AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: పెద్దనాన్న మరణం తర్వాత తొలిసారి సోషల్ మీడియాలో ప్రభాస్ పోస్ట్.. దేని గురించి అంటే..

తాజాగా డార్లింగ్ అభిమానులు సైతం ఈ విషయాన్ని నిరూపించారు. కృష్ణంరాజు, ప్రభాస్ చిత్రాల్లోని పలు సన్నివేశాలను జత చేస్తూ ప్రత్యేకంగా ఓ వీడియోను రూపొందించారు ఫ్యాన్స్.

Prabhas: పెద్దనాన్న మరణం తర్వాత తొలిసారి సోషల్ మీడియాలో ప్రభాస్ పోస్ట్.. దేని గురించి అంటే..
Prabhas
Rajitha Chanti
|

Updated on: Sep 24, 2022 | 6:26 PM

Share

దివంగత నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో ప్రభాస్ (Prabhas) కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అన్ని సమయాల్లో తనకు అండగా ఉన్న పెద్దనాన్న అకాల మరణంతో ప్రభాస్ తీవ్ర దుఃఖంలో ఉండిపోయారు. కృష్ణంరాజు నట వారసుడిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. అతి తక్కువ సమయంలోనే యంగ్ రెబల్ స్టార్‏గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ క్రేజ్ చూసి కృష్ణంరాజు సైతం ఎన్నోసార్లు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. నటనలో… స్టైల్‏లోనూ.. కృష్ణంరాజుకు ఏమాత్రం తీసిపోరు ప్రభాస్. తాజాగా డార్లింగ్ అభిమానులు సైతం ఈ విషయాన్ని నిరూపించారు. కృష్ణంరాజు, ప్రభాస్ చిత్రాల్లోని పలు సన్నివేశాలను జత చేస్తూ ప్రత్యేకంగా ఓ వీడియోను రూపొందించారు ఫ్యాన్స్. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. తాజాగా అదే వీడియోను ప్రభాస్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ.. హార్ట్ సింబల్‍తోపాటు.. దండం పెడుతున్న ఏమోజీని షేర్ చేస్తూ.. తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.

ఆ వీడియోలో ప్రభాస్, కృష్ణంరాజు ఎక్స్‏ప్రెషన్స్ నుంచి వారిద్దరి యాక్షన్ సన్నివేశాలు.. సాంగ్స్.. వరకు అన్ని సీన్స్ ఓకేలా ఉన్నాయి. అంతేకాకుండా.. వారి సీన్స్‏కు తగినట్టుగా బ్యాగ్రౌండ్‏లో ప్రభాస్ నటించిన సినిమాల సాంగ్స్ మరింత హైలెట్‏గా నిలిచింది. కృష్ణంరాజు మరణం తర్వాత తొలిసారి ప్రభాస్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేయడంతో అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. కృష్ణం రాజు దాదాపు 183 చిత్రాల్లో నటించి మెప్పించారు. అంతేకాకుండా.. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన బిల్లా, రాధేశ్యామ్ వంటి చిత్రాల్లో కీలకపాత్రలలో కనిపించారు. ప్రస్తుతం ప్రభాస్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆదిపురుష్ షూటింగ్ కంప్లీట్ కాగా.. సలార్, స్పిరిట్, ప్రాజెక్ట్ కె చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఇక ప్రభాస్ సొంత గ్రామం మొగల్తూరులో ఈనెల 29న కృష్ణంరాజు స్మారక సభ నిర్వహించనున్నారు. ఈ సభను పెద్ద నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభ కోసం 70 వేల మందికి భోజనం ఏర్పాట్లు చేస్తున్నారట.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్