AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే నిమిషాల్లో మాయం!

వేసవి, వర్షాకాలంలో రాత్రి వేళ నిద్రిస్తున్నప్పుడు వచ్చే చెమట, శరీరంలోని నూనెలు బెడ్‌షీట్లలోకి చేరుతుంటాయి. దీనివల్ల సాధారణ సర్ఫ్‌తో ఎంత బాగా ఉతికినా దుప్పటి నుంచి సన్నని దుర్వాసన లేదా కంపు రావడం మానదు. ఈ సమస్యకు ఇంట్లో ఉండే వైట్ వినెగర్ అద్భుతమైన పరిష్కారంగా పనిచేస్తుంది. వినెగర్‌తో క్లీన్‌ చేయటం వల్ల దుప్పటి దారాల్లో పట్టుకున్న చెమట, డిటర్జెంట్ అవశేషాలను తొలగించి బెడ్‌షీట్‌ను తాజాగా, మెత్తగా మారుస్తుంది. బెడ్‌షీట్ల దుర్వాసన పోగొట్టడానికి వినెగర్‌ను సరైన పద్ధతిలో ఎలా వాడాలో వివరంగా తెలుసుకోండి.

బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే నిమిషాల్లో మాయం!
White Vinegar For Bed SheetImage Credit source: AI image
Jyothi Gadda
|

Updated on: Aug 16, 2026 | 9:01 PM

Share

రోజంతా కష్టపడి రాత్రి పడుకునే ముందు మన బెడ్‌షీట్ తాజాగా, మంచి సువాసనతో ఉంటేనే గాఢమైన నిద్ర పడుతుంది. కానీ, తరచూ రాత్రివేళ పట్టే చెమట, బాడీ ఆయిల్స్ బెడ్‌షీట్ దారాల్లోకి ఇంకిపోవడం వల్ల డిటర్జెంట్‌తో ఉతికినా కూడా ఒక రకమైన చెమట వాసన, ముక్క వాసన మిగిలిపోతుంది. అంతేకాకుండా బట్టలు ఉతికే పౌడర్లు, ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌నర్లు బట్టలపై ఒక పొరలా పేరుకుపోయి బెడ్‌షీట్‌ను గట్టిగా తయారుచేస్తాయి. ఈ సమస్యకు ఖరీదైన కెమికల్స్ కాకుండా మన ఇంట్లో లభించే వైట్ వినెగర్ చాలా బాగా పనిచేస్తుంది.

వైట్ వినెగర్ ఎలా పనిచేస్తుంది?:

సాధారణ వైట్ వినెగర్‌లో స్వల్ప ఆమ్లత ఉంటుంది. ఇది గుడ్డ దారాల్లో పేరుకుపోయిన చెమట, శరీర నూనెలు, డిటర్జెంట్ మిగులును కరిగించి వేస్తుంది. ఇది బ్యాక్టీరియాను నివారించి బట్టలలోని దుర్వాసనను పారదోలి, ఫ్యాబ్రిక్‌ను మెత్తగా మార్చుతుంది.

బెడ్‌షీట్లు ఉతికేటప్పుడు వినెగర్ ఎలా ఉపయోగించాలి?

లాండ్రీ వాషింగ్ ప్రాసెస్: ముందుగా బెడ్‌షీట్‌ను వాషింగ్ మెషిన్‌లో వేసి సాధారణ డిటర్జెంట్‌తో ఉతకాలి.

ఇవి కూడా చదవండి

చివరిసారిగా నీళ్లలో ఉతికేటప్పుడు: వాషింగ్ మెషిన్‌లోని ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌నర్ కంపార్ట్‌మెంట్‌లో అర కప్పు వైట్ వినెగర్ వేయాలి. ఇలా చేయడం వల్ల చివరి రిన్స్ సైకిల్‌లో వినెగర్ నీటితో కలసి బెడ్‌షీట్ దుర్వాసనను తొలగిస్తుంది.

చేతితో ఉతికేవారు: ఒక బకెట్ నీటిలో అర కప్పు వైట్ వినెగర్ కలిపి, ఉతికిన బెడ్‌షీట్‌ను అందులో 10 నిమిషాలు ఉంచి ఆపై పిండి ఆరబెట్టాలి.

ముఖ్యమైన గమనిక: ఎల్లప్పుడూ కేవలం డిస్టిల్డ్ వైట్ వినెగర్‌నే వాడాలి. ఆపిల్ సైడర్ లేదా కలర్ వినెగర్లు వాడితే దుప్పట్లపై మచ్చలు పడే ప్రమాదం ఉంది.

ఎన్ని రోజులకు ఒకసారి వాడాలి?:

ప్రతిసారి ఉతికేటప్పుడు వినెగర్ వాడాల్సిన అవసరం లేదు. నెలకు ఒకసారి లేదా రెండుసార్లు బెడ్‌షీట్ల దుర్వాసన ఎక్కువైనప్పుడు వాడితే సరిపోతుంది. అతిగా వాడితే బట్టల రంగు, మెషిన్ రబ్బర్ విడిభాగాలపై ప్రభావం పడవచ్చు.

ఎండలో ఆరబెట్టడం తప్పనిసరి:

ఉతికిన తర్వాత బెడ్‌షీట్లను మెషిన్‌లోనే గంటల తరబడి ఉంచకూడదు. దానివల్ల మళ్లీ తేమ వల్ల ముక్క వాసన వస్తుంది. ఉతికిన వెంటనే తీసి ఎండలో ఆరబెట్టాలి. బాగా ఎండిన తర్వాతే మడిచి పెట్టుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో
31 ఏళ్ల రికార్డులు బద్దలు.. కమిన్స్ పేరిట చెత్త రికార్డ్..!
31 ఏళ్ల రికార్డులు బద్దలు.. కమిన్స్ పేరిట చెత్త రికార్డ్..!
ఇదెక్కడి బాల్ రా సామీ.. ఆసీస్ బ్యాటర్ మైండ్ బ్లాంక్
ఇదెక్కడి బాల్ రా సామీ.. ఆసీస్ బ్యాటర్ మైండ్ బ్లాంక్
రాత్రిపూట పుదీనా టీ తాగి పడుకుంటే ఏమవుతుందో తెలుసా? ఆరోగ్య లాభాలు
రాత్రిపూట పుదీనా టీ తాగి పడుకుంటే ఏమవుతుందో తెలుసా? ఆరోగ్య లాభాలు
వేప మ్యాజిక్.. ఉదయాన్నే 4 ఆకులు తింటే మొండి రోగాలన్నీ మటుమాయం..
వేప మ్యాజిక్.. ఉదయాన్నే 4 ఆకులు తింటే మొండి రోగాలన్నీ మటుమాయం..
పాన్ మసాలాలపై ప్రచారం.. బాలీవుడ్ స్టార్ హీరోలకు నోటీసులు
పాన్ మసాలాలపై ప్రచారం.. బాలీవుడ్ స్టార్ హీరోలకు నోటీసులు