Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amitabh: అసలు కంటే వడ్డీ ముద్దని ఇందుకే అంటారేమో.. మనవరాలికి కోపం వస్తే.. ప్రసన్నం కోసం బిగ్ బీ పడే తిప్పలు ఏమిటో తెలుసా..

తనతో ఆరాధ్య బంధాన్ని పంచుకుంటూ, అమితాబ్ బచ్చన్ తన మనవరాలు ఆదివారం ఖాళీగా ఉన్నప్పుడు, సెలవులు ఉన్నప్పుడు తాను ఎక్కువ సమయం ఆరాధ్యతోనే గడపడానికి ప్రయత్నిస్తానని చెప్పారు

Amitabh: అసలు కంటే వడ్డీ ముద్దని ఇందుకే అంటారేమో.. మనవరాలికి కోపం వస్తే.. ప్రసన్నం కోసం బిగ్ బీ పడే తిప్పలు ఏమిటో తెలుసా..
Amitabh Bachchan
Follow us
Surya Kala

|

Updated on: Sep 22, 2022 | 5:06 PM

Amitabh Bachchan: బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒకరు. సామాన్యుడిగా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి అసామాన్యుడిగా ఎదిగారు. అశేష అభిమానులను సొంతం చేసుకున్న అమితాబ్ బచ్చన్.. బాలీవుడ్ మెగాస్టార్ గా పేరుగాంచారు. ఓ వైపు వెండి తెరపై వయసుకి తగిన పాత్రలను పోషిస్తునే.. బుల్లితెరపై హోస్ట్ గానూ అలరిస్తున్నారు. ఓ వైపు నటుడిగా మరోవైపు తన వ్యక్తిగత జీవితంలో కూడా వార్తలతో నిలుస్తుంటారు.  ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తోన్న క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి గురించి చర్చిస్తున్నారు. KBC తాజా ఎపిసోడ్ బిగ్ బికి చాలా ప్రత్యేకమైనది. ఈసారి బిగ బీ తన మనవరాలు ఆరాధ్యకు సంబంధించిన ఒక ప్రత్యేక ప్రశ్నను అడిగారు. 20 ఏళ్ల యువతికి ఆ ప్రశ్నను సంధించారు.

KBC సీజన్ 14  తాజా ఎపిసోడ్‌లో.. అమితాబ్ బచ్చన్ బలమైన పోటీదారుని ఎదుర్కొన్నారు. 20 ఏళ్ల వైష్ణవి కుమారి హాట్ సీట్‌లో బిగ్ బీ ముందుకొచ్చారు. అయితే ఈ ఎపిసోడ్‌ స్పెషల్ ఏమిటంటే.. హాట్ సీట్ లో కూర్చున్న వైష్ణవి ప్రశ్నలను సంధించింది. అవును.. హాట్ సీట్ మీద కూర్చున్న వెంటనే వైష్ణవి.. హోస్ట్ అమితాబ్‌ ప్రశ్నను అడగక ముందే.. తానే ప్రశ్నలు వేసింది. దానికి అమితాబ్ కూడా చాలా ఫన్నీగా సమాధానమిచ్చారు. ఈ సమాధానం వింటే ఎవరైనా సరే.. అసలు కంటే వడ్డీ ముద్దు అందుకే అంటారు ఏమో..

ఇవి కూడా చదవండి

మీ మనవరాలు ఆరాధ్య బచ్చన్‌తో మీరు ఎంత సమయం గడుపుతారు?అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ఆరాధ్యతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నానని, అందుకు ప్రతిఫలంగా చాలా క్యూట్‌ పరిహారాన్ని ఇస్తున్నానని చెప్పారు.

