AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సరదా విదేశాలకు వెళ్లి వస్తుంటే.. ఏంటో అనుకున్నారు.. అనుమానంతో ఆరా తీస్తే మైండ్ బ్లాక్..!

నెల్లూరులో చాలా రోజుల నుంచి బెట్టింగ్ మాఫియా ఆగడాలు బయటపడుతూనే ఉన్నాయి.. ఇందులో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కూడా ఉందన్న ఆరోపణలు వచ్చాయి అప్పట్లో..! నెల్లూరులో గత కొన్నేళ్లుగా బెట్టింగ్ మాఫియా అంతరించిపోయిందని అంతా అనుకున్నారు. కానీ చాప కింద నీరులా బెట్టింగ్ మాఫియా ఆగడాలు యథావిధిగానే కొనసాగాయి.

సరదా విదేశాలకు వెళ్లి వస్తుంటే.. ఏంటో అనుకున్నారు.. అనుమానంతో ఆరా తీస్తే మైండ్ బ్లాక్..!
Betting Racket Busted
Ch Murali
| Edited By: |

Updated on: Mar 04, 2026 | 7:11 PM

Share

నెల్లూరులో చాలా రోజుల నుంచి బెట్టింగ్ మాఫియా ఆగడాలు బయటపడుతూనే ఉన్నాయి.. ఇందులో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కూడా ఉందన్న ఆరోపణలు వచ్చాయి అప్పట్లో..! నెల్లూరులో గత కొన్నేళ్లుగా బెట్టింగ్ మాఫియా అంతరించిపోయిందని అంతా అనుకున్నారు. కానీ చాప కింద నీరులా బెట్టింగ్ మాఫియా ఆగడాలు యథావిధిగానే కొనసాగాయి. ఒకప్పుడు నెల్లూరు తమిళనాడు కేంద్రంగా జరిగిన బెట్టింగులు నేడు దేశ విదేశాలకు విస్తరించాయి. విజిటింగ్ వీసాలతో దుబాయ్, బ్యాంకాక్, శ్రీలంక, మలేషియా తోపాటు విదేశాలకు వెళ్లి, నెల రోజులపాటు అక్కడే ఉండి, బెట్టింగ్ గురించి పూర్తిగా తెలుసుకుని నెల్లూరుకు వచ్చి ఆ బెట్టింగ దండాను ఇక్కడ విస్తరిస్తున్నారు కేటుగాళ్లు.

ఒక చిన్న కంప్లైంట్ తో విచారణ మొదలుపెట్టిన నెల్లూరు పోలీసులు విదేశాల బెట్టింగ్ రాకెట్‌ను బయటకు లాగారు. ఈ బెట్టింగ్ రాకెట్‌లో ఇద్దరు ఇంటర్నేషనల్ బెట్టింగ్ రాయుళ్లను గుర్తించారు. నెల్లూరులోనే ఉంటూ రెండు మూడు నెలలకు ఒకసారి విజిటింగ్ వీసాల పేరుతో విదేశాలకు వెళ్లి అక్కడ బెట్టింగ్ వ్యవహార శైలిని నేర్చుకుని వస్తున్నారు. ఇక్కడికి వచ్చి సామాన్యులకు వల వేసి బెట్టింగ్ ముగ్గులోకి లాగుతున్నారు. ఎట్టకేలకు ఇద్దరు కేటుగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విస్తుపోయే వాస్తవాలను గుర్తించారు.

బాలాజీ‌నగర్ పోలీస్ స్టేషన్ పరధిలో ఫిబ్రవరి 19వ తేదీ బెట్టింగ్‌పై ఓ కంప్లైంట్ వచ్చింది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నారని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వెంటనే స్పందించిన బాలాజీ నగర్ పోలీసులు బుచ్చిరెడ్డిపాలెంలోని ఇంటిపై రైడ్ చేశారు. దీంతో వెంకటరమణ, వెంకటేశ్వర్లు అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. అలాగే వారి వద్ద నుంచి రూ.34.65 లక్షల నగదు తోపాటు ల్యా‌ప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు సహా వారి అకౌంట్లలో ఉన్న రూ.1.64 కోట్లను ఫ్రీజ్ చేశారు పోలీసులు. అయితే పోలీస్ రైడ్‌లో మరో ఇద్దరు బెట్టింగ్ రాయుళ్లు అక్కడి నుంచి పారిపోయారు. పారిపోయిన వారి గురించి విచారించిన పోలీసులకు వారికి బినామీలు మాత్రమేనని, వీరి వెనక మరో ఇద్దరు బెట్టింగ్ డాన్‌లు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.

మరో ఇద్దరు మహేష్ ,హరికృష్ణ అనే వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ మూడు నెలలకు ఒకసారి దుబాయ్, బ్యాంకాక్, శ్రీలంక, మలేషియా వంటి దేశాలకు విజిటింగ్ వీసాలతో వెళ్తారు. అక్కడ పలు యాప్‌లలో బెట్టింగ్ విధానాన్ని పూర్తిగా తెలుసుకుని ఇండియాకు తిరిగి వస్తారు. అదే యాప్‌ల సాయంతో అక్కడి వారితో కలిసి బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ బెట్టింగ్‌లో కొత్తగా బి టు బి అంటే బిజినెస్ టు బిజినెస్ అనే విధానాన్ని అవలంబిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రతి బాల్‌కు ప్రతి క్యాచ్‌కు ఒక రేటును ఫిక్స్ చేస్తారు. అయితే ఈ బి టు బి విధానంలో ఎవరు నష్టపోయిన మహేష్, హరికృష్ణ అనే వారికి మాత్రం లక్షల్లో రాబడి వస్తుంది. తీగ లాగితే దొంగ కదిలినట్టు బుచ్చిరెడ్డిపా లెంలో పోలీసుల రైడ్ చేస్తే విదేశాల్లో బెట్టింగ్ వ్యవహారం బయటకు వచ్చింది. ఈ వ్యవహారంలో మహేష్ హరికృష్ణలతో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us