Nayanthara Vignesh Shivan: విఘ్నేష్ శివన్ ప్రేమలో నయన్ ఎలా పడిందో తెలుసా ?.. ఆకట్టుకుంటున్న లేడీ సూపర్ స్టార్ లవ్ డాక్యుమెంటరీ..

నయన్, విఘ్నేష్ పెళ్లితోపాటు.. వారిద్ధరు కలిసి ఉన్న మధర ఘట్టాలను సైతం చూపించారు. అంతేకాకుండా అందులో వారి ప్రేమ, పెళ్లికి సంబంధించిచన ప్రశ్నలు సైతం అడిగినట్లుగా తెలుస్తోంది.

Nayanthara Vignesh Shivan: విఘ్నేష్ శివన్ ప్రేమలో నయన్ ఎలా పడిందో తెలుసా ?.. ఆకట్టుకుంటున్న లేడీ సూపర్ స్టార్ లవ్ డాక్యుమెంటరీ..
Nayan Vighnesh
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 24, 2022 | 6:55 PM

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara ) కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు ఇటీవల ఇరువురి కుటుంబసభ్యుల సమక్షంలో మూడుమూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లికి సన్నిహితులు.. అతికొద్ది మంది సినీ ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. ప్రస్తుతం ఈ కొత్త జంట విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే నయన్, విఘ్నేశ్ ప్రేమ, పెళ్లి డాక్యుమెంటరీగా వస్తున్న సంగతి తెలిసిందే. దీనిని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ నయనతార బియాండ్ ది ఫెయిరీటేల్ పేరుతో తీసుకురాబోతుంది. నయన్ పెళ్లిని డాక్యుమెంటరీగా తీసుకువచ్చేందుకు నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తంలో చెల్లించదట. ఇప్పటికే వీరిద్దరి ప్రీ వెడ్డింగ్ ఫోటోస్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.. అందులో నయన్, విఘ్నేష్ పెళ్లితోపాటు.. వారిద్ధరు కలిసి ఉన్న మధర ఘట్టాలను సైతం చూపించారు. అంతేకాకుండా అందులో వారి ప్రేమ, పెళ్లికి సంబంధించిచన ప్రశ్నలు సైతం అడిగినట్లుగా తెలుస్తోంది.

నయనతార ఎందుకు ? అని విఘ్నేష్ శివన్‏ను ప్రశ్నిచంగా.. ఏంజెలినా జోలీ కూడ అడిగింది. కాకపోతే ఆమె దక్షిణ భారత దేశానికి చెందిన అమ్మాయి కాకపోవడంతో ఒప్పుకోలేదు అంటూ నవ్వుతూ ఆన్సర్ ఇచ్చారు విఘ్నేష్. నటి కన్నా.. నయన మంచి మనిషి అంటూ తన ప్రేమను వ్యక్తం చేశారు. ఇక నయన్ మాట్లాడుతూ.. తమ ప్రేమ ఎప్పుడు మొదలైందో ఐడియా లేదని.. నేనేమీ ఫిల్మ్ కిడ్‏ను కాదు. సాధారణ అమ్మాయిని. అలాంటి అమ్మాయి 100 శాతం ఏం ఇవ్వగలదో నేనూ అదే ఇస్తాను అని తెలిపింది. ప్రస్తుతం నయన్ మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న గాడ్ ఫాదర్ చిత్రంలో నటిస్తోంది. ఇందులో నయన్ చిరు చెల్లెలిగా కనిపించనుంది. అలాగే డైరెక్టర్ అట్లీ, షారుఖ్ ఖాన్ కాంబోలో రాబోతున్న జవాన్ చిత్రంలోనూ నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.