అంతేకాదు బిగ్ బి మాట్లాడుతూ తాను ఉదయం 7-7:30 గంటలకు పనికి బయలుదేరుతాను.. అందుకనే తాను ఆరాధ్యతో తక్కువ సమయం గడుపుతున్నట్లు చెప్పారు.  అదే సమయంలో.. ఆరాధ్య 8 గంటలకు తన పాఠశాలకు వెళుతుంది. ఆ తర్వాత 3-4 గంటలకు ఇంటికి తిరిగి వచ్చి హోంవర్క్ చేస్తుంది. ఇక తాను షూటింగ్స్ ను కంప్లీట్ చేసుకుని ఇంటికి చేరేసరికి 10-11 గంటలవుతోంది. అప్పటి తన మనవరాలు ఆరాధ్య నిద్రపోతుంది. అని తనకు, మనవరాలికి ఉన్న రోజువారీ షెడ్యూల్ ను చెప్పారు. అంతేకాదు.. తన మనవరాలు ఆరాధ్యకు కోపం వచ్చినప్పుడు తాను ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలను కూడా బిగ్బీ పంచుకున్నారు.

మనవరాలు కోపంగా ఉన్నప్పుడు.. వెంటనే తాను ఆమెతో ఆడుకుంటానని.. అమితాబ్ బచ్చన్ చెప్పారు. తనతో ఆరాధ్య బంధాన్ని పంచుకుంటూ, అమితాబ్ బచ్చన్ తన మనవరాలు ఆదివారం ఖాళీగా ఉన్నప్పుడు, సెలవులు ఉన్నప్పుడు తాను ఎక్కువ సమయం ఆరాధ్యతోనే గడపడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. తనపై తన మనవరాలికి కోపం వచ్చినప్పుడు.. వెంటనే చాక్లెట్లు ఇచ్చి వేడుక జరుపుకుంటానని తెలిపారు. ఒక లేడీ హెడ్‌ బ్యాండ్‌ను చూపిస్తూ.. ఆరాధ్యకు పింక్ రంగు చాలా ఇష్టమైన రంగు అని బిగ్ బి చెప్పారు. కనుక ఆరాధ్యకు పింక్ కలర్ హెడ్‌బ్యాండ్, క్లిప్‌లను ఇస్తానని.. వెంటనే ఆరాధ్య కోపం వెంటనే చల్లారుతుందని తన మనవరాలి గురించి ఇష్టంగా చెప్పారు బిగ్ బీ అమితాబ్.

మరిన్నిఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి
పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి
TVలో క్రైం షోలు చూసి భార్యను చంపిన భర్త.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
TVలో క్రైం షోలు చూసి భార్యను చంపిన భర్త.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
వామ్మో.. మరో కొత్త వైరస్ వచ్చేసింది.. కోల్‌కతా మహిళకు పాజిటివ్‌..
వామ్మో.. మరో కొత్త వైరస్ వచ్చేసింది.. కోల్‌కతా మహిళకు పాజిటివ్‌..
లండన్‌లో ల్యాండైన మెగాస్టార్..
లండన్‌లో ల్యాండైన మెగాస్టార్..
వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఇలా చేయండి..వీడియో
వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఇలా చేయండి..వీడియో
ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..
ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..
మా కళ్ల ముందే ఇద్దరిని కాల్చి చంపారు..ఐడీ కార్డులు చెక్‌ చేసి..వీ
మా కళ్ల ముందే ఇద్దరిని కాల్చి చంపారు..ఐడీ కార్డులు చెక్‌ చేసి..వీ
శ్రీలీల,కార్తిక్‌ ఆర్యన్‌ డేటింగ్‌.. హీరో తల్లి షాకింగ్ కామెంట్స్
శ్రీలీల,కార్తిక్‌ ఆర్యన్‌ డేటింగ్‌.. హీరో తల్లి షాకింగ్ కామెంట్స్
పిచ్చి పీక్‌ స్టేజ్‌లో.. బతికి ఉన్న బొద్దింకతో కృతిమ గోరు తయారీ
పిచ్చి పీక్‌ స్టేజ్‌లో.. బతికి ఉన్న బొద్దింకతో కృతిమ గోరు తయారీ
10th విద్యార్ధులకు అలర్ట్.. జవాబు పత్రాల మూల్యంకనం ఎప్పట్నుంచంటే!
10th విద్యార్ధులకు అలర్ట్.. జవాబు పత్రాల మూల్యంకనం ఎప్పట్నుంచంటే!