AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తోటకూర వీళ్లకు యమడేంజర్ తింటే ఏం జరుగుతుందో తెలిస్తే మైండ్ బ్లాంకే..

తోటకూర ఆరోగ్యానికి మంచిదే.. కానీ అందరికీ కాదట.. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ ఆకుకూర తింటే నేరుగా గుండె, కిడ్నీలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా ఈ 5 లక్షణాలు ఉన్నవారు తోటకూర తింటే ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు.

తోటకూర వీళ్లకు యమడేంజర్ తింటే ఏం జరుగుతుందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
Amaranth Leaves Side Effects
Krishna S
|

Updated on: Aug 16, 2026 | 6:48 PM

Share

ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఇక తోటకూర చాలా మందికి ఇష్టం. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అయితే తోటకూర ఆరోగ్యానికి మంచిదే కదా అని అందరూ తినకూడదని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ ఎస్. స్వాతి హెచ్చరిస్తున్నారు. కొన్ని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు తోటకూర తింటే అది శరీరానికి మేలు చేయడం కంటే ఎక్కువ హాని కలిగిస్తుందని చెబుతున్నారు. ప్రధానంగా కిడ్నీలో రాళ్లు ఉన్నవాళ్లు వీటికి దూరంగా ఉండడడం మంచిది. తోటకూరలో ఆక్సలేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని కాల్షియంతో కలిసి కిడ్నీలో రాళ్లుగా రూపాంతరం చెందుతాయి. ఇప్పటికే మూత్రపిండాల్లో రాళ్లతో బాధపడుతున్నవారు తోటకూరను తరచూ తీసుకుంటే ఆ రాళ్ల సైజు మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఫలితంగా తీవ్రమైన కడుపునొప్పి, మూత్ర విసర్జనలో మంట వంటి సమస్యలు తలెత్తుతాయి.

కిడ్నీ వ్యాధిగ్రస్తులు, డయాలసిస్ పేషెంట్లు

తీవ్రమైన మూత్రపిండాల సమస్య ఉన్నవారు లేదా డయాలసిస్ చేయించుకుంటున్నవారు తోటకూరకు పూర్తిగా దూరంగా ఉండాలి. ఇందులో పొటాషియం పరిమాణం చాలా ఎక్కువ. బలహీనపడిన మూత్రపిండాలు రక్తంలోని అదనపు పొటాషియంను బయటకు పంపలేవు. రక్తంలో పొటాషియం అధికమైతే అది నేరుగా గుండెపై ప్రభావం చూపి, గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది.

యూరిక్ యాసిడ్ – గౌట్ సమస్య

శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండేవారు, గౌట్సమస్యతో బాధపడేవారు తోటకూరను తీసుకోకపోవడమే మంచిది. ఇందులో ఉండే ప్యూరిన్లు శరీరంలో యూరిక్ యాసిడ్‌గా మారి, కీళ్లలో స్పటికాలుగా పేరుకుపోతాయి. దీనివల్ల కీళ్లలో వాపు, భరించలేని నొప్పి వచ్చి నడవటం కూడా కష్టంగా మారుతుంది.

బ్లడ్ థిన్నర్ మాత్రలు వాడేవారు

గుండె జబ్బులు, బైపాస్ సర్జరీ అయినవారు, పక్షవాతం బారిన పడినవారు రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు రోజూ బ్లడ్ థిన్నర్స్ తీసుకుంటుంటారు. తోటకూరలో విటమిన్ కె అధికంగా ఉంటుంది. ఇది సహజంగా రక్తాన్ని గడ్డకట్టేలా చేస్తుంది. దీనివల్ల బ్లడ్ థిన్నర్ మందుల పనితీరు దెబ్బతిని, గుండెపోటు వచ్చే ముప్పు మళ్లీ పెరుగుతుంది.

జీర్ణ సమస్యలు ఉన్నవారు

గ్యాస్, అజీర్ణం, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వంటి జీర్ణ సమస్యలు ఉన్నవారు తోటకూరను మితంగా తీసుకోవాలి. తోటకూరలోని అధిక పీచు పదార్థం జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారిలో కడుపు ఉబ్బరం, గ్యాస్, తీవ్రమైన పొత్తికడుపు నొప్పికి కారణమవుతుంది.

Follow Us
తోటకూర వీళ్లకు యమడేంజర్ తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
తోటకూర వీళ్లకు యమడేంజర్ తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌..సోమవారం ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌..సోమవారం ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
అందుకే రైతులకు డబ్బులు ఇవ్వలేదు: బిగ్‌బాస్‌ విజేత పల్లవి ప్రశాంత్
అందుకే రైతులకు డబ్బులు ఇవ్వలేదు: బిగ్‌బాస్‌ విజేత పల్లవి ప్రశాంత్
దూసుకొస్తున్న గండం.. ఏపీలో సోమవారం వాతావరణం ఎలా ఉంటుంది..?
దూసుకొస్తున్న గండం.. ఏపీలో సోమవారం వాతావరణం ఎలా ఉంటుంది..?
ఛీ, ఇంత స్వార్థపరుడనుకోలే.. మనోడు కూడా మోసం చేస్తాడనుకోలే..
ఛీ, ఇంత స్వార్థపరుడనుకోలే.. మనోడు కూడా మోసం చేస్తాడనుకోలే..
ట్రాఫిక్ లైట్లలో ఎరుపు,పసుపు, ఆకుపచ్చ రంగులనే ఎందుకు ఉపయోగిస్తారు
ట్రాఫిక్ లైట్లలో ఎరుపు,పసుపు, ఆకుపచ్చ రంగులనే ఎందుకు ఉపయోగిస్తారు
రూ. 16లకే షాపింగ్ ఆఫర్.. ఒక్కసారిగా విరుచుకుపడ్డ జనం.. కట్ చేస్తే
రూ. 16లకే షాపింగ్ ఆఫర్.. ఒక్కసారిగా విరుచుకుపడ్డ జనం.. కట్ చేస్తే
చిన్న ట్రిక్ లక్షలు మిగిల్చింది..
చిన్న ట్రిక్ లక్షలు మిగిల్చింది..
వ్యాయామాలు లేకుండానే పొట్ట తగ్గించే జపనీయుల 5 ఉదయపు అలవాట్లు
వ్యాయామాలు లేకుండానే పొట్ట తగ్గించే జపనీయుల 5 ఉదయపు అలవాట్లు
తల్లి చీరలో తళుక్కుమన్న త్రిష.. బ్యూటిఫుల్ ఫొటోస్ ఇదిగో
తల్లి చీరలో తళుక్కుమన్న త్రిష.. బ్యూటిఫుల్ ఫొటోస్ ఇదిగో