AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జెన్ జీ బీటా: అమ్మను జైల్లో పెట్టండి అంటూ.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మూడేళ్ల బుడ్డోడు.. వైరల్ వీడియో

పిల్లల అమాయకత్వం, వారు చేసే తుంటరి పనులు తరచూ సోషల్ మీడియాలో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. చిన్న చిన్న విషయాలకే అలిగి ఇంట్లో మూలన కూర్చోవడం లేదా ఏడవడం మనం చూస్తుంటాం. కానీ, ఒక మూడేళ్ల చిన్నారి మాత్రం తన చాక్లెట్ విషయంలో న్యాయం కోసం ఏకంగా పోలీస్ స్టేషన్ బాట పట్టాడు. తన తల్లిపై కేసు పెట్టాలంటూ ఒక పసివాడు పోలీస్ స్టేషన్‌లో హడావుడి చేసిన ఈ తమాషా ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జెన్ జీ బీటా: అమ్మను జైల్లో పెట్టండి అంటూ.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మూడేళ్ల బుడ్డోడు.. వైరల్ వీడియో
3 Year Old Complains To Police
Jyothi Gadda
|

Updated on: Aug 16, 2026 | 5:11 PM

Share

సాధారణంగా పిల్లలు చాక్లెట్ల కోసం ఇంట్లోనే అల్లరి చేస్తారు. కానీ, ఒక మూడేళ్ల బుడ్డోడు మాత్రం తన తల్లి ఎక్కువ చాక్లెట్లు తిన వద్దని వార్నింగ్ ఇచ్చి, చాక్లెట్ లాక్కోవడంతో నేరుగా పోలీస్ స్టేషన్‌కే వెళ్లిపోయాడు! తన తండ్రితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆ చిన్నారి, అక్కడ ఉన్న మహిళా పోలీస్ అధికారికి తన తల్లిపై ఫిర్యాదు చేశాడు. అసలేం జరిగిందంటే..

సమాచారం ప్రకారం.. ఒక చిన్నారి ఎక్కువ చాక్లెట్లు తింటుండటంతో, అతని తల్లి ఆరోగ్యం పాడవుతుందని భావించి ఆ చాక్లెట్‌ను లాక్కుంది. అంతేకాకుండా ఇకపై చాక్లెట్లు తినకూడదని కాస్త గద్దించింది. తల్లి చర్యతో తీవ్రంగా నొచ్చుకున్న ఆ బుడ్డోడు ఇంట్లో అల్లరి చేయకుండా, సమస్యను చట్టపరంగా పరిష్కరించుకోవాలని భావించాడు. వెంటనే తన తండ్రిని పట్టుకుని నేరుగా సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు.

ఇవి కూడా చదవండి

పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆ చిన్నారి అక్కడున్న మహిళా పోలీస్ అధికారి ముందుకు వెళ్లి తన బాధను చెప్పుకోవడం ప్రారంభించాడు. అమ్మ నా చాక్లెట్ లాక్కుంది, నన్ను కొట్టింది.. ఆమెపై కేసు రాయండి, జైల్లో పెట్టండి అంటూ ఎంతో సీరియస్‌గా కంప్లైంట్ ఇచ్చాడు. ఆ చిన్నారి సీరియస్‌నెస్‌ను చూసి అక్కడ ఉన్న పోలీసులందరికీ నవ్వు ఆగలేదు. కానీ, ఆ మహిళా పోలీస్ అధికారి మాత్రం ఆ పసివాడి అమాయకత్వాన్ని అర్థం చేసుకుని, ఒక పేపర్, పెన్ తీసుకుని అతని ఫిర్యాదును అధికారికంగా నోట్ చేసుకుంటున్నట్లు నటించారు.

ఆ మహిళా ఆఫీసర్ చిన్నారికి నచ్చజెబుతూ, పేపర్‌పై ఏదో రాస్తూ అతని సంతకం కూడా తీసుకుంటున్నట్లు సరదాగా గడిపారు. ఆ చిన్నారి ఎంత ఆత్మవిశ్వాసంతో తన పాయింట్‌ను పోలీసుల ముందు ఉంచాడో చూసి సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తూ.. ఈ కాలం పిల్లలు చాలా అడ్వాన్స్‌డ్ గా ఉన్నారు, చాక్లెట్ కోసం పోలీస్ స్టేషన్‌ వరకు వెళ్తాడని ఆ అమ్మ కలలో కూడా ఊహించి ఉండదు, పోలీస్ మేడమ్ సమయస్ఫూర్తి చాలా బాగుంది అంటూ సరదా కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా ఈ మూడేళ్ల చిన్నారి అమాయకత్వంతో కూడిన కంప్లైంట్ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తూ అందరి ముఖాల్లో నవ్వులు పూయిస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
సెప్టెంబర్ 7 రాశిఫలాలు: వీరికి ఈ రోజు పట్టిందల్లా బంగారమే..
సెప్టెంబర్ 7 రాశిఫలాలు: వీరికి ఈ రోజు పట్టిందల్లా బంగారమే..
బంగారం, వెండి కొనేవారికి శుభవార్త.. మళ్లీ తగ్గుతున్న ధరలు
బంగారం, వెండి కొనేవారికి శుభవార్త.. మళ్లీ తగ్గుతున్న ధరలు
దారుణ హత్య.. మహిళ గొంతులో కత్తెరలు దింపి మర్డర్‌! ఎక్కడంటే..
దారుణ హత్య.. మహిళ గొంతులో కత్తెరలు దింపి మర్డర్‌! ఎక్కడంటే..
మహిళ కడుపులో 14 పెన్నులు, 5 చెంచాలు.. డాక్టర్లు ఏం చేశారంటే?
మహిళ కడుపులో 14 పెన్నులు, 5 చెంచాలు.. డాక్టర్లు ఏం చేశారంటే?
ఇక వీరి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు.. కష్టాలకు ఫుల్ స్టాప్
ఇక వీరి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు.. కష్టాలకు ఫుల్ స్టాప్
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు
మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?
మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..