AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోడిగుడ్డు మంచిదో కాదో కనిపెట్టడం ఎలా? నీళ్లలో వేస్తే నిజం తేలిపోతుంది!

మన రోజువారీ ఆహారంలో కోడిగుడ్లు ముఖ్యమైన భాగం. కానీ, మనం వంట చేయడానికి వాడే గుడ్డు మంచిదా లేక కుళ్ళిపోయిందా అని గుర్తించడం ఒక్కోసారి కష్టమవుతుంది. ఈ సమస్యకు అత్యంత తేలికైన పరిష్కారం వాటర్ ఫ్లోట్ టెస్ట్. ఇది ఎలా పనిచేస్తుంది.. ? తాజా గుడ్లను సులభంగా గుర్తించడానికి ఉపయోగపడే చిట్కాలు, ఇతర పద్ధతుల గురించి తెలుసుకోండి.

కోడిగుడ్డు మంచిదో కాదో కనిపెట్టడం ఎలా? నీళ్లలో వేస్తే నిజం తేలిపోతుంది!
How To Check If Eggs Are Fresh
Jyothi Gadda
|

Updated on: Aug 16, 2026 | 8:27 PM

Share

ప్రోటీన్లు పుష్కలంగా ఉండే కోడిగుడ్లు మన దైనందిన ఆహారంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు గుడ్లతో రకరకాల వంటకాలు చేస్తుంటాం. అయితే, మన ఇంట్లో ఉన్న గుడ్లు తాజాగా ఉన్నాయా లేక కుళ్ళిపోయాయా అనేది పగలకుట్టకుండా చెప్పడం కాస్త కష్టమైన విషయమే. పాడైపోయిన గుడ్డును పొరపాటున తింటే కడుపునొప్పి, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మీ గుడ్డు మంచిదో కాదో నిమిషాల్లో తెలుసుకునే కొన్ని సులువైన గృహ చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

వాటర్ ఫ్లోట్ టెస్ట్ :

గుడ్డు నాణ్యతను పరీక్షించడానికి ఇది అత్యంత ప్రసిద్ధమైన, శాస్త్రీయమైన పద్ధతి. ఒక గాజు గ్లాసు లేదా పాత్రలో చల్లని నీటిని నింపి, అందులో గుడ్డును వేయండి. గుడ్డు పాత్ర అడుగు భాగానికి చేరి అడ్డంగా పడుకుంటే అది అత్యంత తాజాదని అర్థం. అలా కాకుండా గుడ్డు అడుగున నిలువుగా ఉంటే అది కొన్ని రోజుల పాతదని, కానీ తినడానికి సురక్షితమైనదని అర్థం. లేదా గుడ్డు నీటి పైన తేలియాడితే అది పూర్తిగా పాడైపోయిందని, కుళ్ళిపోయిందని గుర్తించాలి. ఎలాగంటే.. గుడ్డు పాతబడే కొద్దీ దాని లోపల ఉన్న గాలి బుడగ పరిమాణం పెరుగుతుంది. అందువల్ల అది నీటిపై తేలుతుంది. .

వాసన చూసి గుర్తించడం :

గుడ్డును పగలగొట్టిన తర్వాత దాని నుంచి తీవ్రమైన, అసహ్యకరమైన దుర్వాసన వస్తే అది కుళ్ళిపోయిందని స్పష్టమవుతుంది. తాజా గుడ్డుకు ఎటువంటి బలమైన వాసన ఉండదు.

ఇవి కూడా చదవండి

షేక్ టెస్ట్ :

గుడ్డును చెవి దగ్గర పెట్టుకుని మెల్లగా ఊపి చూడండి. లోపల ద్రవం కదులుతున్నట్లు గలగల శబ్దం వస్తే ఆ గుడ్డు పాతబడిందని లేదా పాడైపోయిందని అర్థం. తాజా గుడ్డులో గాలి తక్కువగా ఉండటం వల్ల ఎలాంటి శబ్దం రాదు.

కాంతి పరీక్ష :

చీకటి గదిలో గుడ్డు వెనుక వైపు మొబైల్ ఫ్లాష్‌లైట్ వేసి చూడండి. లోపల కాంతి స్పష్టంగా ప్రసరిస్తూ గాలి బుడగ చిన్నదిగా కనిపిస్తే అది తాజా గుడ్డు. ఈ చిన్న చిన్న చిట్కాలతో మీరు వంట చేసే ముందే పాడైపోయిన గుడ్లను సులభంగా గుర్తించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
దీపావళి రాత్రి పూజ చేయలేకపోతున్నారా? లక్ష్మీదేవి 108 నామాలు..
దీపావళి రాత్రి పూజ చేయలేకపోతున్నారా? లక్ష్మీదేవి 108 నామాలు..
వీరూ కొడుకుపై పాక్ స్పిన్నర్ ప్రతాపం.. వికెట్ తీసి మరీ సెండాఫ్
వీరూ కొడుకుపై పాక్ స్పిన్నర్ ప్రతాపం.. వికెట్ తీసి మరీ సెండాఫ్
ఉద్యోగం కోసం స్కెచ్ అదిరింది.. కానీ సీన్ రివర్సయింది..
ఉద్యోగం కోసం స్కెచ్ అదిరింది.. కానీ సీన్ రివర్సయింది..
టెంపుల్ స్టైల్ స్వీట్ బూందీ..ఇంట్లోనే ఈజీగా తయారు చేసే విధానం!
టెంపుల్ స్టైల్ స్వీట్ బూందీ..ఇంట్లోనే ఈజీగా తయారు చేసే విధానం!
OTTలో రీసెంట్ సూపర్ హిట్ 'గరివిడి లక్ష్మి'! స్ట్రీమింగ్ డేట్ ఇదే
OTTలో రీసెంట్ సూపర్ హిట్ 'గరివిడి లక్ష్మి'! స్ట్రీమింగ్ డేట్ ఇదే
ఆరోగ్యకరమైన ఐరన్ రిచ్ పంప్‌కిన్ సీడ్ బటర్.. ఇంట్లోనే ఈజీగా తయారు
ఆరోగ్యకరమైన ఐరన్ రిచ్ పంప్‌కిన్ సీడ్ బటర్.. ఇంట్లోనే ఈజీగా తయారు
సేమియా పాయసం.. ఇలా చేస్టే టేస్ట్ నెక్ట్స్ లెవల్
సేమియా పాయసం.. ఇలా చేస్టే టేస్ట్ నెక్ట్స్ లెవల్
దీపావళి రాత్రి ఈ 10 పనులు అస్సలు చేయకండి.. లక్ష్మీదేవి అనుగ్రహం..
దీపావళి రాత్రి ఈ 10 పనులు అస్సలు చేయకండి.. లక్ష్మీదేవి అనుగ్రహం..
స్వీట్ షాప్ స్టైల్ లో ఇంట్లోనే.. ఈజీగా సోన్ పాపిడి
స్వీట్ షాప్ స్టైల్ లో ఇంట్లోనే.. ఈజీగా సోన్ పాపిడి
పూరీలు మెత్తగా నూనె పీల్చకుండా పొంగుతూ రావాలంటే.. ఈ టిప్స్ ఫాలో
పూరీలు మెత్తగా నూనె పీల్చకుండా పొంగుతూ రావాలంటే.. ఈ టిప్స్ ఫాలో