AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాలకూరతో ఇలా ఒక్కసారి చేసి చూడండి.. నోట్లో వెన్నలా కరిగిపోతూ అన్నం మొత్తం ఖాళీ అయిపోతుంది!

రోజూ ఇంట్లో ఆకుకూరలు వండితే పిల్లలు ముఖం తిప్పుకుంటుంటారా? శరీరానికి ఎంతో మేలు చేసే ఐరన్, ప్రోటీన్లు పాలకూరలో పుష్కలంగా ఉంటాయి. అలాంటి పాలకూరను ఎప్పుడూ ఒకేలా పప్పులో కాకుండా, కాస్త నానబెట్టిన పెసరపప్పుతో కలిపి వేపుడు చేస్తే ముద్ద ముద్దకి ఎంతో కమ్మగా ఉంటుంది. పెద్దలకు, చిన్నపిల్లలకు ఎంతో ఇష్టమయ్యే ఈ రుచికరమైన పాలకూర వేపుడును కేవలం పది నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

Phani CH
|

Updated on: Aug 16, 2026 | 5:42 PM

Share
పాలకూర వేపుడు కు కావలసిన పదార్థాలు: రెండు కట్టలు తాజా పాలకూర, రెండు టేబుల్ స్పూన్లు నానబెట్టిన పెసరపప్పు, ఆరు నుండి ఏడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి, నిలువుగా తరిగిన పెద్ద రెండు ఉల్లిపాయలు, పల్లీ నూనె, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, తాజా అల్లం ముద్ద, పసుపు, ఉప్పు, ఒకటి చింతపండు రెబ్బ, ధనియాల పొడి మరియు కొత్తిమీర.

1 / 5
తయారీ విధానం: ముందుగా పాలకూరను ఉప్పు నీళ్లలో నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగి, నీరంతా కారిపోయాక సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే రెండు చెంచాల పెసరపప్పును ముందుగానే నీటిలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయిలో రెండు చెంచాల పల్లీ నూనె వేసి వేడిచేయాలి. ఆకుకూరలకు పల్లీ నూనె వాడితే చక్కటి రుచి, సువాసన వస్తాయి.

2 / 5
నూనె వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత నానబెట్టిన పెసరపప్పు, చిటికెడు తాజా అల్లం ముద్ద వేసి నూనెలో దోరగా వేపాలి. పెసరపప్పు వేగాక నిలువుగా చీల్చిన ఉల్లిపాయ ముక్కలు వేసి కలపాలి. మూతపెట్టి చిన్న మంటపై రెండు నిమిషాలు మగ్గనిస్తే ఉల్లిపాయలు మెత్తబడతాయి.

3 / 5
ఆ తర్వాత చిటికెడు పసుపు వేసి కలపాలి. ఇప్పుడు తరిగి ఉంచుకున్న పాలకూరను ఇందులో వేసి అంతా కలిసేలా కలపాలి. ఆకుకూర త్వరగా ఉడకడానికి, చక్కటి రుచి కోసం ఒక చిన్న చింతపండు రెబ్బను మధ్యలో పెట్టి మూతపెట్టాలి. ఆవిరికే పాలకూర, చింతపండు రెబ్బ మెత్తగా మగ్గిపోతాయి.

4 / 5
పాలకూర మగ్గిన తర్వాత కారం పొడి వాడకుండా, కేవలం రుచికి సరిపడా ఉప్పు, అప్పటికప్పుడు నూరిన ధనియాల పొడి వేసి కలపాలి. చిన్న మంటపై రెండు నిమిషాలు మూతపెట్టి మగ్గనిస్తే మసాలాలన్నీ పాలకూరకు చక్కగా పడతాయి. చివరగా సన్నగా తరిగిన తాజా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆపేయాలి. అంతే, నోరూరించే పాలకూర పెసరపప్పు వేపుడు సిద్ధం! వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ వేపుడుతో తింటే ఒక్కొక్క ముద్ద నోట్లో వెన్నలా కరిగిపోతుంది. 

5 / 5
Follow Us
పాలకూరతో ఇలా ఒక్కసారి చేసి చూడండి.. నోట్లో వెన్నలా కరిగిపోతుంది

బర్త్ టూరిజంపై అమెరికా ఉక్కుపాదం.. నెల రోజుల్లో 600 వీసాలు రద్దు!

వార్నీ.. థంబ్స్‌అప్‌ ఎమోజీ అర్థం అది కాదా..? నెట్టింట హాట్ టాపిక్

తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు

ఆధార్‌ అప్‌డేట్‌కు ఇక సెంటర్‌ అవసరం లేదు

ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వల్ల కాలేదు

90శాతం మందికి తెలియని వాషింగ్ మెషీన్ సీక్రెట్ ట్రిక్..

ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు

ఎకరం వరి సాగుకు ఎంత పెట్టుబడి అవసరం? దేనికి ఎంత ఖర్చు అవుతుంది..?

27 ఏళ్ల వయసులోనే టాలీవుడ్ హీరోయిన్ హఠాన్మరణం.. కారణమేమిటంటే?