Trisha: పొన్నియిన్ సెల్వన్ ఈవెంట్‍లో స్పెషల్ అట్రాక్షన్‎గా ‘త్రిష’.. అందరి చూపులు అమ్మడు పైనే..

ఇప్పటికే సినిమా ప్రమోషన్లను ప్రారంభించిన చిత్రయూనిట్.. శుక్రవారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ వేడుకలో త్రిష స్పెషల్ అట్రాక్షన్‏గా నిలిచింది.

Trisha: పొన్నియిన్ సెల్వన్ ఈవెంట్‍లో స్పెషల్ అట్రాక్షన్‎గా 'త్రిష'.. అందరి చూపులు అమ్మడు పైనే..
Trisha
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 24, 2022 | 3:37 PM

ఒకప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో చేతి నిండా సినిమాలతో అగ్రకథానాయికగా దూసుకుపోయింది త్రిష (Trisha). అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా.. నటనపరంగానూ మంచి ప్రశంసలు అందుకుంది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ చిన్నది.. ఇప్పటికీ సినిమాలతో బిజీగానే ఉంది. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవలే తమిళ్ చిత్రం 96తో రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో నటిస్తోంది. ఇందులో యువరాణి కుందవై పాత్రలో కనిపించనుంది. అన్ని కార్యక్రామాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్లను ప్రారంభించిన చిత్రయూనిట్.. శుక్రవారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ వేడుకలో త్రిష స్పెషల్ అట్రాక్షన్‏గా నిలిచింది.

నాలుగు పదుల వయసులోనూ ఏమాత్రం తరగని అందంతో.. చిరునవ్వులు చిందిస్తూ వేదికపై సందడి చేసింది. బ్లాక్ శాలరీలో నల్ల గులాబీలో మెరిసిపోయింది. దీంతో అందరి చూపులు త్రిషపై ఉన్నాయనడంలో సందేహం లేదు. ఇక వేదికపై అటు ఐశ్వర్య రాయ్, త్రిష ఇద్దరు కలిసి ఉండడం చూసేందుకు రెండు కళ్లు సరిపోలేదని అంటున్నారు. ముఖ్యంగా త్రిష మరింత అందంగా కనిపిస్తుందని.. దీంతో ఆమెకు తిరిగి అవకాశాలు క్యూ కట్టే అవకాశముందంటున్నారు అభిమానులు. నాలుగు పదుల వయసులోనూ పెళ్లికి దూరంగా ఉంటూ.. మరింత అందంగా తయారైన త్రిషను చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇక డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టుగా రాబోతున్న పొన్నియిన్ సెల్వన్ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.

View this post on Instagram

A post shared by Trish (@trishakrishnan)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?