతృప్తి చెందలేదు. చేయాల్సిన పాత్రలు ఇంకా చాలా ఉన్నాయి. మాకు ఒకడే అబ్బాయి. తనకు ప్రస్తుతం 27 ఏల్లు. మానసిక ఎదుగుదల లేదు. మాట్లాడలేడు. మొదటిసారి ఈ విషయం తెలియగానే నేను డిప్రెషన్‏లోకి వెళ్లిపోయాను. అలా తొమ్మిదేళ్లపాటు డిప్రెషన్‏లోనే ఉండిపోయాను. దీంతో సినిమాలు చేయలేదు. వచ్చిన అవకాశాలను వదులుకున్నాను. అది ఎంత పెద్ద పొరపాటు అనేది ఇప్పుడు అర్థమైంది. అలాగే కొందరు హీరోస్.. నా సన్నివేశాలను కట్ చేయించేవారని తెలిసి చాలా బాధపడ్డాను. ఇవన్నీ నా కెరియర్ పై ప్రభావం చూపించాయి”. అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఇటీవలే గృహలక్ష్మీ సీరియల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు