Viral Video: మీరు తినే రుచికరమైన నూడుల్స్ వెనుక అసలు నిజం ఇదేనా..? ఒక్కసారి ఈ వీడియో చూశారంటే..
నూడుల్స్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఎంతో ఇష్టమైన ఆహారం. సాయంత్రం కాగానే వేడివేడిగా మసాలా నూడుల్స్ తింటూ సరదాగా సమయాన్ని గడుపుతుంటారు. అయితే, మన మార్కెట్లలో లభించే ఈ నూడుల్స్ అసలు ఎలాంటి వాతావరణంలో తయారవుతున్నాయి? వాటి పరిశుభ్రత ఎంతవరకు నిజం? అనే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేలా ఉన్న ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు నూడుల్స్ తినాలంటేనే భయపడిపోతున్నారు.

సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. దాన్ని చూశాక మీరు నూడుల్స్ తినే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించవచ్చు. ఈ వీడియోను కుందన్ పటేల్ అనే యూజర్ షేర్ చేశారు. దాని క్యాప్షన్ కారంగా, రుచికరంగా ఉండే నూడుల్స్ రుచి వెనుక ఉన్న రహస్యం బయటపడింది. పిల్లలు నూడుల్స్‌ను ఇష్టపడతారని, చాలా మంది పెద్దలు కూడా వాటి రుచిని ఇష్టపడతారని, అయితే అసలు ప్రశ్న ఏమిటంటే ఈ రుచి ఎక్కడి నుండి వస్తుంది..? దానిని ఎలా తయారు చేస్తారు? అనేదేనని ఆ పోస్ట్ వివరిస్తుంది. ఈ వీడియో ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి వచ్చింది. ఆ సమాధానం చూసి ప్రజలు నివ్వెరపోయారు.
కుందన్ పటేల్ అనే యూజర్ ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో ఒక నూడుల్స్ ఫ్యాక్టరీ దృశ్యాలు కనిపిస్తున్నాయి. అందులో ఏమాత్రం పరిశుభ్రత పాటించకుండా, నేరుగా నేలపైన నూడుల్స్ రాశులుగా పోసి ఉన్నాయి. ఒక వ్యక్తి ఆ మురికి నేలపైనే కూర్చుని ఎటువంటి గ్లౌజులు, మాస్క్ వేసుకోకుండా చేతులతోనే నూడుల్స్‌ను తూకం వేస్తూ ప్యాకింగ్ చేయడానికి సిద్ధం చేస్తున్నాడు. ఆ గది పరిసరాల్లో డస్ట్, వైర్లు, పాత ఫ్యాన్లు, పైపులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. శుభ్రత లేని ఇటువంటి వాతావరణంలో తయారైన నూడుల్స్‌ను అందంగా ప్యాక్ చేసి మార్కెట్లలో విక్రయిస్తున్నారని తెలిసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.
ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. “ఈ వీడియో చూశాక బయటి తిండిపై నమ్మకం పోయింది. ఇకపై నూడుల్స్ తినాలనే కోరికే చచ్చిపోయింది అని కొందరు కామెంట్స్ చేయగా, మరికొందరు అధికారుల నిర్లక్ష్యాన్ని నిలదీశారు. ఆహార భద్రతా శాఖ ఇటువంటి ఫ్యాక్టరీలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇవి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నాయని కామెంట్ల రూపంలో డిమాండ్ చేస్తున్నారు.
मसालेदार टेस्टी नूडल का स्वाद का राज खुल गया👀
बच्चों को नूडल बहुत पसंद रहते हैं कुछ बड़े लोगों को भी इसका स्वाद अच्छा लगता है स्वाद कहा है आता है कैसे आता है आपके हर बाइट में जो रेस्ट आता है यहां से आता है इसमें आपको सारे विटामिन फ्री में मिल रहे हैं जिसको खाने से आपको अलग तरह… pic.twitter.com/RtpGY5TiYx
— KUNDAN PATEL (@KUNDAN00PATEL) August 14, 2026
బయటి ఆహారపదార్థాలైన నూడుల్స్, ఫాస్ట్ ఫుడ్ ప్యాకెట్ల ఆకర్షణీయమైన ప్యాకింగ్ చూసి కొనుగోలు చేసే ముందు, అవి తయారయ్యే విధానాన్ని కూడా గమనించడం చాలా అవసరమని ఈ వీడియో నిరూపిస్తోంది. అపరిశుభ్ర వాతావరణంలో తయారయ్యే ఇలాంటి పదార్థాలు తినడం వల్ల జీర్ణకోశ వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు వస్తాయని, వైద్యుల వద్దకు తిరగాల్సి వస్తుందని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా చిన్న పిల్లలకు ఇటువంటి ఫాస్ట్ ఫుడ్స్ దూరంగా ఉంచడమే మంచిదని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.




